
జీఎస్టీ ‘మొబైల్ యాప్’
జీఎస్టీ అమలు నేపథ్యంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది.
గతంలో ఉన్న యాప్ ప్రతిపాదనలకు మెరుగులు దిద్ది అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చారు. ఈ యాప్‌లో వినియోగదారులు తమ బిల్లులను అప్‌లోడ్ చేయవచ్చు. ఎక్కువ బిల్లు వేసినా, బిల్లు ఇవ్వకపోయినా సదరు సమాచారాన్ని యాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. బిల్లు అప్‌లోడ్ చేసే వినియోగదారులకు లాటరీ పద్ధతిలో ప్రోత్సాహకాలూ ఇవ్వనున్నారు. ఈ ప్రతిపాదనను సీఎంకు పంపారు. ఆయన ఆమోదం లభిస్తే త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.