చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయం కొనసాగుతోంది. ఆయన పాదయాత్రకు ప్రజలనుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు అండగా మేమున్నామంటూ వైఎస్ జగన్‌తో కలిపి అడుగులు వేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం 'వాక్ విత్ జగన్' అనే ప్రత్యక యాప్‌ను తయారు చేశారు.