హైదరాబాద్ : ప్రజా జీవితంలో విశిష్ట సేవలందించిన సీనియర్ రాజకీయ నేత కొలన్ శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. నిజాంపేట అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించి గ్రామ పేరును యావత్ దేశ ప్రజలకు సుపరిచితం చేశారు. పలు పార్టీల్లో మండల, జిల్లా స్థాయిల్లో పదవులను అలంకరించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ ప్రజా సేవలో తన దీక్షను మాత్రం వీడలేదు.
రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డిలు చిన్ననాటి మిత్రులు కావడం విశేషం. కొలన్ శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరగణంతో శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామాత్యులు కేటీ రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరనున్న కొలన్ శ్రీనివాస్
Published Fri, Jan 22 2016 7:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement