
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను రూపొందించింది. త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజో రాం రాష్ట్రాల ఓటర్లకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఓటర్లను శక్తిమంతుల్ని చేయడమే తమ లక్ష్యమన్నారు. సీ–విజిల్ యాప్ సాయం తో సాధారణ ఓటర్లు కూడా తమ ప్రాంతం లోని ఉల్లంఘనల ఫొటోలు తీసి ఎన్నికల అధికారికి పంపవచ్చు. ఫిర్యాదుదారు ఏ ప్రాంతం నుంచి ఆ ఫొటోలను పంపారో తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు కూడా ఉంది. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడి వేధింపులకు గురయ్యే ఫిర్యాదుదారు తమ వివరాలను రహస్యంగా ఉంచాలనుకుంటే అందుకోసం యాప్‌లో ప్రత్యేక ఏర్పాటు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment