ఆధార్ డేటా హ్యాక్ చేసిన టెకీ..
ఆధార్ డేటా హ్యాక్ చేసిన టెకీ..
Published Fri, Aug 4 2017 3:41 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
బెంగళూరు: తాను రూపొందించిన మొబైల్ ఆప్ ద్వారా ఆధార్ డెటాను హ్యాక్ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అభినవ్ శ్రీవాత్సవ్(31) బెంగళూరు ఓలా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ-హాస్పిటల్ అప్లికేషన్‌తో నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి అక్సెస్ పొంది అక్రమంగా ఆధార్ డెటాను పొందాడు. దీన్ని గుర్తించిన యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేషన్ అథారిటీ శ్రీవాత్సవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఆధార్ డేటాబెస్‌తో శ్రీవాత్సవ్ ఐదు మొబైల్ అప్లికేషన్ రూపొందించాడు. వీటిలోని ఆధార్ ఈ కేవైసీ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 50 వేల సార్లు డౌన్‌లోడ్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీనితో నిందితుడు ప్రకటనల పేరిట రూ.40 వేలు ఆర్జించాడు. అయితే ఈ ఆప్ ను గుర్తించిన అధికారులు గత నెలనే డీఆక్టివేట్ చేశారు. పోలీసులు నిందితుడి నుంచి సీపీయూ, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్స్, ఆరు పెన్ డ్రైవ్‌లు, రూ.2.25 లక్షలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
Advertisement