● ఎకరాకు లక్షపైనే పెట్టుబడి
చామంతి సాగులో రైతులకు పెట్టుబడులు భారంగా మారాయి. ఎకరా సాగుకు సేద్యాలు, నారు, ఎరువులు అన్నీ కలిపి లక్ష రూపాయలకుపైనే పెట్టుబడులు అవుతున్నాయి. పంట దిగుబడి బాగా రావాలనే ఉద్దేశంతో చాలా మంది నారును బయట ప్రాంతాల్లోని నర్సరీల నుంచి తెచ్చి సాగు చేస్తున్నారు. ఒక మొక్క రూపాయి మొదలు రూ.2.50 వరకు పలుకుతుంది. ఎకరాకు 14 వేల మొక్కలు పడుతాయని, దీంతో 35 వేల దాకా నారుకే సరిపోతుందని రైతులు తెలి పారు. మిగతా ఎరువులు, సేద్యం, సాగు ఖర్చులు కలిపి లక్ష రూపాయల వరకు వస్తోంది. దీంతోపాటు పంటకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నెలకు మూడు, నాలుగుసార్లు పురుగు నివారణ మందులను పిచి కారి చేసుకోవాలి. ఈ పంటకు ఎక్కువగా చీడ, పీడలు సోకే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా మందులు స్ప్రే చేసి కాపాడు కోవాలి. దీంతో ఖర్చు అధికమౌతుంది.
Comments
Please login to add a commentAdd a comment