
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో గల ఓ టీస్టాల్‌లో ఆయన కాసేపు సాక్షి పేపర్ చదివా రు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉందని టీస్టాల్ యజమాని శర్మను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శర్మ కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.