నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
సింహాద్రిపురం: నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధి బలపనూరు గ్రామ పంచాయతీలోని నక్కలపల్లె పీబీసీ కాలువ వద్ద నెమ్ము ఎక్కి (నీటి చెమ్మ) 100 నుంచి 150 ఎకరాల వరకు ఏ పంటలు పండలేదని రైతులు ఎంపీ అవినాష్‌రెడ్డికి విన్నవించడంతో ఆయన పీబీసీ అధికారులతో కలిసి మంగళవారం పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పీబీసీ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పీబీసీ కాలువ సమీపాన ఉన్న పొలాల్లో నెమ్ము ఎక్కి ఏ పంటలు పండించుకోలేక రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కావున పంట పొలాలకు నెమ్ము ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందని పరిశీలించి, నెమ్ము ఎక్కకుండా చూడాలని కోరారు. వారు వీలైనంత త్వరగా సమస్య పరిశీలించి రైతులకు పరిష్కారం చూపుతామన్నారు. అలాగే లింగాల, సింహాద్రిపురం మండలాల్లో చీనీ చెట్లు ఎక్కువగా తెగుళ్ల వల్ల చనిపోతున్నాయని, గతేడాది బాగా దిగుబడి వచ్చే చెట్లు ఈ ఏడాది పూర్తి స్థాయిలో చనిపోతున్నాయని, గతంలో శాస్త్రవేత్తల బృందం వచ్చి పరిశీలించి నివేదిక ఇచ్చారని, మళ్లీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసి చీనీ చెట్లను కాపాడడానికి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండల నాయకుడు వెలుగోటి చంద్రశేఖరరెడ్డి, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, కె.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలుపు మందుతో పంట కోల్పోయిన
పొలం పరిశీలన
రావులకొలనులో కలుపు మందుతో పంటను కోల్పోయిన మహేశ్వర్‌రెడ్డి పొలాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. పులివెందుల శ్రీ గురుబాలాజీ ఫర్టిలైజర్ దుకాణంలో తీసుకువచ్చిన పురుగుల నివారణ మందు వల్ల తాను కౌలుకు తీసుకున్న 15 ఎకరాల పంటను కోల్పోయానని, ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. తనకు నష్టపరిహారం అందించేటట్టు చూడాలని ఆయన విన్నవించారు. దీంతో అక్కడే ఉన్న ముద్దనూరు ఏడీఏ వెంకటసుబ్బయ్యతో ఎంపీ మాట్లాడారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలని, అలాగే ఫర్టిలైజర్ షాపులో నాసిరకం మందులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రావులకొలను సర్పంచ్ కంభం మహేశ్వర్‌రెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాదర్బార్
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని భాకరాపురం సమీపంలో ఉన్న తన నివాసంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
దెబ్బతిన్న పంటల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment