సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.7 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛన్ ప థకాన్ని రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పున రుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం(టీఎస్ సీపీఎస్ ఈయూ) కోరింది. ఈ మే రకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి సమగ్ర నివే దిక అందజేసింది. పాత పింఛన్ విధానం అమలు ఆవశ్యకత, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్న తీరు ను గురించి నివేదికలో పేర్కొంది.
పాత పింఛన్ అమలు ద్వారా ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ల నిర్వహణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదని, ప్రతి ఉద్యోగి తన బేసిక్‌లో 6 నుంచి 20 శాతం వరకు జమ చేసుకునే అవకాశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వపొదుపు నిల్వలు పెరుగుతా యని యూనియన్ నేతలు వివరించారు.
తమ నివే దికలోని అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ పాత పింఛన్ విధానం అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీశ్‌ను కలిసిన వారిలో యూని యన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్య క్షుడు నరేందర్‌రావు, హాజి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment