
సాక్షి, విజయవాడ: మహాత్మ జ్యోతిరావు పూలే, వైఎస్సార్ బాటలో నడిచిన వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. మహిళలకు పథకాలు, రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. పూలే సిద్ధాంతాలను అమలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, పీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
ఈ సందర్బంగా మేయర్ , రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..‘విద్యతోనే అభివృద్ధి అని నమ్మిన మహనీయులు జ్యోతిరావు పూలే. ఆశయాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్. అందులో భాగంగానే వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారు. పూలే, వైఎస్సార్ బాటలో నడిచిన వ్యక్తి వైఎస్ జగన్. నేను మేయర్‌గా ఉన్నానంటే అందుకు కారణం జగన్.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘పూలే స్పూర్తితో పాలన చేసిన ఏకైక నాయకుడు జగన్. పూలే స్పూర్తితో మహిళల్లో చైతన్యం తెచ్చారు. మహిళలకు పథకాలు, రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించారు. కూటమి పది నెలల పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
జగన్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘సామాజిక విప్లవం తెచ్చిన గొప్ప వ్యక్తి పూలే. వారి సిద్ధాంతాలను అమలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం విద్యను సర్వనాశనం చేసింది. ఎన్నికల్లో అధికారం కోసం వైఎస్సార్‌సీపీ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవని బోర్డులు పెట్టేవారు. ఇప్పుడు స్కూల్లో డ్రాప్ అవుట్ లు పెరిగిపోయాయి. పత్రికలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓ వ్యక్తి పెన్షన్ కోసం పక్క రాష్ట్రం నుంచి ఏపీకి వచ్చి హత్యకు గురయ్యాడు. ఆ వార్తను రాసినందుకు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెడుతున్నారు. పోలీసుల దమనకాండపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హాయంలో పూలే ఆశయాలు తూచా తప్పకుండా అమలయ్యాయి. మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానాలకు తెచ్చిన ఘనత వైఎస్ జగన్. పూలే , అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం.. రెడ్ బుక్ ఆశయాలే ఏపీలో కొనసాగుతున్నాయి. ఏపీలో అవినీతి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ను పక్కన పెట్టి పీ-4 పేరుతో మరోమారు చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.