సాక్షి, అమరావతి: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పూర్తిగా ఈర్షా్యద్వేషాలతో ‘ఈనాడు’ రోజూ పనిగట్టుకుని రాస్తున్న అబద్దపు కథనాలు గానీ, ఆ తప్పుడు కథనాలనే చూపిస్తూ చంద్రబాబు, ఇతర టీడీపీ, జనసేన పా ర్టీల నేతలు విలేకరుల సమావేశాల్లో మాట్లాడే మాటలుగానీ ఎంతటి దిగజారిన స్థాయిలో ఉంటాయనడానికి ఇదో నిదర్శనం. ఆ కథనం, వివరాలు ఏంటో మీరే చూడండి.. ఒక కుటుంబానికి 12.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ కుటుంబంలోనే ఇంకా పెళ్లి కాని ఒకరు ఏకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైల్వేలో దాదాపు నెలకు రూ.50 వేల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సచివాలయాల ఉద్యోగాల భర్తీలో మొదట ఉద్యోగం తెచ్చుకుని, తర్వాత దానికి రాజీనామా చేసి రైల్వే ఉద్యోగంలో చేరారు.
ఏ ఆసరా లేని అవ్వాతాతలు, రకరకాల ఇతర అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పింఛన్ల పథకంలో నిబంధనలకు విరుద్ధంగా ఆ కుటుంబంలో ఒక దివ్యాంగురాలు (అంధురాలు–ఆమెకు కూడా ఇంకా పెళ్లి కాలేదు) కోటా పింఛను పొందుతున్నారని గుర్తించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఆ పింఛన్ని తొలగించారు. ఆ పింఛను తొలగించిన ప్రక్రియ కూడా ఎప్పుడో 17 నెలల కిందట జరిగింది. ఇన్నాళ్ల తర్వాత కుటుంబ కారణాలో లేదంటే ఇతర వ్యక్తిగత కారణాలతోనో శనివారం ఆ అంధురాలు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఇదే సమయంలో ఆమె ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. 17 నెలల కిందట జరిగిన దానినే గుర్తుపెట్టుకుని మనోవ్యధతో ఆమె ఇప్పుడు అనారోగ్యం పాలైనట్లు, ఆ క్రమంలోనే శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు లింకులు పెట్టి ఈనాడు పత్రిక ఆదివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ఈనాడు రాసిన ఆ తప్పుడు కథనం పేపరు క్లిప్పింగ్‌నే చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ట్యాగ్‌చేసి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చిలో తమకు అన్నింటా అనుకూలంగా ఉండే చంద్రబాబు కాకుండా.. పేదల సంక్షేమం కోసమే పనిచేసే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూర్చుని ఉండటాన్ని ఈనాడు సహించలేకపోతోంది.
ఎలాగైనా ఆయనను దించి తమ చంద్రబాబునే సీఎం చేయాలని నిజమా.. అబద్ధమా అన్న విచక్షణ కూడా లేకుండా ఏ సంఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాయడమే పనిగా పెట్టుకున్న ఈనాడుకు తాము రాసింది చూసి జనం నవ్వుకుంటారనే విచక్షణ కూడా లేకుండా పోయింది. మన రాష్ట్రంలోగానీ, దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరగనంతస్థాయిలో పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తుంటే.. తనకు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదనే బెంగతో ఉన్న చంద్రబాబు కూడా ప్రజలు నవ్వుకుంటారని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.
బాబు పెట్టిన కఠిన నిబంధనల్ని జగన్ సీఎం అయ్యాక సడలించారు
ఒక కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా.. లేదంటే ఆ కుటుంబానికి 2.5 ఎకరాలు లేదంటే ఐదెకరాలకు మించి మెట్ట భూమి ఉన్నా ఆ కుటుంబంలో సభ్యులు పింఛనుకు అనర్హులని గత చంద్రబాబు ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిబంధనల పేరుతో పేదలు ఎక్కువగా ఇబ్బందులు పడకూడదని అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనల్ని చాలావరకు సడలించారు.
టీడీపీ ప్రభుత్వంలో ఒక కుటుంబానికి రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదన్న నిబంధనను బాగా సడలించి పదెకరాల దాకా వ్యవసాయ భూమి ఉన్నా పింఛను మంజూరుకు అర్హులుగా ఉత్తర్వులు ఇచ్చారు. గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అర్హులైన పేదలకు ఈ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది.
అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛను లబ్దిదారులు ప్రతి నెలా పింఛను తీసుకోవడానికి కూడా నడవలేని స్థితిలో అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడితే, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే లబి్ధదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment