పేదలకు మెరుగైన సేవలు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: ఇండియన్ రెడ్‌క్రాస్ ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చే స్తానని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఎ.పి.జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ఓఎన్‌జీసీ ఆర్ధిక సహాయంతో 18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్త విడిభాగాల యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ తాను రెడ్‌క్రాస్‌లో శాశ్వత సభ్యుడినని, రెడ్‌క్రాస్ ద్వారా పేద ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు. సొసైటీ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఎంపీ నిధులతో పాటు, ఇతర సంస్ధల ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
తాను పార్లమెంటు సభ్యుడిగానే కాక టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఫ్లోర్ రీడర్‌గా ఉన్నందున కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జిల్లాకు సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడం, ప్లేట్‌లెట్ల కోసం జిల్లా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుండటంతో జిల్లా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెడ్‌క్రాస్‌లో రక్తవిడిభాగాల యంత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సర్టిషికేషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఎంఎల్‌సీ నాగేశ్వర్ కూడా రూ. 10 లక్షలు కేటారుుంచినట్లు తెలిపారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా వికలాంగుల పునరావస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శాశ్వత భవన నిర్మాణానికై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రూ. 5కోట్ల సహాయం కోరినట్లు తెలిపారు, ఇందుకు 2 ఎకరాల స్థలం కూడా అవసరమని, స్థలం సమకూరగానే నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎంఎల్‌సీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యం కోసం జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుుండా జిల్లాలోనే అధునాతన యంత్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ ద్వారా ప్రజలకు తనవంతు సహకారమందిస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాధాఅమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వికలాంగుల
పునరావస కేంద్రం ప్రారంభం......
జిల్లా ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పా టు చేసిన జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు వికలాంగుల పరికరాలను పరిశీలించారు. రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు నటరాజ్, కోశాధికారి మద్దిఅనంతరెడ్డి, సభ్యులు యాదయ్యగుప్త, అమర్, భీంరెడ్డి, లక్ష్మణ్, జయరాజ్, కార్యదర్శులు బాలయ్య, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ శ్యామెల్, డీసీహెచ్‌ఎస్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.