సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్ కానుక సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందిస్తున్న రూ.3 వేల పింఛన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వలంటీర్లు అందిస్తున్నారు. గురువారం నాటికి 20 లక్షల మంది (34 శాతం) లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. 533 సచివాలయాల పరిధిలో పింఛన్ సంబరాలు జరుగుతున్నాయి. వీటిలో 181 సచివాలయాల పరిధిలో పింఛన్ కానుక సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి.
తిరుపతి పోస్టల్ కాలనీలో పింఛన్ పంపిణీని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఓ పండుగలా నిర్వహించారు. అర్హులైన అవ్వా తాతలు, వితంతువులకు రూ. 3 వేల పింఛన్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు అందించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పింఛన్‌ను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment