
బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ) సభ్యత్వ పత్రాలతో సాక్షి ప్రొడక్షన్ టీం ప్రతినిధులు. చిత్రంలో వాన్–ఇఫ్రా డిప్యూటీ సీఈఓ మన్‌ఫ్రెడ్ వెర్ఫెల్, ఆనంద్ బజార్ పత్రిక ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ డీడీ పుర్కాయస్త, వాన్–ఇఫ్రా సౌత్ ఏసియా ఎండీ మగ్దూం మహ్మద్, సాక్షి ఆపరేషన్స్ డైరెక్టర్ పీవీకే ప్రసాద్
తెలుగువారి మనస్సాక్షి.. ‘సాక్షి’మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ) నిర్వహించిన కలర్ కాంపిటీషన్‌లో విజయ పతాకం ఎగురవేసింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్, వాన్–ఇఫ్రా రెండేళ్లకోసారి వార్తాపత్రికల కలర్ ప్రింటింగ్ నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తుంది. 2018–2020కి సంబంధించి నిర్వహించిన పోటీలో సాక్షికి చెందిన 22 యూనిట్లు విజయం సాధించాయి. ఇందుకు సంబంధించిన క్లబ్ సభ్యత్వ పత్రాలను బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సాక్షి 22 యూనిట్లకు చెందిన ప్రతినిధులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment