లాండ్రీకార్ట్‌ యాప్‌ను ఆవిష్కరించిన సమంత.. | Samantha Launched Laundry Craft Services App | Sakshi
Sakshi News home page

లాండ్రీకార్ట్‌ యాప్‌ను ఆవిష్కరించిన సమంత..

Published Mon, Apr 15 2019 7:59 AM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

Samantha Launched Laundry Craft Services App - Sakshi

బంజారాహిల్స్‌: భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత తరుణంలో లాండ్రీ కార్ట్‌ ఓ వరంగా ఉపయోగపడుతుందని సినీ నటి సమంత  అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ సతీమణి సబిత సుకుమార్, అలేఖ్య, గిరిజ, శరత్‌లతో కలిసి నెలకొల్పిన లాండ్రీకార్ట్‌ సంస్థ మొబైల్‌ యాప్‌ సర్వీస్‌ను ఆదివారం ఆమె బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లాండ్రీకార్ట్‌ వ్యవస్థాపకురాలు సబితా సుకుమార్‌ మాట్లాడుతూ .. యాడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్‌ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో దీన్ని ప్రారంభించామన్నారు. సినిమా నేపధ్యంతో ముడిపడిన సంస్థ కాదన్నారు. మధ్యతరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయంతో సర్వీసులు అందించాలని ప్రారంభించామన్నారు. ఈ యాప్‌ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం, ఒక స్పూర్తిగా నిలుస్తుందని సమంత చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement