సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్‌లను తయారుచేస్తున్నాయి.
సాంఖ్యల్యాబ్స్
మైండ్‌గ్రోడ్
టెర్మినస్ సర్క్యూట్స్
మార్ఫింగ్ మిషన్
ఫెర్మియానిక్
ఓక్టర్
ఆగ్నిట్
ఇన్‌కోర్
సైన్‌ఆఫ్
సిలిజియం సర్క్యూట్స్
ఔరసెమి
సెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్‌తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్‌ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment