బాబు పగ.. పండుటాకులకు బెంగ | - | Sakshi
Sakshi News home page

బాబు పగ.. పండుటాకులకు బెంగ

Published Wed, Apr 3 2024 2:15 AM | Last Updated on Wed, Apr 3 2024 9:54 AM

- - Sakshi

తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీలో వలంటీర్‌ల ఆప్యాయ పలకరింపులు అవ్వాతాతలకు ఉండవు. చంద్రబాబు పండుటాకులు అనే కనికరం కూడా చూపలేదు. పింఛన్లపై పగపట్టారు. వలంటీర్‌లపై అక్కసు వెల్లగక్కారు. ఫలితంగా మొదటి సారిగా వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద వలంటీర్‌లు లేకుండానే పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి.. ఇంటి వద్ద మంచానికే పరిమితమైన వారికి పింఛన్‌ సొమ్ము సకాలంలో చేరుతుందా లేదా అనే బెంగ లబ్ధిదారుల్లో కలుగుతోంది.

కడప రూరల్‌ : ప్రతి నెలా వలంటీర్‌ల ద్వారా ఒకటో తేదీనే ఠంచన్‌గా పింఛన్‌ పంపిణీ జరిగేది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వలంటీర్‌ల వ్యవస్థపై ఆరోపణలు చేయడంతో పింపిణీపై గందరగోళం నెలకొంది. అదే సందర్భంలో ఆయన చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే పింఛన్ల పంపిణీ సాఫీగా జరిగేనా అనే అనుమానం అందరిలో కలుగుతోంది.

అధికారుల చర్యలు ఇలా ..
ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. రెండు దశల్లో పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం మొదటి దశ సచివాలయాల్లో సిబ్బంది ద్వారా, రెండవ దశ ద్వారా సచివాలయాలకు రాలేని వ్యాధిగ్రస్తులు, మంచాన పడిన వారు తదితరులకు ఇంటి వద్దనే ఇవ్వాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో సచివాలయాల వద్దకు పింఛన్‌ కోసం వచ్చే వారి సౌకర్యార్థం టెంట్లు, మంచి నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు.

వయోభారం.. అనారోగ్యం
జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన వారు మొత్తం 2,68,179 మంది ఉన్నారు. వారందరికీ రూ.79,31,26,000 నగదును అందజేయాలి. మొత్తం 2,68,179 పింఛన్లలో వృద్ధులు అధిక సంఖ్యలో 1,40,864 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగులు 40,391 మంది, డీఎంహెచ్‌ఓ కింద 1,526 మంది, కిడ్నీ వ్యాధిగ్రస్తులు (ప్రభుత్వ, ప్రైవేట్‌) 490 మంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం వృద్ధుల విభాగంలో సగం మంది వయోభారంతో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దివ్యాంగుల్లో 75 శాతం మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు. డీఎంహెచ్‌ఓ, కిడ్నీ వ్యాధిగ్రస్తులతోపాటు సైని క్‌ వెల్ఫేర్‌, వితంతువులు, చేనేతలు, ఒంటరి మహిళ విభాగాలకు చెందిన వారిలో అధిక సంఖ్యలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సంఖ్యలో కదలలేని స్థితిలో ఉన్నారు. వారి కందరికీ ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం పింఛన్లలో దాదాపుగా 50 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడే వారే ఉన్నారు.

తక్కువ సిబ్బందితో మూడు రోజుల్లో సాధ్యమేనా..

అధిక సంఖ్యలో వలంటీర్‌లు ఉన్నప్పుడే పింఛన్ల పంపిణీ నాలుగైదు రోజులకు 100 శాతం నమోదయ్యోది. అలాంటిది సచివాలయ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండే క్రమంలో మూడు రోజుల్లో పంపిణీ సాధ్యమయ్యే పనేనా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఒక సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉంటారు. అందులో ఇద్దరు లేదా ముగ్గరు వ్యక్తిగత సెలవులో ఉండే అవకాశం ఉంది. అదనంగా సిబ్బందిని తీసుకున్నప్పటికీ వలంటీర్‌ల అంత వేగంగా పింఛన్ల పంపిణీ సాగదనే అభిప్రాయాన్ని అవ్వాతాతలు వ్యక్తం చేస్తున్నారు.

ఉసురు తగులుతుంది 
పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా పెట్టాలని చంద్రబాబు ఫిర్యాదు చేయడం శోచనీయం. మంచంలో నుంచి లేవలేని వాళ్లం సచివాలయం వద్దకు వెళ్లి పింఛన్‌ ఎలా తీసుకోవాలి. చంద్రబాబుకు మాలాంటి వాళ్ల ఉసురు తగుతులుంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్‌ ఇంటి వద్దకే వస్తోంది. తెల్లవారక ముందే పింఛన్‌ అందేది. వలంటీర్ల సేవలు ఎంతో బాగున్నాయి. అలాంటి వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పుడు మళ్లీ మాకు పింఛన్‌ కష్టాలు ఎదురవుతున్నాయి.  
– ఆకుల సంజమ్మ, 8వ వార్డు, మైదుకూరు 

పింఛన్‌ తెచ్చి ఇవ్వడమే పాపమా 
మా మనవళ్ల వంటి వలంటీర్లు మాకు పింఛన్‌ తెచ్చి ఇవ్వడమే పాపమా. ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మున్సిపాలిటీ ఆఫీసు వద్దకు పింఛన్‌ కోసం వెళ్లి ఎండలో సొమ్మసిల్లి పడిపోయే వాళ్లం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి వద్దకే పింఛన్‌ తెచ్చి ఇస్తున్నారు. వలంటీర్ల సేవలు మరువలేం. మళ్లీ పింఛన్ల పంపిణీ వారికే ఇవ్వాలి.  
– బాబులమ్మ, సాయినాథపురం, మైదుకూరు 

ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చే వారు 
ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే ఇంటికి వచ్చి పింఛన్‌ డబ్బులు ఇచ్చేవారు. ఇన్నాళ్లు మాకు పింఛన్‌ గురించి టెన్షన్‌ లేకుండా ఉండేది. ఇపుడు వలంటీర్లు లేరంటే చాలా టెన్షన్‌గా ఉంది. అసలు మాకు పింఛన్‌ డబ్బులు ఎప్పుడు చేతికి అందుతాయో అర్థం కావడం లేదు. మేము డబ్బుల కోసం సచివాలయాలకు ఎన్ని రోజులు వెళ్లాలో. అంతా గందరగోళంగా ఉంది. జగనన్న డబ్బులు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు? వలంటీర్ల ద్వారానే మాకు పింఛన్లు ఇప్పించండి. మాకు అది చాలు. ఇంకేం వద్దు. 
– షహజాదీ, వితంతు పింఛన్‌ లబ్దిదారురాలు, కమలాపురం.

జిల్లాలో సచివాలయాలు.. సిబ్బంది వివరాలు  

ప్రాంతం సచివాలయాలు సచివాలయ వలంటీర్‌లు సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement