
సాక్షి, అమరావతి: లక్షలాదిమంది అవ్వాతాతలు, వితంతు, చేతి వృత్తిదారుల దీవెనల మధ్య రాష్ట్రమంతటా పెన్షన్ రూ.3,000కు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్‌ను రూ.3,000కు పెంచిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అవ్వాతాతలు జేజేలు కొడుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో తాము ప్రతి నెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి గంటల తరబడి ఆఫీసుల వద్ద క్యూలైన్లలో వేచి ఉండే పద్ధతులను పూర్తిగా మార్చి.. ఇప్పుడు ప్రతి నెలా ఠంఛన్‌గా.. పండుగైనా, ఆదివారమైనా, ఇతర సెలవు రోజయినా వలంటీర్లు తమ ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మనసారా దీవిస్తున్నారు.
ఈ నెల నుంచి పెన్షన్‌ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచిన నేపథ్యంలో.. ఒకటోతేదీ నుంచి 8వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల వారీగా స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ లబ్దిదారులతో మమేకమవుతూ పూర్తి పండుగ వాతావరణంలో వేడుకలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనవరి ఒకటోతేదీ నుంచి ఆదివారం (7వ తేదీ వరకు) 700 మండలాలు, మున్సిపాలిటీల్లో ఉత్సవ కార్యక్రమాలు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం 15 మండలాల్లో ఉత్సవాలు కొనసాగాయని, సోమవారం మిగిలిన 24 మండలాల్లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment