పండుటాకులపై టీడీపీ కక్ష ! | - | Sakshi
Sakshi News home page

పండుటాకులపై టీడీపీ కక్ష !

Published Tue, Jul 2 2024 12:16 AM | Last Updated on Tue, Jul 2 2024 10:35 AM

పండుట

పండుటాకులపై టీడీపీ కక్ష !

ఎమ్మెల్యే పుట్టా ఫిర్యాదుతో 94 మందికి అందని పింఛన్‌

పింఛన్‌ పంపిణీని ఆపించిన ఎంపీడీఓ రహంతుల్లయ్య

ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు పి.నరసింహులు. టీఓపల్లె గ్రామానికి చెందిన ఇతను 2014 టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి డప్పు కళాకారుడిగా పింఛన్‌ పొందుతున్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకు ప్రమాదం జరిగింది. పింఛన్‌ డబ్బులు మీదే ఆధారపడి భార్యను పోషించుకుంటున్నాడు. ‘గత నెల వరకూ పింఛన్‌ వచ్చింది.. ఈ నెలలో ఇవ్వలేదు. ఇదేమనడిగితే ఉన్నతాధికారులు ఆపమన్నారని చెబుతున్నా’రని వాపోయాడు.

ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు ఆలూరు సీతారాములు. టీఓపల్లె పంచాయతీ రేపల్లెకు చెందిన ఇతనికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇస్తున్న రూ.200ల వికలాంగ పింఛన్‌ పొందుతున్నాడు. గత నెల వరకూ వికలాంగత్వ పింఛను పొందాడు. ఈ నెలలో పింఛన్‌ కోసం వెళ్లగా తనకు ఇవ్వడం లేదని వాపోయాడు. తన వికలాంగ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ఇస్తామని అధికారులు చెబుతున్నారని. కావాలనే గ్రామంలోని టీడీపీ నాయకులు తన పింఛను ఆపిస్తున్నారని, తన చేతిని చూసి కూడా పింఛన్‌ ఆపటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.

చాపాడు : ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ‘మీ భద్రతే .. మా బాధ్యత’ అంటూ ఊదరగొట్టింది. అవన్నీ మాటలకే అంటూ మరోసారి రుజువు చేసింది. అన్ని అర్హతలున్నా పింఛన్‌ ఇవ్వకుండా నిరుపేద పండుటాకులకు, దివ్యాంగులకు మోసం చేసింది. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామ పంచాయతీలో 94 మంది పింఛన్‌ దారులకు డబ్బులు పంపిణీ చేయకుండా వారి కన్నీళ్లకు కారణమైంది. 

స్వయానా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మూడు పంచాయతీలకు చెందిన 94 మంది పింఛన్‌దారులకు అర్హతలను పునర్విచారణ చేసిన తర్వాతనే డబ్బులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జరిగిన పింఛన్‌ పంపిణీలో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన 94 మందికి పింఛన్‌ డబ్బులను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి పింఛన్‌ డబ్బుల కోసం ఎదురుచూసిన సదరు లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. పదేళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్నామని ఈ సారి తమకెందుకు పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని, తామేమి పాపం చేశామని బాధితులు వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీ వర్గీయులన్న కారణంగా పింఛన్లు ఆపారని ఆయా గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.

ఎంపీడీఓ ఏమన్నారంటే..
మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో 94మందికి పింఛన్‌లను ఆపడంపై ఎంపీడీఓ రహంతుల్లయ్యను వివరణ కోరగా.. ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, డీఆర్‌డీఏ పీడీ నుంచి 94 మంది పింఛన్లను వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్‌ చేసిన తర్వాత పింఛన్ల పంపిణీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పింఛన్‌ డబ్బులు అందని బాధితులు..
మండలంలోని మడూరు పంచాయతీలో వృద్ధాప్య పింఛను పొందుతున్న ఎం.శివారెడ్డి, మబ్బులు, కె.మహమ్మద్‌ షరీఫ్‌, మాలబాల సుబ్బారెడ్డి, కట్టుబడి సాసేన్‌ వలి, మాబు షరీఫ్‌, సాకం చిన్న సుబ్బారెడ్డి, పర్లపాటి షేక్‌ రసూల్‌, బాషా, రామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, కల్లెగాల్ల చెన్నమ్మ, చంటి సుబ్బయ్య, ఆవుల గుర్రప్ప, కాలేబు, సానెపల్లె బయపురెడ్డి, లక్షుమ్మ, ఆళ్లగడ్డ దానం, బొగ్గుల రాజమ్మ, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, శేషారెడ్డి, పెద్ద లక్ష్మీరెడ్డి, వికలాంగులైన లక్ష్మీప్రియ, సాకం నాగసూయమ్మ, సుభానీ, మహబూబ్‌ బాషా, రంగాగాళ్ల లలితమ్మ, సుబ్బమ్మ, డప్పు పింఛన్‌దారులు సుబ్బరాయుడు, కల్లగాల్ల సుబ్బరాయుడు, చిన్నటిగాళ్ల సుబ్బరాయుడు, చెప్పులు కుట్టేవారు అంకన్న, పెద్ద ఓబయ్య, బాల ఓబయ్య, అభయహస్తం, వితంతువు మునెమ్మ ఉన్నారు. అలాగే అన్నవరంలో.. వృద్దాప్య పింఛన్‌ దారులు పల్లవోలు ప్రసాద్‌రెడ్డి, ఆలూరు పీరయ్య, బాషా, వీరనారాయణ, గంగిరెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, కుల్లాయిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, పెద్ద కొండారెడ్డి, కాసా వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి, సంజీవరెడ్డి, జాకోబ్‌, చిన్న సుబ్బరాయుడు, వికలాంగులైన ఆదినారాయణరెడ్డి, చింతకుంట పైద్దీన్‌, ఇందిరమ్మ, కానాల మేరి, గంగయ్య, రామిరెడ్డి, రామ ఓబులరెడ్డి, అశ్వని, రామసుబ్బమ్మ, బంక మమత, చేనేత నారాయణ పింఛన్‌ ఆపేసిన వారిలో ఉన్నారు.

 టీఓపల్లెలో.. వృద్దాప్య పింఛన్‌ పొందుతున్న చెన్నూరు సుబ్బమ్మ, వీరమ్మ, సుబ్బారెడ్డి, ఏ.వెంకటసుబ్బారెడ్డి, కుంచెం సుబ్బ మ్మ, పిచ్చయ్య, మద్దిలేటి, రామయ్య, వెంకటసుబ్బ య్య, శివారెడ్డి, గంగమ్మ, కొండారెడ్డి, వికలాంగులైన సాంబశివారెడ్డి, శ్రీదేవి, తిరుపాలమ్మ, గురుస్వామి, రంగరాజు, సాంబశివారెడ్డి, డప్పు కళాకారులు వెంకటసుబ్బయ్య, చిన్నమ్మ, నరసింహులు, రాముడు, చేనేతలైన సుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడులకు పింఛన్‌ డబ్బులను ఆపారు.

76 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య పింఛన్‌ ఆపడం న్యాయమా
పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్నాను. గతంలో టీడీపీ, గత ఐదేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కూడా పింఛన్‌ సజావుగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావటం మొదటి నెలే నాకు పింఛను ఇవ్వకుండా ఆపటం ఎంత వరకు న్యాయం. 76 ఏళ్లు ఉన్న నా పత్రాలను పరిశీలించిన తర్వాతనే ఇస్తామని చెప్పటం బాధాకరం.

– ముదిరెడ్డి శివారెడ్డి, వృద్ధుడు, మడూరు గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
పండుటాకులపై టీడీపీ కక్ష !1
1/3

పండుటాకులపై టీడీపీ కక్ష !

పండుటాకులపై టీడీపీ కక్ష !2
2/3

పండుటాకులపై టీడీపీ కక్ష !

పండుటాకులపై టీడీపీ కక్ష !3
3/3

పండుటాకులపై టీడీపీ కక్ష !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement