
మార్కెట్లోకి రవీంద్ర జడేజా యాప్
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన పేరిట మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రస్తుత టీమిండియా సభ్యులలో సొంత యాప్‌ను తెచ్చిన మొదటి ఆటగాడు అతనే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఎస్కేప్ ఎక్స్ అనే సంస్థ దీనికి సాంకేతిక సహకారం అందించింది.
తన యాప్ విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేసిన జడేజా... అభిమానులతో మాట్లాడేందుకు, తనకు సంబంధించిన ఫొటోలు, వీడియో అందుబాటులో ఉంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నాడు.