103 నగరాల్లో నీట్ నిర్వహిస్తాం
న్యూఢిల్లీ: విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)ను దేశవ్యాప్తంగా 103 నగరాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు తేలిగ్గా తమ సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు మోబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు. ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా రాసే వీలుకల్పిస్తున్నట్లు వైద్య శాఖ కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ను నిర్వహిస్తారు.