
న్యూఢిల్లీ: దేశసేవలో మమేకమయ్యే బీజేపీకి తగినంత ఆర్థిక తోడ్పాటునిచ్చేందుకు, పారదర్శకత పెంచేందుకు యాప్ ద్వారా విరాళాలివ్వాలని ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. ‘‘పారదర్శకత సందేశాన్ని చాటిచెప్పేందుకు ‘నరేంద్ర మోదీ మొబైల్ యాప్’ ద్వారా విరాళాలను ఇవ్వండి. రూ.5 నుంచి రూ.1,000 వరకు మీకు తోచినంత సాయం చేయండి’’ అని మంగళవారం మోదీ ట్వీట్ చేశారు.
తన donations.narendramodi.in వెబ్‌సైట్ లింక్‌ను ట్వీట్‌లో జతచేశారు. ప్రధాని పిలుపుమేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లు చెరో రూ.1,000 విరాళమిచ్చారు. రూ.1,000 విరాళం రశీదును అమిత్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో పారదర్శకతను పెంచడంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు ఇలా చిన్న చిన్న మొత్తాలను విరాళంగా ఇవ్వాలని అమిత్ కోరారు.