బాధితులకు న్యాయం చేయాలి
కడప అర్బన్: నేరం చేసిన వారికి శిక్ష.. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు కృషి చేయా లని రాష్ట్ర డీజీపీ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కడప నగరంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ‘పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్’ హాల్‌లో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి కడప, అన్నమయ్య జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిబద్ధతతో నేరాల కట్టడికి కృషి చేయాలన్నారు. సమష్టి కృషితో ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన నేపథ్యంలో జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశఽంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌భాబు, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్‌హెగ్డే, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన ఆర్టీసీ అధికారులు
కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ), ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్, రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్‌రెడ్డి, ఆర్టీసీ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డితోపాటు ఆర్టీసీ కార్గో జోనల్ మేనేజర్ హరి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. డీజీపీ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామునే నంద్యాల బయలుదేరి వెళతారు.
డీజీపీ తిరుమలరావు
కడప, అన్నమయ్య జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment