
సాక్షి, పూతలపట్టు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయం కొనసాగుతోంది. ఆయన పాదయాత్రకు ప్రజలనుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు అండగా మేమున్నామంటూ వైఎస్ జగన్‌తో కలిపి అడుగులు వేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం 'వాక్ విత్ జగన్' అనే ప్రత్యక యాప్‌ను తయారు చేశారు.
ఈ యాప్‌లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వివరాలతోపాటు ఇతర విషయాలను పొందుపరిచారు. ఇందులో ప్రతిరోజు వైఎస్ జగన్ ఎన్నికిలోమీటర్లు, ఎన్నిఅడుగులు వేస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పాదయాత్రలో జననేతపాటు మనం ఎన్ని అడుగులు పాల్గొన్నామో కూడా ఇందులో ఉంటుంది. మనం నడిచిన దూరాన్ని షోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ఇందులో పొందుపరచనున్నట్లు వారు ప్రకటించారు. తద్వార సమస్యలు అందరికీ తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు.