
సాక్షి, పశ్చిమ గోదావరి: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి ఆళ్ల నాని ఆన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మామిళపల్లి జయప్రకాశ్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి మేరుగైనా సేవలు అందించాలని ఆయన తెలిపారు. త్వరలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళశాల ప్రారంభంకానుందని ఆళ్ల నాని వెల్లడించారు. మెడికల్ కాలేజి జిల్లా ప్రజల చిరకాల కోరిక అని ఆళ్ల నాని గుర్తు చేశారు.