
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా.. వివక్షకు తావు లేకుండా.. అందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జనవరి 1 నుంచి పింఛన్‌ను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచి.. పంపిణీ చేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామన్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 66 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
♦ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కూడా అందరి భాగస్వామ్యం ఉండేలా చేస్తాం.
♦ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థులు ఎక్కడైనా మార్పులు జరిగి ఉంటే వారిని పరిచయం చేయడం, బలోపేతం చేయడం, పార్టీ మొత్తం వారితో సమన్వయం చేయడంపై చర్చ జరిగింది. అభ్యర్థుల మార్పు వీలైనంత త్వరగా జరిగిపోతుంది. మార్పు తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటారు.
♦ వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉంది. ఏ కారణాల వల్లనైనా ఎవరైనా పక్కకు వెళ్తుంటే, ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు అనుకుంటే అలాంటి వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాం. మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్‌లో ఉన్నాం. ఇమడలేని వారు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు అడ్డంగా కొంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా.. పోతేపోనీ కొత్తవారు వస్తారనే ఉద్దేశంతోనే జగన్ చూశారు. ఇలాంటి చిన్నచిన్న వాటికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన వారి గురించి మేం కామెంట్ చేయదలచుకోలేదు.
♦ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ మధ్య నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీ విధానాలు కుదరడం లేదనుకునే వారు పోతుంటారు. ఇలాంటి వారు ఉంటే పార్టీకి పోనుపోనూ ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
♦ వైఎస్సార్‌సీపీని స్థాపించినప్పటి నుంచి జగన్ ఆలోచన విధానాన్ని గమనిస్తే, పార్టీనుంచి ఎవరైనా వారి ప్రయోజనాల కోసం వెళ్తుంటే దాన్ని అంతే బ్రాడ్ మైండ్‌తో చూడటం అనేది అలవాటు అయ్యింది. ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక అందులో మార్పులు జరిగినప్పుడు కిందవాళ్లకు కొత్తవారితో అడ్జస్ట్ కాగలమా అనేది ఒక డైలమా రావచ్చు. అప్పుడు అసంతృప్తులు రావొచ్చు. వారికి నచ్చజెప్పేందుకే ఈ యంత్రాంగం అంతా నాతో సహా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పని చేస్తున్నాం. చాలావరకు విజయవంతం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment