ఆర్‌యూలో మొబైల్‌ యాప్‌ విడుదల | ru mobile app relese | Sakshi
Sakshi News home page

ఆర్‌యూలో మొబైల్‌ యాప్‌ విడుదల

Published Mon, Apr 10 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

ru mobile app relese

కర్నూలు (ఆర్‌యూ) : రాయలసీమ యూనివర్సిటీలో మొబైల్‌ యాప్‌ను వైస్‌ చాన్సలర్‌ వై.నరసింహులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న మహమ్మద్‌ ఇలియాస్‌.. స్పోకన్‌ ఇంగ్లిష్‌ యాప్‌ తయారు చేశారన్నారు. మున్ముందు ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇలియాస్‌కు త్వరలో ల్యాప్‌టాప్‌ను బహుకరిస్తామన్నారు. ఇలియాస్‌ మాట్లాడుతూ.. ఆత్మకూరుకు చెందిన తన తండ్రి బాషా లారీ డ్రైవర్‌ అని, తల్లి కమ్రున్‌బి గృహిణి అన్నారు. తనకు సహకరించిన అధ్యాపకులు రవికుమార్, జేమియాలకు కృతజ్ఞతలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement