
సాక్షి, హైదరాబాద్: ‘పెట్టుబడి’చెక్కుల సొమ్ము తీసుకునేందుకు బ్యాంకులకు వచ్చే రైతులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తోంది. ఏ బ్యాంకులోనైనా సొమ్ము తీసుకునేలా ఆర్డర్ చెక్కులు ఇస్తుండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అదీకాక చెక్కులను ఇతరులు తస్కరించి దుర్వినియోగం చేయకుండా చేసేందుకు కూడా యాప్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడిం చాయి.
మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్న జాతీయ సమాచార కేంద్రానికే పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతుల జాబితా తయారీ బాధ్యతను వ్యవసాయ శాఖ అప్పగించింది. గ్రామసభలో చెక్కు అందుకున్న రైతు బ్యాంకులో సొమ్ము తీసుకునేందుకు వెళ్తే, అతని పాస్‌బుక్ నంబర్‌ను యాప్ లో ఎంటర్ చేస్తే రైతు వివరాలన్నీ వస్తాయి. వాటిని పరిశీలించాక వచ్చిన వ్యక్తి సంబంధిత రైతేనని తేలిన తర్వాతే డబ్బు చేతికి ఇస్తారు.
రేపటి నుంచి చెక్కుల మేళా
బ్యాంకులు ముద్రించిన తొలివిడత చెక్కులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. వాటిని జిల్లాలకు పంపేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి మూడు రోజులపాటు బ్యాంకులు ఏర్పాటు చేసే కేంద్రా ల్లో వ్యవసాయ శాఖ వర్గాలు స్వీకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment