
ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సి విజిల్ యాప్‌కు సెల్ఫీలు, టాయ్‌లెట్లు, రహదార్ల ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఫిర్యాదులు నిజమైనవే అయినా పూర్తి సమాచారం లేకపోవడంతో వాటిపై చర్య తీసుకోవడానికి వీలుండటం లేదు. మార్చి 10 నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.
అయితే, వాటిలో చాలా వరకు ఫేక్ పోస్టింగ్‌లేనని ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. కర్ణాటకలో ఈ యాప్‌నకు ఎక్కువగా సెల్ఫీలు వస్తున్నాయి. బిహార్‌లో రోడ్లు, టాయ్‌లెట్ల ఫొటోలు దీనికి అప్‌లోడ్ చేస్తున్నారు. తమకు ఇప్పటి దాకా 186 ఫిర్యాదులు అందాయని వాటిలో 111 ఫేక్‌లేనని కర్ణాటక ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. 44 కేసులపై చర్య తీసుకున్నామన్నారు. సి విజిల్‌కు అందే ఫిర్యాదుల్లో 24 శాతం అవాస్తవాలే ఉంటున్నాయన్నారు. బిహార్‌లో అయితే సగానికిపైగా ఫిర్యాదులు సంబంధం లేనివేనని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీనివాస్ చెప్పారు. తమకందిన ఫిర్యాదుల్లో 109 సంబంధం లేనివని, 41 కేసులు నిజమైనవని తేలిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment