Palnadu District
-
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
సాక్షి, పల్నాడు: ఏపీలో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి నాలుగో తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో, మార్చి 16న సదరు చిన్నారి మృతిచెందింది.అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్డీఎల్లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్ధారించారు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు.చిన్నారి మృతి నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి వైద్యాధికారులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి.. ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం పట్టుకున్నట్టు, కొంచెం మాంసం తిన్నట్లు తెలిపారు. ఇక, పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు.ఇదిలా ఉండగా.. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు.. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతోపాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. -
టీడీపీ గూండాల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై రాడ్లతో దాడి
పల్నాడు జిల్లా : జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. నార్రెడ్డి వెంకటరెడ్డి అనేవైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్రలు, ఇనుప రాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు టీడీపీ గూండాలు. ఈ దాడిలో వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరెడ్డిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలోవైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదంటూ టీడీపీ నాయకులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సామేలు, బత్తుల రాజేష్, చల్లా వీరయ్య వారి అనుచరులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి చెబుతున్నాడు.కాగా, కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలు తారాస్థాయికి చేరాయి. రెడ్ రాజ్యాంగం అంటూవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి దిగుతున్నారు. అనంతపురం జిల్రల్లా రాప్తాడు నియోజవర్గానికి చెందిన కురబ లింగమయ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. . అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ దాడులకు దిగుతోంది. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు
పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా పిన్నెల్లి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణలో ఉంటున్న వైఎస్సార్సీపీ నేత షేక్ సైదాను పోలీసులు అరెస్టు చేశారు.మల్లారెడ్డిగూడెంలో షేక్ సైదాను అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలోనే ఉంటున్న షేక్ సైదాపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. కూటమి ప్రభుత్వం వేధింపులను వారం క్రితమే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు షేక్ సైదాతో పాటు పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో ఉంటున్న అల్లా బక్షు. వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితిని చెప్పినందుకు వీరిపై టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని కక్షగట్టారని వైఎస్సార్ సీపీ గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.షేక్ సైదాను అక్రమంగా అరెస్టు చేశారని కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. పిన్నెల్లిలో టీడీపీ అరాచకాలపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వ్యక్తిపై 307 సెక్షన్ ఎలా పెడతారని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి. దీనిపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్బంధం.. పరాకాష్టకు ‘కూటమి’ అరాచకాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్‌కు వైఎస్సార్సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్‌పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్‌ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్‌ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. -
వనవాసంలో ‘పిన్నెల్లి’ ప్రజలు
సాక్షి, నరసరావుపేట: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో.. కట్టుబట్టలతో సొంత ఊరిని వీడిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు వనవాసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. కాదన్న వారి ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు.కాపాడాల్సిన పోలీసులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ గ్రామం వీడి వెళ్లిపోవాలని బాధితులకు సలహాలిచ్చారు. స్వయంగా పల్నాడు ఎస్పీ గ్రామంలో పర్యటించి వెళ్లిన గంటల వ్యవధిలోనే మరోసారి వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డా చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో వందలాది కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇప్పటికీ పిన్నెల్లి వాసులు సొంతూరికి రాలేని దుస్థితి నెలకొంది. వలస కూలీలుగా....పదుల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు సైతం టీడీపీ మూకల దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకీడుస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతులు ఇప్పుడు అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా గడుపుతున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన పొలాలను ఇతరులు సాగు చేయనివ్వకుండా బీడు పెట్టారు. కొందరి భూములను దౌర్జన్యంగా అక్రమించారు. అంత్యక్రియలకూ అనుమతించలేదు..పిన్నెల్లి నుంచి వలస వెళ్లిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను కనీసం కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు సైతం రానివ్వకుండా టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారు. పిన్నెల్లికి చెందిన షేక్ అల్లా బ„Š అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయన శవాన్ని గ్రామానికి తరలించేందుకు టీడీపీ నేతలు ఒప్పుకోకపోవడంతో గుంటూరులోనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. మాడుగుల అల్లు చనిపోతే కనీసం నలుగురు కూడా లేకుండా అంతిమ సంస్కారాలు పూర్తి చేయాల్సి వచ్చింది.ఆస్తులు ధ్వంసం..ఎన్నికల ఫలితాలు వెలువడగానే పిన్నెల్లిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీకి చెందిన వారెవరూ గ్రామంలో ఉండటానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. ఇప్పటికి 400కు పైగా కుటుంబాలు పిన్నెల్లి గ్రామంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గ్రామం నుంచి వెళ్లగొట్టే క్రమంలో టీడీపీ నేతలు వారి ఇళ్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. -
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
ఇది కదా జగన్ బ్రాండ్ అంటే
-
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. -
పోలీసుల దన్నుతో ‘టీడీపీ’ అరాచకాలు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం.గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైఎస్సార్సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది.గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు.ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా?ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీస్ యంత్రాంగంను ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు. సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు, ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు, పోలీసులు కలిసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడులకు, కిడ్నాప్‌లకు తెగబడ్డారు.తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్ ను టీడీపీ నాయకులు, పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు. తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే మరో కౌన్సిలర్ ఈ బాధ పడలేక హైదరాబాద్ లో తలదాచుకుంటే, అయన సోదరులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబోట్టి మర్యాదగా పిడుగురాళ్ళకు వచ్చి, తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరించారు.ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం. గతంలో దర్శి, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆరోజు అధికారం ఉందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రెండింటిలో కూడా వైఎస్సార్సీపీకే అధికారం దక్కేది కాదా? కానీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అటువంటి విధానాలకు మనం వ్యతిరేకం, ప్రజాతీర్పుకు గౌరవం ఇవ్వాలని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దానిని స్వయంగా అంగీకరించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాను మున్సిపల్ చైర్మన్ అయి ఉండేవాడిని కాదు అని ఒప్పుకున్నారు.పార్టీ మారకపోతే అంతుచూస్తామని బెదిరిస్తున్నారుపిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావుకు చెందిన ఫ్యాక్టరీకి తెలుగుదేశం నేతలు తాళాలు వేశారు. నీ వ్యాపారాలు అడ్డుకుంటాం, పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో కోర్టులో హెబియస్ కార్ఫస్ పిటీషన్ దాఖలు చేశాం. వెంటనే సదరు కౌన్సిలర్‌ను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తానను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు.దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంకు పాల్పడ్డారు. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చూస్తే ఇంత దుర్మార్గమైన పాలన మరెవరూ చేయలేరని అనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు -
వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీపై దాడికి యత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. పెదకూరపాడు మండలం గార్లపాడులో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లగా.. వారిపై దాడి చేయడానికి టీడీపీ గూండాలు ఆలయాన్ని చుట్టుముట్టారు. గుడి నుంచి బయటికి వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెండు గంటల పాటు జడ్పీటీసీ దంపతులు గుళ్లోనే ఉండిపోయారు. మరోవైపు, పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాల కాశీని రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని కాశీ భార్య రమణ వేడుకుంటోంది.టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజిని భర్తను జూలకంటి శ్రీనివాసరెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పార్టీ మారాలంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసులు వేధిస్తున్నారు. -
పల్నాడు జిల్లా ట్రాక్టర్ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : పల్నాడు జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ప్రత్తిపాటి పుల్లారావుకు విడదల రజిని వార్నింగ్
సాక్షి, పల్నాడు జిల్లా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు’’ అని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.పుల్లారావు గుర్తుపెట్టుకో.. మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన, నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా నిన్ను లాక్కు రావటం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అంటూ విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు.‘‘నా కుటుంబం జోలికి వచ్చినా.. మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే లేదు. అవినీతి అక్రమాల్లో ఘనాపాటి పత్తిపాటి. 2019లో ఒక ఘటన జరిగిందని.. కట్టు కథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు చేయమందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో.. మా పాలనలో మేము అభివృద్ధిపైన దృష్టి పెడితే.. మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకంపైన దృష్టి పెట్టావు.తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారింది’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు. -
పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీ నేతలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు పొలంలో దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు
-
వివాహితకు టీడీపీ నేతలతో కలిసి సీఐ వేధింపులు..
-
వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. ఇదీ చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివపై దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు బయట తిరగడమేంటి అంటూ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ అనుచరులు చెలరేగిపోయారు. టీడీపీ శ్రేణుల దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు.ఎంపీటీసీపై టీడీపీ నేత దాడిశ్రీకాకుళం జిల్లా: గ్రామ సభలో ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి చేశారు. సంత బొమ్మాలి మండలం నౌపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సుధాకర్‌పై టిడిపి నేత వాడపల్లి కృష్ణారావు దాడికి దిగారు.బాధితుడు ఎంపీటీసీ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీ గ్రామసభకు ఆహ్వానించడంతోనే తాను అక్కడికి వెళ్లానని.. సభలో సమస్యలపై మాట్లాడుతుండగా కృష్ణారావు దాడి చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీవి కనుక తనకు సభలోకి వచ్చే అర్హత లేదంటూ టీడీపీ నేత హెచ్చరించారని.. నా చొక్కా చింపేసి... ఇక్కడ కూర్చునేందుకు కూడా అర్హత లేదంటూ దుర్భాషలాడారని సుధాకర్ తెలిపారు. -
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
అన్నను,తమ్ముడుని హతమార్చిన సోదరి
-
AP: కిల్లర్ లేడీ.. క్రైమ్ సినిమా రేంజ్లో అన్నదమ్ముల హత్య!
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కిరాతకం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్‌కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో ఓ యువతి తన అన్న, తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం, శవాలను కూడా మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..‘పల్నాడు జిల్లాలోని నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలు రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతంతో కొద్ది నెలల క్రితమే చనిపోయారు. పౌలు రాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ, బొల్లాపల్లి మండలు, బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైనా కుటుంబ కలహాలతో భార్య విడిచి పెట్టింది. పెద్ద కొడుకు గోపికృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తికోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది.అయితే, ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి.. ఆస్తిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాకతంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండంటంతో డిసెంబర్ 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్యచేయగా.. తమ్ముడిని నవంబరు 26న కాల్వలో తోసేసి చంపేసింది. వీరి మృతదేహాలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా.. నకరికల్లులో మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడితో సాయంతో వారిని హత మార్చినట్టు తెలుస్తోంది. ఇక, కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్‌కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు.. కృష్ణవేణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.మరో దుర్ఘటనలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్లో వెళ్తున్నారు.పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. -
జగన్ పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశారు: వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
AP: చెట్టును ఢీకొన్న కారు.. అక్కడికక్కడే నలుగురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలోని గీతిక స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో, వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్పీపీ నేతపై దాడి
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
పల్నాడులో రెడ్ బుక్ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ పోలీసింగ్ నడుస్తోంది. అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వేధింపులకు పాల్పడుతున్నారు. కేసు పెట్టకుండా.. నోటీసు ఇవ్వకుండా స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఎత్తుకెళ్లి... శనివారం అరర్ధరాత్రి 12 గంటల సమయంలో రెంటచింతల మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నేత నవులూరి భాస్కర్‌రెడ్డి ఇంటికి రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో వచ్చి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి తీసుకెళ్తున్నారు? అనే ప్రశ్నలకు ఎస్ఐ సమాధానం ఇవ్వలేదు. పిడుగురాళ్ల వరకు తీసుకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి రెంటచింతలలో వదిలివెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు పరోక్షంగా భాస్కర్‌రెడ్డికి చెప్పిందేమంటే... ‘నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలంతా ఊర్లు వదలి వెళ్లిపోయారు. మీరు వెళ్లలేదని మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది’ అని హెచ్చరించారు. అధికారపార్టీ నేతలపై చర్యలేవీ? వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తప్పు చేయకపోయినా వేధిస్తున్న పోలీసులు... కూటమి పార్టీ నేతలు రోజూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నా అడ్డుకోవడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేటలలో వ్యాపారులపై దాడులకు దిగినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిని శనివారం అరెస్ట్ చేసి చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సమయంలో తెలుగు మహిళలు నానా హంగామా సృష్టించారు. కృష్ణవేణిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నడిరోడ్డుపై తీవ్రంగా దుర్భాషలాడినా పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు. -
వ్యాపారిపై జనసేన నేతల అరాచకం
నరసరావుపేట టౌన్: ఓ దుకాణంలోకి చొరబడి వ్యాపారిపై జనసేన నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కోట సెంటర్లోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని ఓ షాపులో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ (జనసేన కార్యకర్త)తో దుకాణ యజమానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో జనసేన నేతలు నాని, సాంబలను వెంటబెట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలు దుకాణంలో ఉన్న నాగేశ్వరరావు, అతని కుమారుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.పిడిగుద్దులతో వీరంగం సృష్టించారు. కేసు పెడితే మరో మారు దాడి చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ సీఐ హైమారావు తెలిపారు. కాగా, ఇటీవలే నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు 2 రోజుల క్రితం తన అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇలా..టీడీపీ, జనసేన నేతల వరుస దాడులతో నరసరావుపేటలోని వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు -
మరో ఆరుగురికి డయేరియా
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పల్నాడులో మరోసారి డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, నరసరావుపేట, దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 14 మందిని బలితీసుకున్న అతిసారం.. ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి, ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు. జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై, పలువురు మరణించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది. దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం నుంచి వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. వీరిలో బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (21) బుధవారం రాత్రి మృతి చెందారు. వీరిలో చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం వ్యాధి బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. తాగు నీరు కలుషితం అవడంవల్లే..తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్ ట్యాంక్ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు గురువారం అంజనాపురం కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కా>గా, అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు మృతికి కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. జూలైలో వ్యాధి ప్రబలినా సరైన చర్యలు చేపట్టని సర్కారు జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఆ నెలలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారు. 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో మంత్రి నారాయణ ఒకరోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య నిర్వహణ సరిగాలేకపోవడమే డయేరియాకు కారణమని నిర్ధారణకు వచ్చారు. అయినా, రక్షిత నీరు అందించడానికి, పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందింది. -
చికలూరిపేట ICICI బ్యాంకులో సీఐడీ విచారణ
-
నడివీధిలో ఎస్సై చొక్కా పట్టుకుని..లాగేసి.. చింపేసి.. దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం అండ చూసుకుని టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి పోలీసులపై కూడా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారు. నీ అంతు చూస్తామంటూ.. నడివీధిలో ఏకంగా ఒక ఎస్సైని చొక్కా పట్టుకుని లాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పోలీస్ అధికారి యూనిఫాం బటన్స్ తెగిపోవడంతోపాటు చొక్కా చిరిగిపోయింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం మేరకు.. గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు బతుకమ్మ ఊరేగింపు చేస్తున్నారు. కొంత సేపటి తర్వాత ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే వద్ద వివాదం తలెత్తింది. బందోబస్తులో ఉన్న ఎస్సై రాజా జోక్యం చేసుకుంటూ సర్ది చెప్పారు. గొడవ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా వినిపించుకోక పోవడంతో గొడవకు కారణమని భావించిన ఒక యువకుడి వీపుపై తడుతూ వెళ్లిపొమ్మని చెప్పారు.దీంతో ఆగ్రహించిన ఆ యువకుడి బంధువులు, టీడీపీ నాయకులు ‘మావాడిపై చేయి చేసుకుంటావా.. కొట్టడానికి నువ్వు ఎవరు.. నీ సంగతి చూస్తాం..’ అంటూ మూకుమ్మడిగా ఎస్సైపైకి దూసుకువెళ్లారు. చొక్కా పట్టుకుని గట్టిగా లాగేశారు. దీంతో బటన్స్ ఊడిపోయి, చొక్కా చిరిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తన పైకి దాడికి రావడంతో దిక్కుతోచని ఎస్సై వెనక్కు తగ్గాడు. గొడవ పడొద్దని చెప్పడమే పాపమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటి ఘటన ఏమీ జరగలేదని, ఎటువంటి వివాదం లేకుండా ఊరేగింపు జరిగిందని చెప్పారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ
-
కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు
నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్ పద్మజ, తహసీల్దార్ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వరద బాధితులకు చిన్నారి సాయంవరద బాధితులకు అండగా నేను ఉన్నానంటూ పులివెందులకు చెందిన చిన్నారి వర్ణిక ముందుకొచ్చింది. తాను దాచుకున్న పాకెట్‌మనీని వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అందజేసింది. తాన బాబాయితో వచ్చిన విద్యార్థిని వరద బాధితుల కోసం రూ.72,500 ఆర్థిక సాయాన్ని అందించింది.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు? -
గణేష్ ఉత్సవాల్లోనూ టీడీపీ బరితెగింపు
నరసరావుపేట: అధికారమే హద్దుగా టీడీపీ బరితెగిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ ఊరేగింపు అడ్డుకున్నారు. నిమజ్జనానికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టారు. కాదని వస్తే సహించేది లేదంటూ కర్రలు, రాళ్లు, రాడ్లు పట్టుకుని దాడులకు సిద్ధపడ్డారు. ఆఖరుకు నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించే అన్నదాన సంతర్పణకు కూడా భక్తులను వెళ్లనీయలేదు. ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథశిరి గ్రామంలో చోటుచేసుకుంది. వినాయక చవితి పురస్కరించుకుని గ్రామా లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారులు ఎప్పటిలాగానే వినాయకుడి విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తరువాత నిమజ్జనానికి ఇరువర్గాలు ఒకేరోజు అంటే అదివారం అనుమతి కావాలంటూ పోలీసులను కోరారు. పోలీసులు ముందుగా టీడీపీ వారికి అనుమతి ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డుప్పులతో గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ వారిని సోమవారం నిమ జ్జనం చేసుకునేందుకు అనుమతించారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ వర్గీయులు తమ ఇళ్లపై రాళ్లు రువ్వి గులాంలో కారం కలిపి చల్లారని, వైఎస్సార్ సీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తుండగా..సోమవారం ఉదయాన్నే వైఎస్సార్ సీపీ వర్గీయులు వినాయకుడిని నిమజ్జనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ వాళ్లు చేసుకున్న విధంగానే డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డప్పులను సిద్ధం చేసుకున్నారు. వినాయడిని మండపంలో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టరుపై ఎక్కించి ప్రధాన వీధిలోనుంచి ఉరేగింపుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అంతే ఉరేగింపునకు వెళ్లకుండా ప్రధాన రహదారికి అడ్డంగా ట్రాక్టరు ట్రక్కులను టీడీపీ వర్గీయులు అడ్డు పెట్టారు. గొడవకు ముందుగానే సిద్ధపడ్డ టీడీపీ వారు తమ పలుకుబడితో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథబాబు, సీఐ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. టీడీపీ వర్గీయులు కూడా గ్రామోత్సవాన్ని అడ్డుకునేందుకు దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డంపెట్టి అవతలివైపు కర్రలు, రాడ్లతో కాపుకాశారు. ఉరేగింపు నిర్వహించాల్సిందేనని వైఎస్సార్ సీపీ వర్గయులు కూడా భీష్మించుకూర్చున్నారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూడా టీడీపీకే వంత పలకడంతో చేసేది లేక వైఎస్సార్ సీపీ మద్దతుదారులు మేము మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదేళ్లు పూజలు నిర్వహించుకుని అప్పుడే నిమజ్జనం చేసుకుంటామంటూ నిమజ్జనోత్సవాన్ని విరమించుకుని వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనంపై నుంచి దించి యథావిధిగా మండపంలో ఉంచారు.మీరు వేరే దారిన వెళ్లకుంటే కేసులు: లక్ష్మీపతి, అడిషనల్ ఎస్పీగ్రామంలో గొడవలు వద్దు. మీకు డీజే పెట్టుకునేందుకు, బాణసంచాతో ఉరేగింపు చేసుకునేందుకు అనుమతి లేదు. వేరే దారిన ప్రశాంతంగా వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. లేకుంటే వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు తప్పవు. భిన్నంగా చేస్తే నిర్వహక కమిటీ పాటు సపోర్టు చేసిన అందరిపై కేసులు నమోదు చేస్తాం. కేసులుంటే వీసాలు కూడా రావు, బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వరు. మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చట్టాన్నే మార్చేంత వ్యక్తులేం కాదుగా, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేం ఇంతమందిమి రావాలా... పంతాలు, పట్టింపులు వద్దు, మేము చెప్పినట్లుగా వినండి. వాళ్లు వద్దన్న దారినే మీరు ఎందుకు వెళ్లాలి, డీజే సౌండ్స్ లేకపోతే వినాయకుడు ఒప్పుకోడా, మర్యాదగా నేను చెప్పినట్లు వేరే దారిని వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. ఈసారికి ఇలా పోనివ్వండి, వచ్చే ఏడాది ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎలా చేయాలో ఆలోచిద్దాంలే అని అడిషనల్ ఎస్పీ అన్నారు. దీంతో వైఎస్సార్సీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం నిమజ్జనానికి వెళ్లకుండా వెనుదిరిగారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై పోలీసుల ఓవర్ యాక్షన్...
-
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి,పల్నాడు జిల్లా: పల్నాడులో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెదకూరపాడులో టీడీపీ నేతలు దాదాగిరి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు.. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై దాడికి యత్నించారు.టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరి శంకర్రావు మండిపడ్డారు. ‘‘ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా?. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం’’ అని శంకర్రావు అన్నారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగంమరోవైపు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. అడ్డుకున్న కొండయ్య కూతురిపై అసభ్యపదజాలంతో తిడుతూ అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి రెచ్చిపోయారు. -
‘టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట’
పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.రేషన్ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్‌షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో దోపిడీకి యత్నం
-
ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా?: అంబటి
సాక్షి, గుంటూరు: పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నాగారాజును కిడ్నాప్ చేశారని.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా?. ఎస్పీతో కూడా మాట్లాడాం. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలి. బెయిల్ మీద బయట వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులను కొట్టి టీడీపీ గూండాలు కిడ్నాప్‌కి దిగారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా?’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రాన్ని మణిపూర్, బీహార్‌లాగా మార్చారు. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుండే ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలి’’ అని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. -
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. -
విత్తనం దొరక్క రైతులు ‘వర్రీ’
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో వరి విత్తన కొరత తీవ్రంగా ఉంది. కోరిన విత్తనం దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మడులు సిద్ధం చేసుకున్న రైతులు.. అదను దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు పూర్తి స్థాయిలో మాగాణి భూముల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా నాణ్యమైన వరి విత్తనాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.నరసరావుపేట డివిజన్‌తో పాటు వినుకొండ, సత్తెనపల్లి డివిజన్లలోనూ విత్తన కొరత ఉండటంతో ఆయా ప్రాంత రైతులు నరసరావుపేట పట్టణానికి విత్తనాల కోసం తరలి వస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతం నుంచి సరఫరా అవుతున్న స్వల్ప కాలిక రకం జేజీఎల్–384 విత్తనాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపు తున్నారు. 135 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే వంగడం కావడంతో ఈ రకం విత్తనాల కోసం రైతుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని చిన్నయ్య అండ్ సన్స్ దుకాణంలో సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రైవేటు రకం విత్తనాలను కూడా విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. 25 కి లోల విత్తనాల బస్తా రూ.1,350.. 30 కిలోల విత్తనాల బ స్తా రూ.1,500కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఈ విత్తనం కోసం దుకాణం ఎదుట బారులు తీరుతున్నారు. పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం వారం నుంచి విత్తనాల కోసం వందల మంది రైతులు దుకాణం వద్ద పడికాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి రైతులు గ్రామాల నుంచి జేజీఎల్–384 రకం విత్తనాల కోసం తరలి వస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం సాగుతోంది. అయినప్పటికీ బుధవారం ఉదయం రైతుల మధ్య తోపులాట జరగడంతో టౌన్ హాల్లో టోకెన్లు జారీ చేసేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు.కొంత మందికి టోకెన్లు అందజేసి కౌంటర్‌ను మూసివేశారు. దీనిపై రైతులు నిలదీయడంతో స్టాక్ ఉన్న వరకే టోకెన్లు అందజేశామని నిర్వాహకులు తెలిపారు. దీంతో గత్యంతరం లేక రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. టోకెన్లు తీసుకున్న రైతులు జోరు వానలోనూ క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. రైతులు అన్ని ఇబ్బందులు పడి టోకెన్ తీసుకున్నా, కేవలం ఒక బస్తానే ఇస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాలు సాగు చేసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధంజేజీఎల్–384 రకం వరి విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేవని, అదే రీతిలో దిగుబడి ఇచ్చే స్వల్ప కాలిక రకాలు ప్రత్యామ్యాయంగా సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు. పల్నాడు ప్రాంతానికి అనుకూలమైన వంగడాలతో పాటు రైతులు ఎక్కువగా ఇష్టపడే అంకుర్ సోనా, అంకుర్–పద్మ, ఏపి–567, అన్నపూర్ణ తదితర రకాల విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.నాలుగు రోజులుగా తిరుగుతున్నా..జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం నాలుగు రోజు లుగా పట్టణానికి వచ్చి దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం. ఈ రోజు టోకెన్ దొరికితే ఒక బస్తా (25 కిలోలు) ఇచ్చారు. ఐదు ఎకరాల్లో ఈ రకం వేయాలని సిద్ధమయ్యాం. ఒక బస్తాతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. – వసంత శ్రీనివాసరావు, రైతు, పమిడిమర్రుఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు వరి విత్తనాల కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. విత్తన దుకాణాల్లోనే అన్ని రకాల విత్తనాలు దొరికేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు కావాల్సిన విత్తనం దుకాణాల్లో దొరకడం లేదు. ఇక్కడ ఒక్క చోటే విత్తనాలు అమ్ముతున్నారు. దీంతో రైతులందరూ ఇక్కడికే రావడంతో తోపులాట జరుగుతోంది. – రావి సుబ్బారావు, రైతు, చీమలమర్రిరైతులు కోరిన విత్తనాలు అందించాలి లాభసాటిగా ఉండే విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందించాలి. రైతులు అడిగిన విత్తనం కాకుండా, ఇతర రకాలు సబ్సిడీపై ఇస్తే ప్రయోజనం ఏమిటి? జేజీఎల్ రకం విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – జె.వెంకటేశ్వర్లు, రైతు, తుంగపాడు -
ఎన్సీసీ సీనియర్ల దాష్టీకం
సాక్షి, నరసరావుపేట: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఎన్సీసీ సీనియర్ క్యాడెట్లు పైశాచిక ఆనందంతో జూనియర్లను చితకబాదారు. సర్టిఫికెట్ కోసం ఉబికి వస్తున్న కన్నీటినీ దిగమింగుకుని జూనియర్ క్యాడెట్లు బాధను ఓర్చుకున్నారు. ఈ వీడియో ఆలస్యంగా బయటకు రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారి్థలోకం ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏటా ఇదే తంతువజ్రోత్సవాలు జరుపుకోబోతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ(ఎస్ఎస్ అండ్ ఎన్) కళాశాల స్థాయిలో ఎన్సీసీ విభాగం ఉంది. ఇక్కడ ఏటా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వికృతచేష్టలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఏటా బీ సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే క్యాడెట్లను సీనియర్లు విచక్షణారహితంగా వెదురు బెత్తాలతో కొట్టడం ఇక్కడ ఆనవాయితీగా ఉందని సమాచారం. సీనియర్లు కొట్టే దెబ్బలకు చర్మం లేచిపోయి భరించలేని నొప్పితో ఎంతో మంది జూనియర్లు నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైరలైన వీడియోలోనూ సీని యర్లు జూనియర్లను చితకబాదిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో ఘటన గత ఫిబ్రవరి 3,4 తేదీలలో చీరాలలో జరగనున్న ఎన్సీసీ బీ–సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే 20 మంది క్యాడెట్లను సీనియర్లు 2 తేదీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చితక్కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తమను తమ సీనియర్లు ఇంత కంటే ఎక్కువగా కొట్టారని వీడియోలో కామెంట్ చేయటం ఈ తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా ఉంది. క్యాడెట్ల పరేడ్‌ను పర్యవేక్షించాల్సిన ఎన్సీసీ ఆఫీసర్ డ్రిల్ సమయంలో ఉండరని విద్యార్థులు బుధవారం చెప్పారు. డ్రిల్ ఉన్న రోజు సాయంత్రం ఆలస్యంగా హాజరయ్యే క్యాడెట్లను క్రమశిక్షణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తుంటారని పేర్కొంటున్నారు. శృతి మించుతున్న ర్యాగింగ్!పల్నాడు జిల్లా నరసరావుపేటలోని SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో పిలిచి కట్టెలతో కొడుతున్న సీనియర్ విద్యార్థులు. pic.twitter.com/YxldJoRNew— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024నోరువిప్పని యాజమాన్యం ఘటనపై ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ డాక్టర్ సోము మల్లయ్య, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, బాధిత విద్యార్థులను తన చాంబర్‌కు పిలిపించుకొని విచారణ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో ప్రిన్సిపల్ డాక్టర్ మల్లయ్య ఘటనపై విచారణ జరుపుతున్నామని మొక్కుబడిగా ప్రకటించారు. కేసు నమోదు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థులను ఘటనపై ఆరా తీశారు. తమపై సీనియర్లు అజయ్‌కుమార్, గోపీకృష్ణ మరో నలుగురు కలిసి దాడి చేశారని సీహెచ్ పాల్ థామస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా వివరణ కోరేందుకు కళాశాల హాస్టల్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు దురుసుగా ప్రవర్తించారు.ఏఐఎస్ఎఫ్ ధర్నా.. ఎన్సీసీ జూనియర్ క్యాడెట్లపై సీనియర్ల దాషీ్టకాన్ని నిరసిస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట, హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు, గోపిచంద్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కాసా రాంబాబు, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం
పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.సాంబిరెడ్డికి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పెదకూరపాడు ఇన్చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు.ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దారుణంతెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!విజయవాడ బుడమేరు వంతెన సెంటర్లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులుమధురానగర్ (విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్ చేస్తున్నారు.దుర్మార్గంశిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు⇒ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు.పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పలుగులతో పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడుదాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు⇒ విశాఖలో యువతిపై అత్యాచారం⇒ కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు⇒ గోప్యంగా ఉంచుతున్న పోలీసులు⇒ కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి⇒ ఆ ఘటన మరువకముందే మరో దారుణంమధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్ సబ్ డివిజన్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి కొమ్మాది జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్ వార్డెన్ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్ జోన్ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు. -
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం… pic.twitter.com/lVcgXOuo8N— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్ఆర్కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. -
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే: రషీద్ తల్లిదండ్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్‌ను చంపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. వైఎస్సార్సీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు చంపేశారు. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదు’’ అని రషీద్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులు పదేపదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలవల్లే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ హత్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించలేదు.రాజకీయ కారణాలతోనే హత్య చేయించారు. హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. జిలానీకి గంజాయి తాగించి.. పక్కా పథకం ప్రకారం హత్య చేయించారు. రషీద్ వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడని కక్ష పెంచుకున్నాడు. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తే.. ఎమ్మెల్యే జీవీ చెప్తున్నవనీ అబద్ధాలే. వ్యక్తిగత కక్షలతో హత్య జరగలేదు.’’ అని స్థానికులు అంటున్నారు. -
రేపు వినుకొండకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ తెలిపారు.కాగా, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.’’ అని ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పల్నాడు జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా
-
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో పిన్నెల్లిపై టీడీపీ నేత శివ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లిని కదలనివ్వకుండా అడ్డంగా నిలబడిన శివ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించాడు.పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే పిన్నెల్లిపై దాడికి యత్నించిన శివపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పిన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు.కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు.పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్‌కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్సిపి క్యాడర్‌పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. -
పల్నాడులో టీడీపీ, జనసేన అరాచకం
-
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్
సాక్షి, తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు.ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం’’ అని అనిల్ చెప్పారు.‘‘ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం చూస్తున్నారు. అధికార పార్టీకి కాస్త టైం ఇస్తాం. వారి తప్పులపై నిలదీస్తాం’’ అని అనిల్ పేర్కొన్నారు.‘‘తమిళనాడులో డీఎంకేకి నాలుగుసార్లు డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అంతే. రాజకీయ సన్యాసంపై నా ఛాలెంజ్‌ని టీడీపీ వారు స్వీకరించలేదు. కాబట్టి దాని గురించి ఇక నేను మాట్లడను. దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. కక్ష సాధింపు ఉండదని చెప్తూనే టీడీపీ దాడులు చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు’ అని అనిల్ పేర్కొన్నారు. -
నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మృతదేహానికి సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు మేడికొండూరులో వారిని ఆపారు.సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు వివరించి తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని అతడికి తెలిపారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారకుడైన సీఐ రాజేశ్ కుమార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చేయకుండా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు మెత్తబడ్డారు. మృతదేహం ఉన్న వాహనంతో పాదయాత్రగా, ద్విచక్ర వాహనాలతో సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.అక్కడ సత్తెనపల్లి డీఎస్పీ జి.గురునాథ్ బాబు నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఈ సందర్భంగా మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభం, శుభం తెలియని తన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఊరు వదిలి పోవాలని బెదిరించారని ఆరోపించారు. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానని సత్తెనపల్లి రూరల్ సీఐ రాజేశ్ కుమార్ హెచ్చరించారని మండిపడ్డారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఇంటిపై దాడి చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన టీడీపీ, జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపే‹Ù, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు సందర్శించి నివాళులు అరి్పంచారు. -
బార్‌పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్‌పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్‌కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్‌కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్‌కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్‌టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్‌లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హింసాత్మక చర్యలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. పోలింగ్ మరుసటి రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసం సృష్టించింది. కారంపూడిలో టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోయారు. ఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనని అంటోన్న వైఎస్సార్సీపీ.. సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది. కారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు పల్నాడు పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు. -
టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్
-
ఎన్నికల హింస కేసులో 54 మంది అరెస్టు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై గురువారం సిట్ కేసుల్లో 13 మందితో పాటు పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఎన్నికల నేరాల్లో ఈ ఒక్క రోజే తొమ్మిది మందికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చామన్నారు. నరసరావుపేట సబ్ డివిజన్లో ఒకరు, సత్తెనపల్లి సబ్ డివిజన్ లో 46 మంది, గురజాల సబ్ డివిజన్లో 27 మందితో కలిపి 74 మందిని బైండోవర్ చేశామన్నారు.నరసరావుపేట సబ్ డివిజన్లో ఐదుగురిపై రౌడీషీట్స్ ఓపెన్ చేసి, ఎన్నికల సమయంలో ట్రబుల్ మాంగర్స్గా గుర్తించినట్లు ఎస్పీ గార్గ్ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు నోటీసులు ఇచ్చారు. 102 సీఆర్పీసీ సెక్షన్లో ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటుఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202వ పోలింగ్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కాలేజ్ జూనియర్ లెక్చరర్ పీవీ సుబ్బారావు, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూలు స్కూలు అసిస్టెంట్ షేక్ షహనాజ్ బేగంలను ఎన్నికల విధుల ఉల్లంఘన కారణంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లత్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్‌కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. -
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు: సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని.. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయారని.. వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పల్నాడు, తాడిపత్రిలో హింస చెలరేగింది. అధికారులను మార్చినచోటే హింస చెలరేగింది. ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు చేశారు. ఎక్కడైతే పురేందేశ్వరి ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. చంద్రబాబు, పవన్, పురేందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేశారు. అధికారం రాదనుకున్నప్పుడే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తాడు’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘పల్నాడు, తాడిపత్రిలో దాడులకు కారణం బాబు, పురందేశ్వరియే. కన్నా లక్ష్మీ నారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారు. సిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను. సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు. కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్‌లో ఉన్న సమయంలో టిప్పర్‌ను ఢీకొట్టింది. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం
-
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్ జరపాల్సిందే: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు. మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.‘‘దమ్మాలపాడు బూత్‌లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్‌ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్‌కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
అర్ధరాత్రి టీడీపీ విధ్వంసం..
-
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్‌పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్‌రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు. -
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
అడ్డం తిరిగిన అరవింద్‌బాబు
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు అడ్డం తిరిగారు. తాను పార్టీకి డబ్బులు ఇవ్వడం కాదు. తనకు పార్టీ బీ–ఫారంతోపాటు డబ్బులు కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధిష్టానం ఆయనకు బీ–ఫారం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయనకు బీ–ఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయినా అరవింద్‌బాబు లెక్క చేయకుండా బీ–ఫారం లేకుండానే ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి భయంతోనే తనను అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు టీడీపీ అధిష్టానికి రూ.30 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉందని సమాచారం. అయితే వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో మరోసారి ఇక్కడ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీలోని ఓ ప్రధాన సామాజికవర్గం కూడా అరవింద్‌బాబుకు సహకరించడం లేదు. అదే సమయంలో ఇటీవల పట్టణంలోని 24వ వార్డులో వడ్డెర సామాజికవర్గ నేతలు అరవింద్‌బాబు కుమారుడిని తమ వార్డులోకి రావద్దని అడ్డుకున్నారు.అటు టీడీపీలో ముఖ్య సామాజికవర్గం సహకరించక, ఇటు బీసీలు ఆదరించక తాను ఎలా గెలవడమని అరవింద్‌బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయే సీటుకు రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన కావాలనే డబ్బుల్లేవని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అభ్యర్థులందరికీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ–ఫారాలు అందించారు. అయితే అరవింద్‌బాబు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నరసరావుపేటకు చెందిన టీడీపీలోని ఓ ముఖ్య నేతకు రూ.30 కోట్లు ఇవ్వగానే బీ–ఫారం అందజేసేలా అధిష్టానం ఏర్పాట్లు చేసింది. డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటా? అరవింద్‌బాబు పంచాయితీని ఓ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు అప్పగించారు. దీంతో ఇటీవల వారి మధ్య చర్చల సందర్భంగా ఇప్పటికే పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితిలో తాను లేనని అరవింద్ బాబు తేలి్చచెప్పినట్లు సమాచారం. బి.ఫారంతోపాటు ఖర్చులకు డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటానని, లేకపోతే మరో అభ్యరి్థని చూసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. అయినా అరవింద్‌బాబు పంచాయితీ తేలకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. -
అభిమాన జల్లు
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘సుర్రుమంటున్న ఎండలో బిడ్డను చంకనెత్తుకుని పరుగెడుతున్న ఓ తల్లి.. చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని అదిగో జగన్ అంటున్న ఓ తండ్రి.. ఊతకర్ర సాయంతో ఉత్సాహంగా అడుగులేస్తున్న ఓ తాత.. మనస్సున్న మనవడిని కళ్లారా చూసేందుకు క్యారేజీ కట్టుకుని రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ అవ్వ.. మా భవిష్యత్తు నీతోనేనంటూ ఉరలేస్తున్న యువత.. అన్నొచ్చాడన్న ఆనందంలో డీజే స్టెప్పులేస్తున్న అక్కచెల్లెమ్మలు’.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉదయం పూట కనిపించిన దృశ్యాలివి. ఇక మధ్యాహ్నం వేళ ఆకాశమంత అభిమానాన్ని వరుణుడు తన జల్లులతో అభిషేకించడంతో ప్రతి హృదయం పులకించింది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. వేకువజాము నుంచే జనజాతర మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 13వ రోజు పల్నాడు జిల్లా వాసుల అపూర్వ ఆదరాభిమానాల మధ్య గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి జైత్రయాత్రను తలపించింది. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ధూళిపాళ్లలోని రాత్రి బస శిబిరం నుంచి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత కోసం వేకువ జామునుంచే తరలివచ్చిన జన సందోహంతో ధూళిపాళ్ల శిబిరం కోలాహలంగా మారింది. సాయం కోరుతూ తనను కలిసేందుకు వచ్చిన అనారోగ్య బాధితులను అక్కున చేర్చుకున్న సీఎం జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. భాగ్యనగర్ కాలనీ, జంగంగుంట్లపాలెం, కంకణాలపల్లిలో మహిళలు భారీ ఎత్తున సీఎం జగన్‌కు యాత్రకు స్వాగతం పలికారు. సత్తా చూపిన సత్తెనపల్లి సీఎం జగన్‌కు సత్తెనపల్లి జనతోరణాలతో ఘన స్వాగతం పలికింది. ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. భారీ గజమాలలు, పూల వర్షంతో బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌ను మనసారా ఆశీర్వదించింది. ప్రతి సెంటర్లో మహిళలు భారీగా తరలివచ్చి గుమ్మడి కాయలతో దిష్టి తీసి హారతులు పట్టారు. సీఎం జగన్ బస్సుపైకి చేరుకుని అందరికీ అభివాదం చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రోడ్‌షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. లా నేస్తం, సంక్షేమ నిధికి సాయం అందించి తమకు అండగా నిచిలిన సీఎం జగన్‌కు యువ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. గర్జించిన గుంటూరు.. మేడికొండూరు మండలం కంటెపూడి అడ్డరోడ్డు వద్ద మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో తాము పొందిన లబ్ధిని వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎక్కడ చూసినా బస్సుయాత్ర వెంట భారీ జనసందోహం ఉరకలెత్తింది. కొర్రపాడులో గజమాలలు, బంతిపూలతో బస్సుయాత్రను ఆహా్వనించారు. మహిళలు రోడ్లకు ఇరువైపు నిలబడి జెండాలు చేత పట్టుకుని రెపరెపలాడించారు. జంగంగుంట్లపాలెంలో మేళతాళాలతో స్టార్ క్యాంపెయినర్లు కదం తొక్కారు. మేడికొండూరు జెండాచెట్టు సెంటర్లో మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీసి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షించారు. 16 కి.మీ. జనప్రవాహం.. పేరేచర్ల నుంచి ఏటుకూరు బైపాస్‌లోని బహిరంగ సభ ప్రాంగణం వరకు రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. సుమారు 16 కిలోమీటర్లకుపైగా జనప్రవాహం బస్సుయాత్ర వెంట కదలి వచ్చింది. షెడ్యూల్ కంటే నాలుగు గంటలకుపైగా బస్సుయాత్ర ఆలస్యమైంది. ఉదయం నుంచి రోడ్‌షో, ఆత్మీయ పలకరింపులతో ముఖ్యమంత్రి జగన్ భోజన విరామాన్ని సైతం పట్టించుకోలేదు. గుంటూరులోని హౌసింగ్ బోర్డులో భోజన విరామ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అశేష జన వాహినిని దాటుకుని అక్కడకు చేరుకునే సరికి సాయంత్రం ఆరు గంటలు అయింది. అప్పటికే సభా ప్రాంగణం వద్ద జన సందోహం తనకోసం నిరీక్షిస్తుండటంతో సీఎం జగన్ భోజన విరామం కోసం ఆగకుండా ముందుకు కదిలారు. మిర్చియార్డు నుంచి ఏటుకూరి వరకు దారిపొడవునా జనం బారులు తీరారు. భవనాలు, వీధులు నిండిపోయాయి. సీఎం జగన్ బస్సుపైకి ఎక్కి రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ సాయంత్రం ఏడు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా జనవాహిని సీఎం రాక కోసం వేచి చూసింది. సభ అనంతరం రాత్రి 7.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్, తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావునగర్ మీదుగా రోడ్ షోలో అభిమానులను పలకరిస్తూ పెదకాకాని మండలం నంబూరు బైపాస్‌లో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి 8.15 గంటలకు చేరుకున్నారు. ఘాటు మిర్చి గజమాల సిరిపురం అడ్డరోడ్డు, భీమనేనివారిపాలెంలో అక్కచెల్లెమ్మలను పలుకరిస్తూ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడికొండూరు సెంటర్లోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. అనంతరం 4 గంటలకు పేరేచర్ల సెంటర్‌కు చేరుకున్న యాత్ర జనసంద్రం నడుమ సాయంత్రం 5 గంటలకు నల్లపాడుకు చేరుకుంది. ప్రతి చోటా పోటెత్తిన జనవాహినితో నిర్దేశిత షెడ్యూల్ కంటే బస్సుయాత్ర ఆలస్యమైంది. నల్లపాడు శ్రీనివాస కాలనీ వద్ద అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని కోరుతూ యాత్ర ముందుకు సాగింది. చుట్టుగుంట సెంటర్లో గుంటూరు ఘాటు మిర్చి గజమాలతో సంక్షేమ సారథి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరుణించిన వరుణుడు అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న సీఎం జగన్ యాత్రను స్వాగతిస్తూ వరుణుడు చిరు జల్లులతో ఆశీర్వదించాడు. అప్పటి వరకు వేడి వాతావరణంలో కొనసాగుతున్న బస్సుయాత్ర మేడికొండూరులోకి ప్రవేశించగానే చిరుజల్లులు కురిశాయి. వర్షంలోనూ మేమంతా సిద్ధమంటూ ప్రజలు రోడ్లపై బారులు తీరారు. సీఎం జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసింది. అంతకుముందు శిబిరం వద్ద సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, పల్నాడు జిల్లా: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా అభిమాన నేత చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తమ నేతను చూసి, అయ్యా నువ్వే మళ్లీ సీఎం కావాలయ్యా అంటూ దీవెనలు అందిస్తున్నారు. బుధవారం 12వ రోజు.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు దిగ్విజయంగా కొనసాగింది. మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్ ‘మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
తమ పాలనలో 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఆక్షేపణ.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం
-
మండుటెండలో అభిమాన సంద్రం
రొంపిచర్ల వద్ద 87 ఏళ్ల అవ్వ రాధమ్మ మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఆశగా ఎదురు చూస్తోంది. వచ్చిపోయే వాళ్లను జగన్ ఎక్కడి వరకు వచ్చాడయ్యా? అని ఆరా తీస్తోంది. ఇంత ఎండలో ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే ‘జగన్ నాకు ఎంతో మంచి చేశాడు. ఇంటికే పింఛన్ పంపించాడు. నాలాంటోళ్లకి ఆ బిడ్డ కావాలి. అందుకు ఒక్కసారి చూసిపోదామని వచ్చాన’నని బదులిచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బుధవారం 40 డిగ్రీల ఎండలోనూ జన జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానం వేసవి తాపాన్ని ఎదురించింది. గొంతెండే వేడిమిలోనూ ‘నువ్వే కావాలి జగన్’ అంటూ నినదించింది. ధర్మాన్ని గెలిపించే యుద్ధంలో పల్నాట సైన్యమై ముందుకు కదిలింది. పౌరుషాల పురిటిగడ్డ సాక్షిగా విశ్వసనీయతే తమ వీరత్వమంటూ గర్జించింది. పల్లెపల్లె నుంచి పిడికిలి బిగించి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తామంతా సిద్ధమంటూ నినదించింది. 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోని గంటావారిపాలెం రాత్రి బస శిబిరం నుంచి ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీలో చేరారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఉదయం 6.30 గంటల నుంచే శిబిరం వద్ద మహిళలు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ శిబిరం నుంచి రోడ్డుపైకి రాగానే జైజగన్ నినాదాలతో గళమెత్తారు. సాయం కోరి వచ్చిన బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్య పరిష్కారానికి సీఎం అధికారులను ఆదేశించారు. కామేపల్లికి సమీపంలోని గ్రానైట్ కటింగ్ మహిళా కూలీలు రోడ్లపై వేచి చూడటాన్ని గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌లో నుంచి కిందకి దిగి వచ్చి ప్రభుత్వ పనితీరుపై ముచ్చటించారు. వినుకొండ–కర్నూలు జాతీయ రహదారిపై ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి బాపట్ల జిల్లా సంతమాగులూరు క్రాస్ మీదుగా నరసారావుపేట నియోజకవర్గం అన్నవరప్పాడులోకి బస్సు యాత్ర ప్రవేశించింది. జాతీయ రహదారిపై జన ప్రవాహం నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై సంతమాగులూరు జంక్షన్లో పెద్ద జన ప్రవాహమే కనిపించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు తమ ఆత్మీయ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పూలతో నీరాజనం పలికారు. వ్యవసాయ మహిళా కూలీలు తమపాలిట రైతు బాంధవుడిని చూసేందుకు పొలాల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రొంపిచర్లలో యువత ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ జననేత రాకతో సంబరపడ్డారు. సంతగుడిపాడు, విప్లర్లలో బాణసంచా కాల్చడంతో తిరునాళ్లను తలపించింది. రొంపిచెర్ల, సంతగుడిపాడు రోడ్‌షో అంబరాన్ని తాకింది. సీఎం జగన్‌కు కంబలి కప్పి గొర్రె పిల్లను బహుమానంగా అందించారు. విప్పర్లలో మహిళలు హారతిపట్టి బస్సు యాత్రను దీవించారు. వలంటీర్లు పెద్ద ఎత్తును తరలివచ్చి ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో తమకూ భాగస్వామ్యం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ మీ వెంటే ఉంటామంటూ నినదించారు. రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఊరూరా అభిమానం నెకరికల్లులో సీఎం జగన్‌పై అంతులేని అభిమానం బంతిపూల వర్షం కురిపించింది. సంక్షేమ ఫలాలను అందుకున్న మహిళలు భారీగా తరలివచ్చారు. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా నెకరికల్లులోని నారెట్‌పల్లి– అద్దంకి జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. జనసంద్రంగా మారిన మార్గంలో బస్సు యాత్ర అనుకున్న షెడ్యూల్ కంటే ఆలస్యంగా చల్లంగుండ్లకు చేరుకుంది. నెకరికల్లు, జంక్షన్, త్రిపురాపురం, నెమలిపురి మీదుగా సాగిన బస్సు యాత్ర 4 గంటల సమయంలో పెద్ద నెమలిపురం చేరుకుంది. దేవరంపాడు క్రాస్ వద్ద 4.20 గంటలకు సీఎం భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల, బైపాస్ మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ అయ్యప్పనగర్ బైపాస్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పిడుగురాళ్లలో పిడికిలి బిగించి.. పిడుగురాళ్ల బైపాస్‌లో రోడ్‌షో, బహిరంగ సభ సిద్ధం.. సిద్ధం’ నినాదాలతో మార్మోగింది. రోడ్లపై బారులు తీరిన ప్రజలు ఆద్యంతం సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. ఏనోట విన్నా తమ ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాల లిస్టు వినిపించింది. ఎన్నికల వేళ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి చేరికలు భవిష్యత్తు గెలుపునకు ముందస్తు సంకేతాలని, పిడుగురాళ్ల బహిరంగ సభలో రెంటచింతల వేడిని మించిన.. భీకరమైన గెలుపు పవనాలు వైఎస్సార్ సీపీకి కనిపించాయంటూ పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారిగా ఓటు వేస్తున్న యువత బహిరంగంగానే తమ ఓటు సీఎం జగన్‌కే అంటూ నినదించింది. 5.30 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 6.50 గంటల వరకు పార్టీ శ్రేణులు, లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం 7 గంటలకు బయలు దేరిన సీఎం జగన్ కొండమోడు సర్కిల్ మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. రెడ్డిపాలెంలో రాత్రి 8.45 గంటలు అయినప్పటికీ పెద్ద సంఖ్యలో మహిళలు హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. బస్సుపైకి ఎక్కి వారందరికీ సీఎం అభివాదం చేశారు. రాత్రి 9.08 గంటలకు ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. మళ్లీ నువ్వే రావాలయ్యా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ అనే మహిళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రగా వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఉదయం 9గంటలకే పుట్టావారిపాలెం అడ్డరోడ్డుకు వచ్చింది. తీరా ఆయన వచ్చే సమయానికి చెప్పులు తెగిపోయాయి. అయినా ఆమె చలించలేదు. కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు బస్సు వద్దకు పరుగు పరుగున వచ్చి ఆయనను ఆత్మీయంగా పలకరించింది. భావోద్వేగానికి గురైంది. ‘అయ్యా.. నువ్వే రావాలయ్యా..’ అంటూ ఆకాంక్షించింది. -
‘జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’
సాక్షి, పల్నాడు జిల్లా: ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు. ‘‘వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని బాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది?. ప్రజలు తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ఊసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులుమారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికి తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవ్వాతాలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారు’’ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘‘పిడుగురాళ్లలో జనసముద్రం చూస్తున్నాం. 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి అభివృద్ధి, సంక్షేమం అందించాం. సిద్ధం, సిద్ధం అంటూ నినాదాలు మన జైత్రయాత్రకు శంఖారావాలు. చంద్రబాబు మోసాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా?. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలి. మేం ఎప్పుడూ పేదల పక్షమే.ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పేదలవాళ్లు మోసపోతారు చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ముఖాముఖి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘పచ్చ మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా?. 14 ఏళ్ల బాబు పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?. మనం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. మనం వచ్చాక లక్షా 35 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వైద్యరంగంలోనే 54 వేల నియామకాలు చేపట్టాం. పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రామ సచివాలయాల్లో లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలి’’ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్ -
భారీ గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు..
-
నేనున్నాను.. నేను విన్నాను
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్ దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా -
సీఎం జగన్ బస్సుయాత్ర: జన సంద్రంగా వినుకొండ (ఫొటోలు)
-
Memantha Siddham Bus Yatra Photos: సామాన్యులతో ఆప్యాయంగా సీఎం జగన్ (ఫొటోలు)
-
సీఎం జగన్ బస్సుయాత్ర: వినుకొండలో జన ప్రవాహం
Live Updates.. వినుకొండలో జన ప్రవాహం వినుకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం జనసంద్రంగా మారిన వినుకొండ దారిపొడవునా భారీ గజమాలతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ప్రజలు మేమంతా సిద్ధమంటూ... ముఖ్యమంత్రి బస్సుతో పాటు కదిలిన జన ప్రవాహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దారిపొడవునా సంఘీభావం తెలిపిన విద్యార్దులు, యువతీ యువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు. సుమారు రెండు గంటలకు పైగా వినుకొండలో కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర పొద్దు గడుస్తున్నా తగ్గని ఉత్సాహం... వినుకొండలో బారులు తీరిన జనం అశేష జనవాహిని మధ్య కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంతగా జనం సీఎ జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర వినుకొండ అడ్డరోడ్డు వద్ద సీఎం జగన్ భోజన విరామం ఇక్కడ నుంచి సాయంత్రం ఐదు గంటలకి వినుకొండలో సీఎం జగన్ బస్సుయాత్ర ►చింతలచెరువు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. ►ఘన స్వాగతం పలికిన చింతల చెరువు ప్రజలు ►కురిచేడు గ్రామంలో సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం ►ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ►సీఎం.. సీఎం నినాదాలతో దద్దరిల్లిన కురిచేడు గ్రామం ►అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకే.. పెన్షన్ కోసం అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడు. ప్రతి నెలా ఒకటో తారీఖున అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు పెన్షన్‌ను మీ బిడ్డ… pic.twitter.com/gjQ6WqWIQS — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024 ►వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నా అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా గత ప్రభుత్వంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేది గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందకి మాత్రమే పెన్షన్ వచ్చేది ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం ఆలోచన చేశాను దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకోచ్చాం వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్ పంపించాం 56 నెలలుగా మన ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్ అందించాం గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాం కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందించాం ఇవాళ 66 లక్షల మందికి పైగాపెన్షన్ అందిస్తున్నాం ఇవాళ రూ.3 వేల వరకూ పెన్షన్ పెంచుకుంటూ వచ్చాం అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే మనసులో ప్రేమ ఉండాలి 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా? రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయి వీటిని మార్చేందుకు మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు ఎన్నికల ముందు మేనిఫెస్టో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశారు. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం రాదు.. మోసాలు చేయలేడు చంద్రబాబు, వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడంతే జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే రూ.3 వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాం 58 నెలలుగా పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశాం చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు చేయగలిగేదే చెప్పాలి.. చేయలేనిది నేను చెప్పకూడదు పేదలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీపడే వారు దేశంలోనే లేరు 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారు మోసం చేసేవారిని నమ్మొద్దని కోరుతున్నా చంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయి అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారు చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టే లబ్దిదారులు మాట్లాడుతూ... వాలంటీర్లు మొన్నటి వరకూ పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇచ్చేవారు చంద్రబాబు చేసిన పనితో ఈ నెల పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డాం మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేలు జరుగుతుంది చంద్రబాబు మాపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు పెన్షన్ అందకుండా చేసి ఆయన ఏం సాధిస్తాడు వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది గతంలో చంద్రబాబు మనుషులకే పెన్షన్ వచ్చేవారు జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్ వచ్చేది జగన్ పాలనలోనే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ వచ్చింది ► ప్రకాశం జిల్లాలో పదకొండోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. ►పదకొండో రోజు పల్నాడు జిల్లా సిద్ధమా? Day-11 పల్నాడు జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024 ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 11వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది. ► ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం జగన్ బయలుదేరుతారు. ► ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. -
పల్నాడులో సీఎం జగన్ ఉగాది సంబరాలు
శావల్యాపురం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 9న సీఎం ఉగాది సంబరాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వినుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ మేరకు శావల్యాపురం మండలం వేల్పూరు శివారు గంటావారిపాలెంలో ఉగాది వేడుకల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్ వినుకొండ, విఠంరాజుపల్లె, కనమర్లపూడి, శావల్యాపురం, కృష్ణాపురం, గంటావారిపాలెం గ్రామాల పరిధిలో పర్యటిస్తారన్నారు. అదేరోజు రాత్రి గంటావారిపాలెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బస చేస్తారని బ్రహ్మనాయుడు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సుహాసిని అనిల్‌కుమార్, ఈపూరు మార్కెట్ యార్డు చైర్మన్ చుండూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ బస చేయనున్న ప్రాంగణాన్ని నరసరావుపేట డీఎస్పీ వత్సవాయి సత్యనారాయణవర్మ, సీఐలు ఉప్పుటూరి సుధాకర్, యం. సాంబశివరావు, ఎస్సై చల్లా సురేష్ పరిశీలించారు. -
షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు
నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు. చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్‌లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్‌లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు. నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్‌లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ -
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడం ఏమిటంటూ హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను పోల్చారని, దీనిని తామెలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది. అలా పోలిక తేవడానికి వీల్లేదంటారా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా? మంచి చేసిన వాళ్లను సన్మానించకూడదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారు అంటూ ప్రశ్నించింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలా? వద్దా? అన్నది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే తప్ప, తాము కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో జోక్యం చేసుకోలేమంది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సీఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పామని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. వలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పిల్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్ర«దాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ పిల్ ఎన్నికల్లో వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారి పాళెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. పల్నాడు జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కూడా సింగయ్య కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయం కోసం వలంటీర్లు కృషి చేయాలని, ప్రతిపక్షంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేలా వలంటీర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ముఖ్యమంత్రి ప్రసంగంలో జన్మభూమి కమిటీల ప్రస్తావన వచ్చిందని, ఆ కమిటీలు ఏమిటని ప్రశ్నించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలని సుధాకర్‌రావు చెప్పారు. అలా అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకొచి్చన జన్మభూమి కమిటీలు, ప్రస్తుతం ఉన్న వలంటీర్ల వ్యవస్థను పోల్చుతూ మాట్లాడారని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించమంటే ఎలా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా అని ప్రశ్నించింది. మంచి చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వలంటీర్లు పని చేస్తే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని సుధాకర్‌రావు తెలిపారు. అందుకే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పుడు పిటిషనర్‌కు ఇంకా కావాల్సింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్లు చాలాతెలివి గల వాళ్లు ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది అవినాష్ దేశాయ్ జోక్యం చేసుకుంటూ.. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, వలంటీర్లకు, ఈ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో సుధాకర్‌రావు ఏదో చెప్పబోగా.. ధర్మాసనం ఆయన్ని వారించింది. ఓటర్లు చాలా తెలివి గల వారని, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటర్లు ఎంత తెలివి గల వాళ్లో న్యాయవ్యవస్థలో ఉన్న మనందరికీ బాగా తెలుసునంటూ న్యాయవాద సంఘాల ఎన్నికల గురించి ధర్మాసనం ప్రస్తావించింది. న్యాయవాద సంఘాల ఎన్నికలప్పుడు ఓటర్లు ఓ వర్గం ఇచ్చే విందులో పాల్గొని, మరో వర్గానికి ఓటు వేస్తుంటారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఓటర్ల గురంచి చింతించాల్సిన అవసరం లేదంది. పిల్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటికి టీడీపీ నేతలు తెలుగుదేశం జెండా కట్టారు. టీడీపీ జెండా తీసేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కోరగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌తో వాదనకు దిగారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వారు. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. -
బెదిరించిన విలేకరితో వాదించడమూ తప్పేనా?
సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్‌టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. నాగేంద్ర పీడీ యాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. పరమేశ్వరరావు ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో అతన్ని తొలగించారు. ఈ క్రమంలో అతనికి ఏడాది క్రితం నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు విలేకరిగా అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు.. ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్‌కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో మరుసటి రోజు యథావిధిగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుకరీచ్లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్‌లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజిలెన్స్ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, దీనికి రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది. -
బడుగుల ‘విజయ గీతిక’
సాక్షి ప్రతినిధి, గుంటూరు/చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన అభివృద్ధిని, సాధికారతను బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేనోళ్ల వినిపించారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయగీతిక వినిపించారు. ఈ యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలివచ్చారు. తాము సాధించిన అభివృద్ధిని వివరించారు. జై జగన్ అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. వారికి పట్టణ ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నేతృత్వంలో నూతన వ్యవసాయ మార్కెట్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఈ యాత్ర జరిగింది. పట్టణంతోపాటు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కళా మందిర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభ జనసంద్రాన్ని తలపించింది. ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన పలువురు నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆరి్థకంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న వైనాన్ని వివరించారు. ఆ సమయంలో సభకు హాజరైన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయ సారథి సీఎం వైఎస్ జగన్ : మంత్రి విడదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ సారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను ఈ వర్గాలకు అందిస్తూ సాధికారత దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. చిలకలూరిపేటలో తొలిసారి బీసీ మహిళని నిలబెట్టి ఏ రాజకీయపార్టీ ఎన్నడూ చేయని సాహసాన్ని జగనన్న చేశారన్నారు. ఈ స్థానాన్ని గెలుపొందడంతోపాటు బీసీ మహిళకు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఓసీకి రిజర్వు అయితే మైనారిటీకి చైర్మన్ ఇచ్చామని, మార్కెట్ యార్డును ఎస్సీలకు రెండుసార్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. అన్ని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, దీనికి చిలకలూరిపేటే నిదర్శనమన్నారు. రూ. 2 వేల కోట్లతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.900 కోట్లతో నిరి్మస్తున్న బైపాస్ త్వరలో పూర్తవుతుందన్నారు. పట్టణానికి మంచినీరందించేందుకు రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని తెచ్చామన్నారు. ఎస్సీ భవన్, బీసీ భవన్, కాపు కమ్యూనిటీ హాల్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయలు సొంత నిధులతో షాదీఖానా కట్టించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంతో బడుగుల ఉన్నతి: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి బడుగుల ఉన్నతికి బాటలు వేశారని చెప్పారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఈ సమాజంలో అణచివేతకు గురైన వారందరూ చదువుకుని పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదుగుతారని వివరించారు. అన్ని పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు: ఎమ్మెల్యే ముస్తఫా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో సీఎం జగన్ ఒక్కరేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. ఈ వర్గాలను ఇంతలా అభివృద్ధి చేసిన సీఎంలు ఎవరూ లేరన్నారు. అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. బాబు కల్లపోల్లి మాటలు నమ్మొద్దు: ఎమ్మెల్సీ ఏసురత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఈ రాష్ట్రానికి ఏ మేలూ చేయని చంద్రబాబునాయుడు కల్లపోల్లి మాటలు చెబుతూ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని చెప్పారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి అమలు చేయలేదన్నారు. బాబు 14 ఏళ్ల పాలనలో కేంద్రం 14 లక్షల గృహాలు మంజూరు చేస్తే, పది వందలు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ 31 లక్షల మందికి గృహ వసతి కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
-
ఇంటి పంటగా కుంకుమ పువ్వు
సాక్షి, అమరావతి: కుంకుమ పువ్వు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఇరిడాసే కుటుంబానికి చెందిన ఈ పూలను శీతల ప్రదేశాల్లోనే సాగు చేస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఇరాన్లో సాగవుతుండగా.. మన దేశంలో కశ్మీర్లో మాత్రమే సాగవుతోంది. రాష్ట్రానికి చెందిన కొందరు ఔత్సాహికులు కశ్మీర్ కుంకుమ పూలను సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, పల్నాడు జిల్లా కారంపూడి మండలాల్లో పలువురు ఇంటి (ఇండోర్) పంటగాను, ఏరోఫోనిక్స్, ఐదంచెల విధానాల్లో దీనిని సాగు చేస్తున్నారు. కశ్మీర్ నుంచి విత్తనాలు తెచ్చి.. కశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కుంకుమ పూల విత్తనాలతో రెండేళ్ల క్రితం కుంకుమ పూల సాగుకు రాష్ట్రంలో బీజం పడింది. వీటి సాగు కోసం 220 నుంచి 250 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో ప్రత్యేకంగా ర్యాక్స్ ఏర్పాటు చేసి వాటిలో 300 నుంచి 350 ట్రేలను ఏర్పాటు చేస్తున్నారు. తీసుకొచ్చిన సీడ్స్‌ను గ్రేడింగ్ చేసి ఐదంచెలలో మట్టిలోను, ఏరోఫోనిక్స్ పద్ధతిలో మట్టి లేకుండా సాగు చేపట్టారు. కనిష్టంగా 10నుంచి 12 డిగ్రీలు, గరిష్టంగా 28నుంచి 30 డిగ్రీలకు మించకుండా ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిల్లర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. జూలైలో విత్తుకోగా.. అక్టోబర్–నవంబర్ నెలల్లో కుంకుమ పూలు కోతకొస్తాయి. కోత పూర్తయిన తర్వాత ఏరోఫోనిక్స్ చేసుకున్న సీడ్స్‌ను మట్టిలోకి మార్చుకుంటే చాలు విత్తన పునరుత్పత్తి ప్రారంభమవుతుంది. మట్టిలోనే సీడ్ విస్తరించి రెండు పొరలుగా విడిపోయి కొత్త సీడ్ తయారవుతుంది. ఖర్చు ఇలా.. విత్తనం క్వాలిటీని బట్టి కిలో రూ.600 నుంచి రూ.650 వరకు ఖర్చవుతుంది. రవాణాకు మరో రూ.100 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సుమారు 350 కిలోల విత్తనాలకు రవాణాతో కలిపి రూ.2 లక్షలు, 250 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో ర్యాక్స్, ట్రేలకు రూ.1.50 లక్షలు, 2 టన్నుల ఏసీ చిల్లర్‌కు రూ.1.75 లక్షలు, హ్యూమిడిఫెయిర్కు రూ.45 వేలు, ఉష్ణోగ్రతను స్థిరీకరించేందుకు మరో రూ.45 వేలు, లైట్నింగ్ కోసం రూ.35 వేలు కలిపి మొత్తంగా సుమారు రూ.7 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని అంచనా. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పూచే పూలలో మూడు అండకోశాలు, రెండు కేశరాలు ఉంటాయి. కింద భాగంలో పసుపు, పైన ఎరువు రంగులో ఉండే ఈ అండ కోశాలనే కుంకుమ పువ్వుగా పిలుస్తారు. ఎరువు రంగులో ఉండే అండకోశ భాగాలను తుంచి ఎండబెడతారు. పూలను కోయడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. కుంకుమ పూలు గ్రాముకు రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుంది. మగ పువ్వు గ్రాముకు రూ.40–రూ.60 చొప్పున ధర లభిస్తుంది. కాస్త పబ్లిసిటీ చేస్తే చాలు మార్కెటింగ్‌కు ఢోకా ఉండదు. ఆదాయం బాగుంది అగ్రికల్చర్లో ఎంఎస్సీ చేశాను. ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలన్న సంకల్పంతో 2022లో కుంకుమ పూల సాగు చేపట్టా. కశ్మీర్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి 250 చ.అ. విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. పర్పల్స్్రస్పింగ్స్.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాం. వాట్సప్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేస్తున్నాం. ఆదాయం బాగుంది. – పి.శ్రీనిధి, మదనపల్లి, చిత్తూరు జిల్లా తొలి ఏడాది రూ.లక్ష ఆదాయం వచ్చింది కశ్మీర్ నుంచి విత్తనాలు తెచ్చి 220 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో కుంకుమ పూల సాగు చేపట్టా. 100 గ్రాములు పూలు వచ్చాయి. మరో 100 గ్రాముల మేల్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. యూట్యూబ్ చానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాం. గ్రాము రూ.800 చొప్పున అమ్మాను. మేల్ గ్రాము రూ.40, రూ.50 చొప్పున అమ్మాను. రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. – కారంపూడి లోకేశ్, రొంపిచర్ల, పల్నాడు జిల్లా -
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. చలమారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్రెడ్డి, వి.శంకర్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను తండ్రి సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యను భర్త, అత్త, మామ వేధిస్తున్నట్లు సమాచారం. హత్య అనంతరం భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నరసరావుపేటలో బడుగుల వేడుక
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. బడుగు, బలహీన వర్గాలు వేడుక జరుపుకొన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన చేయూతతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సగర్వంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సోమవారం సాయంత్రం 4.45 గంటలకు లక్ష్మీతిరుపతమ్మ కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర పల్నాడు బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ యాత్రకు వేలాది మంది ప్రజలు.. మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. గజమాలతో స్వాగతం పలికారు. మత పెద్దలు యాత్ర విజయవంతానికి ప్రార్థనలు చేశారు. పల్నాడు బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో పాల్గొన్న నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం: మంత్రి సురేష్ గతంలో రాష్ట్రంలో పెత్తందార్ల పాలన సాగిందని, కానీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బడుగువర్గాల ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలు ఎలా ఉంటాయో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. బడుగువర్గాలకు చెందిన తనలాంటి ఎంతో మందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. ఇక నుంచి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వస్తాడని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సామాజిక విప్లవాన్ని ఆచరణలో చూపిన సీఎం జగన్: మంత్రి నాగార్జున దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని, దేశం బాగుపడాలని, పేదవారు బాగుండాలని కోరుకున్నారని, కానీ దాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒక్క సీఎం జగన్ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో అవమానాలు, దాడులు ఎదుర్కొన్నామని చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా రూ.2.40 లక్షల కోట్లు పేదలకు అందించారని తెలిపారు. పేదల పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందిస్తున్నారని, పేదవాడు ధైర్యంగా బతికేలా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని 11.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారంటే జీవన ప్రమాణాలు పెరిగాయో, తగ్గాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జగనన్న చెప్పినవి, చెప్పనివి కూడా చేసి ప్రజల మన్ననలు పొందారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటు వేయని ప్రతిపక్ష పార్టీల అభిమానులకు సైతం మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. సామాజిక సాధికార సభలకు ఇన్ని వేల మంది వస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి పచ్చమీడియా జనం లేరని అసత్య ప్రచారం చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అదే పవన్ సభకు 10 మంది వస్తే 100 మంది వచ్చారని, చంద్రబాబుకు నలు గురు వస్తే 400 మంది అని చూపుతారని అన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలకు సంక్షేమ ప«థకాలతోపాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో ఊహించని అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు కుంభా రవి, జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సామాజిక సాధికార యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈరోజు బస్సుయాత్ర ఎలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాలలో జరుగనుంది. బస్సుయాత్ర వివరాలు ఇవే.. ►అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ ►మధ్యాహ్నం 3:30 గంటలకు అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్లో బహిరంగ సభ ►సభకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు పల్నాడులో ఇలా.. ►పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:15గంటలకు A1 కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 3:15 గంటలకి పాదయాత్ర ప్రారంభం ►మల్లమ్మ సెంటర్, శివుని బొమ్మ సెంటర్ మీదుగా పల్నాడు బస్టాండు వరకు పాదయాత్ర ►సాయంత్రం 5:15 గంటలకి పల్నాడు బస్టాండు సెంటర్లో బహిరంగ సభ వైఎస్సార్ జిల్లాలో ఇలా.. ►వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:30 గంటలకు కేఎస్సీ కళ్యాణమండపంలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ►మధ్యాహ్నం 3 గంటలకు కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ ►మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రొద్దుటూరు రోడ్లో బహిరంగ సభ -
ప్రజలతోనే పొత్తు.. నెరవేర్చిన హామీలే తన ధైర్యం, జనమే తన నమ్మకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు మానవత్వంలేని మనిషి
-
వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
చంద్రబాబును నమ్మగలమా?: సీఎం జగన్
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం క్రింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి... ఇవాళ పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూనే.. గత పాలకుడు చంద్రబాబు నాయుడి అవినీతిని ఎండగట్టారు. ‘‘మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు ఇంతటి చిక్కటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, చిరునవ్వుల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’.. దశాబ్దాల నీటి ఎద్దడికి నివారణ– వరికపూడిశెల. ఈ మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా ఎద్దడి మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందని తల్లిపాలమాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్నవారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాలు పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. దశాబ్ధాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ మారుస్తూ.. ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నింటినీ కూడా మార్చాలన్న తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. గతంలో టెంకాయ కొట్టి మోసం... గతంలో మీరు గమనించే ఉంటారు. ఇదే పథకానికి గతంలో ఎన్నికలకు కేవలం నెల ముందు... గత పాలకులు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా.. ఈప్రాజెక్టుకు సంబంధించిన భూమి... ఏమాత్రం ప్రొక్యూర్ చేయకుండానే, మనందరినీ మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని చెప్పి మనందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయండి. నేడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభం... ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావడం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మన హయాంలోనే ప్రొక్యూర్ చేశాం. అవన్నీ లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు లేకుండానే.. భూమి ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు గత పాలకులు, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడకువచ్చి టెంకాయ కొట్టారు అని మీ అందరి తరపును నేను అడుగుతున్నాను. ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి ఉండాలి. నోటిలో నుంచి మాట వస్తే అందులో నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలని... మోసం తోనే అడుగులు వేస్తే... ఏం జరగబోతుందన్నది ప్రజలే 2019లోనే గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలను గానూ.. గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని కేవలం 23 స్ధానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చారు. అబద్దాలను నమ్మం, మోసాలకు ఓటు వేయం అని ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్తితులను మనం చూశాం. వరికపూడిశెల– 25 వేల ఎకరాలకు సాగు, తాగునీరు.. ఈ రోజు అందుకు భిన్నంగా.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తున్నాం. ఈ లిఫ్ట్‌ను నాలుగు పంపులతో నాగార్జున సాగర్‌కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరికెపూడిశెల వాగునుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటిదశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్ ద్వారా 20వేల మంది జనాభాకు తాగునీరందించే మంచి జరుగుతుంది. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. పల్నాడు గుండె చప్పుడు విన్న వ్యక్తిగా... ఇంకా కొన్ని విషయాలు ఈ అందరితో పంచుకుంటున్నాను. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ఔషధమో పూర్తిగా తెలిసిన వ్యక్తులలో నేను ఒకరిని. మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల నియోజకవర్గం ఆ తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎర్రగొండపాలెం వరకు తీసుకునిపోయే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అటవీ, పర్యావరణశాఖ అనుతులన్నీ కూడా ఇఫ్పటికే తీసుకునిరాగలిగామని సంతోషంగా చెబుతున్నాను. దేవుడి దయతో దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే దశలవారీగా పూర్తవుతుందో... 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమం పూర్తవుతుంది. దాదాపుగా 1లక్ష మందికి తాగునీరు అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. పౌరషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా... ఈ రోజు ఈ ప్రాజెక్టే కాకుండా..ఈ పల్నాడను, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి, స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్ధాలుగా ఎవరూ సాహసం కూడా చేయని విధంగా... ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ వచ్చాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా.... ఇక్కడ ఈ ప్రాంతానికి వేగంగా ఇప్పటికే పనులు జరుగుతున్న మెడికల్ కాలేజీని కూడా మన ప్రభుత్వమే తీసుకువచ్చింది. ఒక్క పల్నాడే కాదు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చాం కాబట్టే... మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేదు. ఇక నాన్ డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా రూ. 1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం 53 నెలల కాలంలో అక్షరాలా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేలు చేసింది. లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష చూపే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్కచెల్లమ్మల కుటుంబాల వద్దకు వచ్చి... నీకు ఏం అవసరం ఉందని ప్రతి ఇంటికి వచ్చి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసే కార్యక్రమం మీ బిడ్డ పాలనేలో జరుగుతుంది. కోవిడ్ ఉన్నా ఆగని సంక్షేమం.... మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. వరుసగా రెండేళ్లు మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు. కోవిడ్ సమస్యులున్నా... ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఆదాయాలు తగ్గినా, కోవిడ్ ఖర్చుల పెరిగినా, బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎవరిమీదా నేరం మోపలేదు. సాకులు వెతకలేదు, చెప్పలేదు. మీ అవసరాలు మీ కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఖర్చులకన్నా మిన్నగా భావించి... ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా నిలబడగలిగింది. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు. అభివృద్ధి ఆపలేదు. మరోవైపు చంద్రబాబు గారి గత పాలన ఎలా జరిగింది. ఎందుకంటే రాబోయో రోజుల్లో మహా సంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఆ మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ? గతంలో పాలన ఎలా జరిగింది ? అందులో ఆ పెద్దలు, పాలకులు ఎలా పని చేశారు? మనకు మంచి చేయగలుగుతారా? లేదా అన్నది ఆలోచన చేయాలి. గతానికీ– నేటికీ తేడా చూడండి. గత పాలనకు, మీ బిడ్డ పాలనకు బేరీజు వేయాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మన ప్రతిపక్ష నాయకుడ్ని చూడండి. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ కనీసం ఒక్క పథకమైనా పెట్టిన చరిత్ర గతంతో చంద్రబాబుకు ఉందా? గతం మోసాల చరిత్ర.. గతంలో మనం ఏం చూశామంటే... మోసాల చరిత్రను చూశాం. వెన్నుపోట్ల చరిత్రను చూశాం. అబద్ధాల చరిత్రే మనకు చంద్రబాబు పాలనలో కనిపించింది. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశానని గానీ, కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానని గానీ, కనీసం ఒక మంచి కార్యక్రమం అమలు చేశానని కానీ ఈ పెద్దమనిషి ఓటు అడగడు. కారణం ఈ పెద్దమనిషి చేసిందేం లేదు కాబట్టి. కానీ ఈయన ఎన్నికలు రాగానే అది చేస్తాను, ఇది చేస్తానని చెబుతాడు. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు. ఆలోచన చేయండి.. మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే మీరు అండగా నిలబడాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫలానా మంచి చేశాను, నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మంచి చేసానని ఓటు అడగడం లేదు... మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు.. మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబును నమ్మగలమా ? ఇదే పెద్దమనిషి చంద్రబాబు చివరికి సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కూడా 34 ఎమ్మెల్యేగా ఉన్నా ... అక్కడ కూడా నీరిచ్చిన చరిత్ర లేదు. కుప్పానికే నీళ్లు ఇవ్వని చంద్రబాబు.. మన మాచర్లకు, మన పల్నాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్దమనిషి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా? నమ్మగలుగుతామా? కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషి చంద్రబాబు మాటలు చూస్తే అవే కదా గుర్తుకొస్తాయి. కుప్పానికేం చేయలేని బాబు... 14 యేళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేపోయాడు. అలాంటి ఈ పెద్ద మనిషి... ఇక మన పల్నాడుకు గానీ, మరోప్రాంతానికి గానీ, మన గ్రామానికి గానీ, మన కుటుంబాలకు గానీ, మన సామాజిక వర్గాలకు గానీ మంచి చేస్తాడని నమ్మగలమా?. చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా ? చివరికి కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలన్నా ? చేసేది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని ఈ పెద్ద మనిషి చెప్పాడు. చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలుగా ఉన్న నా అక్కచెల్లెమ్మల సీ గ్రేడ్ గా, డీ గ్రేడ్ గా వారి పరపతి దిగజారిన పరిస్థితులు చూశాం. చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేసిన ఇలాంటి బాబు.. ఒక జగనన్న అమ్మ ఒడిగానీ, జగనన్న వైయస్సార్ ఆసరా గానీ, వైయస్సార్ చేయూత గానీ, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా? చేస్తానంటే నమ్మగలమా?.. బాబు విజన్ – ప్రజల్లో చెవిలో పువ్వులు... ఈయన్ను చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. ఎప్పుడూ లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్పడు. ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2047 గురించి చెబుతాడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉన్నావ్.. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వా ఏం జరగబోతోందనేది చెబుతాడు. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ? ఎవడు పోతాడో ? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడం ఈజీ కదా అని ఆలోచిస్తాడు. మీ బిడ్డ 53 నెలల పాలనలో.. అదే మీ బిడ్డ పాలనలో 53 నెలల కాలంలో పల్నాడును జిల్లా చేసింది మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడులోగానీ, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా, గ్రామ గ్రామాన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష జరుగుతోంది.ఇంగ్లీష్ మీడియం బడులొచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కూడా మనం, మనందరి ప్రభుత్వమే. అది కూడా ఈ 53 నెలల కాలంలోనే చేశాం. వెన్ను పోటు వీరుడు.. కుటుంబంలో సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, ఇక రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్ లో ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా? అని అడుగుతున్నాను.సొంత కూతురుని ఇచ్చిన మామ... ఎన్టీ రామారావు పరిస్థితే అది అయితే, నువ్వు, నీలాంటోడు, నాలాంటోడి పరిస్థితి ఏంటి?.. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని మనిషి ఈ పెద్దమనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్ లో నేను మారాను అంటే నమ్మగలమా? తన కొడుకు, తన మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లీషు మీడియమే. ఆ కొడుక్కు తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందంటే అదీ రాదు. అది వేరే విషయం. కానీ తన కొడుకు, మనవడు వీళ్లను చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్లే మన గవర్నమెంట్ బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట. అవి తెలుగుమీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లిషు మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుందని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా, ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుందనే నమ్మకం ఉందా? అని అడుగుతున్నాను. ఇలాంటి పెద్ద మనిషి రేపు మీ దగ్గరకి వచ్చి.. నేను మారాను అంటే నమ్మగలమా?. గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ 2 వేల నిరుద్యోగ భృతి.. ఈ మాటలన్నీ గుర్తున్నాయా ? జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేసాడు. స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చిన దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే... ఈ పెద్ద మనిషి చంద్రబాబును నమ్ముకుంటే ఇలా 2.07 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలడా? రేప్పొద్దున మీ దగ్గరకు వచ్చి నేను మారాను అంటే నమ్మగలమా?. మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నీ కూడా నీట్ గా అమ్మేసి గవర్నమెంట్ ను మూసేసేవాడు. ప్రభుత్వ రంగంలో హాస్పిటళ్లు కూడా ఉండేవి కాదు. దేవుడి దయతో ఆయన పోయాడు కాబట్టి వీటికి కొత్తరూపు వచ్చింది. ఆస్పత్రులు స్కూళ్లు మారాయి. ఆర్టీసీని కూడా గవర్నమెంట్ లో కలిసి రూపురేఖలు మారిన పరిస్థితులు మన ప్రభుత్వంలో వచ్చాయి. ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్దమనిషి వైద్య ఆరోగ్య రంగంలో... మనందరి ప్రభుత్వంలో... విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా?. పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని భవిష్యత్ లో ఈ పెద్దమనిషి అంటే నమ్మగలమా? ఆలోచన చేయండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయన్న ఈ పెద్దమనిషి... ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్దమనిషి, రుణాల మాఫీ దగ్గర నుంచి రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా ఏనాడైనా నిలబెట్టుకున్నాడా?. అలా రైతును మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు ఏదేదో చేస్తానంటాడు. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వరై్డజ్మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక రైతులను అడ్డగోలుగా మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా ?. చంద్రబాబు వాలకం ఎలా ఉంటుందంటే... నరమాంసం రుచి మరిగిన పులి బంగారం కడియాన్ని చూపుతూ ఫ్రీ గిఫ్ట్ ఇస్తా అని ఆశ పెడితే, ఎవరైనా ఆ బంగారు కడియం కోసం పులి దగ్గరకు వెళ్లే ధైర్యం చేయగలుగుతారా? ఈపెద్ద మనిషి చంద్రబాబు మాటలు నమ్మితే కూడా అదే మాదిరిగా ఉంటుంది. తన బినామీ భూములు బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరుగుతుందని ఎవరికైనా నమ్మకం ఉందా?. ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా? తన హయాంలో చంద్రబాబు పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. తన హయాంలో పేదలకు సెంటు స్ధలం కూడా ఇవ్వకపోగా... మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. అంతే కాకుండా... కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా మంచి జరుగుతుందా? ఇలాంటి వ్యక్తి నేను మారాను, భవిష్యత్ లో ఇవన్నీ చేస్తానంటే నమ్మగలమా? బాబు– లంచాల పాలన... తన పాలనలో పేదలకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ, గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్దమనిషి మనసు మారాలంటే, గుండె కరగాలంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు, గుండె కరిగే ఇంజెక్షన్లు ఎన్ని ఇస్తే ఈ పెద్ద మనిషిలో మానవత్వం వస్తుందో ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఒకడే చెబితే నమ్మరని, తనకు తోడు ఇంకో నలుగురిని కలుపుకుంటున్నాడు. వాళ్లు అందరూ.. ప్రతి ఇంటికీ బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారు. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడుని కలిశాను కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నాము. మొత్తం 11 హామీలిస్తున్నామంటున్నారు బాబు– దత్త పుత్రుడి మోసం... 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. ఇదే చంద్రబాబుతో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోదీ వీళ్లిద్దరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. అలాంటి గత చరిత్ర ఉన్నవాళ్లు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే.. 5 హామీలు ఒకరు, 6 హామీలు ఇంకొకరు కలిసి 11 హామీల మేనిఫెస్టో ఇది. ఇది రిహార్సల్ అట, మేనిఫెస్టో ఇంకా ఎక్కువ ఇస్తారట. నిజంగా వీళ్లు మనుషులేనా? వీళ్లకు సిగ్గుందా?. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నా... ఇటువంటి దారుణాలను సమర్థించేందుకు చంద్రబాబుకు ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది. ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్లందరిదీ ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి బాబు తరపున పనిచేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో తన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు? ఏ పేద వాడి కోసం చేస్తున్నారు?. కేవలం ప్రజల్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం కోసం దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డ చేతకాదు. ఒక వైయస్సార్‌కు గానీ, ఒక జగన్‌కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. నేను విన్నాను– ఉన్నాను.. మీ జగన్.. నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్ చెబుతాడు. ఆ తర్వత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్‌గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. మీ బిడ్డ ఈ పొత్తుల్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు లేదు. కారణం మీ బిడ్డ వీళ్లనెప్పుడూ నమ్ముకోలేదు. పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ దళారులను పెట్టుకోలేదు. చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం ఇంటింటికీ, అన్ని సామాజిక వర్గాలకూ, అన్ని ప్రాంతాలకు చేసిన మంచి. మనందరి ప్రభుత్వం ఇంటింటికీ అన్ని సామాజిక వర్గాలకు చేసిన మంచే నా ధైర్యం. బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన రూ. 2.40 లక్షల కోట్లు నా ధైర్యం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం మీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం. ఎన్నికల మేనిఫెస్టో చూపించి 99 శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను చూపి అక్కా.. మీ బిడ్డ ఇవన్నీ ఎన్నికలకు మందు చెప్పాడు. ఇవన్నీ జరిగాయా లేదా మీరే చూడండి.. జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని నిజాయితీ అడిగే చిత్తశుద్ధి. నా ధైర్యం.. నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ.. మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్ లు. ఆగ్రామంలో మార్చిన వ్యవసాయ తీరు ఆర్బీకే కేంద్రాలు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. నాడు నేడుతో బడులు రూపు రేఖలు మార్చడం నా ధైర్యం. మన అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా ఇవ్వడం నా ధైర్యం. అమ్మ ఒడి ఇవ్వడం, వైయస్సార్ చేయూత ఇవ్వడం నా ధైర్యం. దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించి, అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ షేక్ చేసినా, ఎస్ వోఎస్ నొక్కినా 10 నిమిషాల్లో పోలీసు అన్నదమ్ములు వచ్చే వ్యవస్థను తీసుకురావడం నా ధైర్యం. నా పొత్తు ప్రజలతోనే.. ప్రజలతోనే నా పొత్తు. పేద ప్రజల కోసమే నా పార్టీ, మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టిందనే చిత్తశుద్ధి నా ధైర్యం. అందుకే దళారులతో పొత్తు పెట్టుకోలేదు. రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మోసాలకు మోసపోవద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా ? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. చివరగా.. కాసేపటి క్రితం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులే కాకుండా.. మరికొన్ని పనులు అడిగాడు. అందులో ఒకటి ఇక్కడున్న సీహెచ్సిని 100 పడకల ఆసుపత్రి కింద మార్చే కార్యక్రమం చేయమన్నాడు. దాన్ని మంజూరు చేస్తున్నాను. వీటితో పాటు మిగిలినవన్నీ చేస్తాను అని హామీ ఇస్తూ... తన ప్రసంగం ముగించారాయన. చదవండి: అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’ -
పల్నాడు జిల్లా : వరికపూడిశెల ఎత్తిపోతల ప్రత్యేక (ఫొటోలు)
-
పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం: సీఎం జగన్
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం. ►రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. ►ఎలాంటి అనుమతులు లేకుండా గల పాలకులు ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతే.. ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ప్రాజెక్ట్‌ను చేపట్టాం. ►నవంబర్ 6న అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ఏదైనా పనిచేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో సాగునీరు అందుతుంది. ►ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించబోతున్నాం. ►పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారతకు కృషి చేశాం. రూ.2లక్షల 40వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ►డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4లక్షల 10వేల కోట్లు అందించాం. ►కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపలేదు. ►చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. ►చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలే. ►14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. ►కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా?. ►కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?. ►కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్లతో వస్తాడు. ►రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. పల్నాడును జిల్లా చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ►సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా?. ►చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా అన్నది చంద్రబాబే. ►బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడిందీ చంద్రబాబే. ►చంద్రబాబు ఇప్పటి గురించి చెప్పడు కానీ.. రాబోయే 50 ఏళ్లలో ఏం చేస్తాడో చెబుతాడు. ►అప్పటి వరకు బ్రతికి ఉండేది ఎవరు?. ►చంద్రబాబు మానవత్వంలేని మనిషి. ►ప్రజల సంక్షేమం చంద్రబాబుకు పట్టదు. ►చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారు. ►చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు. ►నాకు ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. ►చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ►రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నాం. ►మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది. ►అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. రాబోయే 30 ఏళ్లు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పల్నాడు ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే ►వైఎస్సార్ వరికపూడిశెల ప్రాజెక్టుగా నామకరణం చేయాలి ►అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు ►ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చినే సీఎం జగన్ ►రూ.320.26 కోట్లతో ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►తొలి దశలో 24 వేల ఎకరాలకు సాగునీరు ►ఆరు దశాబ్దాల తర్వాత పర్యావరణ అనుమతులు ►సీఎం జగన్ కృషితో కేంద్ర అటవీ శాఖ అనుమతి ►పల్నాడు ప్రాంతానికి వరికపుడిశెలతో పాటు గోదావరి జలాలు ►పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ ►పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాచర్ల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు మాచర్లలో పోటెత్తిన జనం ►రైతులతో కిటకిటలాడుతున్న మాచర్ల ►సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా ఎదురుచూపు ►అరవై ఏళ్ల కల నెరవేరుతుండటంతో పల్నాడు వాసుల్లో ఆనందం ►సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు బారులు తీరిన రైతులు ►ఉదయం నుండే కిటకిటలాడుతున్న సభావేదిక గ్యాలరీలు ►మాచర్ల బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►కాసేపట్లో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్న సీఎం సాక్షి, అమరావతి: పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. ‘వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం జగన్ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. -
పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చనున్న సీఎం వైఎస్ జగన్
-
రేపు మాచర్లకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం బుధవారం మాచర్లలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ మాచర్ల షెడ్యూల్ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను లైన్ క్లియర్ అయ్యింది. దాదాపు రూ.340.26 కోట్లతో జరగబోయే పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తోంది జగనన్న ప్రభుత్వం. చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల -
31 లక్షల ఇళ్ల పట్టాలు రెడీ..అలీ కామెంట్స్
-
సామాజిక సాధికార బస్సుయాత్ర.. 10వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(మంగళవారం) 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో బస్సుయాత్ర కొనసాగనుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుంది. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యేబొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు శివయ్య స్థూపం సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస ఆంజనేయస్వామి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం గం. 1:30ని.లకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని గేటు పాఠశాలలో నాడు-నేడును పార్టీ నేతల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగురోడ్ల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
కడుతున్న భవనాలు కనబడలేదా?
విజయపురిసౌత్ (మాచర్ల): రాష్ట్రంలో అద్భుతంగా వైద్యరంగాన్ని తీర్చిదిద్దుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలనే లక్ష్యంతో రామోజీరావు విషపురాతలకు దిగుతున్నారు. అలాంటి ఓ కథనాన్ని ‘చెట్టుకింద వైద్యం’ శీర్షికతో తన ఈనాడు పత్రికలో ప్రచురించారు. వాస్తవం ఏంటంటే.. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో చివరి సరిహద్దు గ్రామమైన విజయపురిసౌత్‌లోని పాత బస్టాండ్ ఎదురుగా రూ. 5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. 2021లో ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. తర్వాత సంవత్సర కాలం పైగా కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో తాత్కాలికంగా పక్కనే ఓ ప్రభుత్వ భవనంలో వైద్యులు సేవలు కొనసాగిస్తున్నారు. ఓ పక్క పక్కా భవనం సిద్ధమవుతున్నా పట్టించుకోకుండా ఈనాడు పత్రిక కట్టుకథలు రాసింది. ఉత్తమ స్థాయి వైద్యులు ఆసుపత్రిలో పనిచేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నారు. గిరిజన తండాలు, సుమారు 15 సమీప గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూడా ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రామోజీకి మాత్రమే సేవలు కానరాక అక్కసు వెళ్లగక్కారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఆసుపత్రి విషయంలో ఏమాత్రం పరిజ్ఞానం లేని లోకేశ్ విమర్శలు చేయడాన్ని స్థానిక నేతలు తప్పుబడుతున్నారు. కమ్యూనిటీ ఆసుపత్రిగా చాలా కాలంగా సేవలు అందిస్తున్న విజయపురిసౌత్ ఆసుపత్రి భవనాలు శిథిలమైతే నాడు–నేడు కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ రూ. 5 కోట్లు కేటాయించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టటంతోపాటు 8 మంది వైద్యులు, ఓ రేడియోగ్రాఫర్, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, 10 మంది శానిటరీ సిబ్బంది, ఓ జూనియర్ అసిస్టెంట్, ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సబార్డినేట్‌ను నియమించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చుట్టుపక్కల తండాలు, గ్రామాలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఈనాడుకు కనిపించలేదు. డిసెంబర్ ఆఖరుకల్లా కొత్త భవనం ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరు కల్లా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన రెండు ప్రభుత్వ గృహాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. – కేపీ చారి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్. -
సామాజిక సాధికారితకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్
మాచర్ల(పల్నాడు జిల్లా): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం ఆరో రోజు బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలోని మాచర్లలోని పార్క్ సెంటర్ వద్ద జరిగిన సభలో వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానేతకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఎంపీలు కృష్ణ దేవరాయులు, విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, ఎమ్మేల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి ,సునీత, కుంబా రవిబాబు, ఏసురత్నం, పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బడుగు బలహీనర్గాలను సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి జగన్ తప్ప మరొకరు లేరు. దమ్మున్న నాయకుడు కాబట్టే కరోనా విపత్తులోనూ , రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, వసతి దీవెన, పంట బీమా, జగనన్న తోడు, చేదోడు వంటి అనేక పథకాలు అమలు చేశారు.కరోనా సమయంలో పేదల ప్రాణాలకోసం సీఎం జగన్ పరితపించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం 2,300 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గానికి ఖర్చు చేశారు. త్వరలోనే సీఎం జగన్ రూ.1600 కోట్లతో వరికశిల పూడి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ ఆదేశాలతో బడుగు బలహీనర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం’ అని తెలిపారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఎమ్మెల్యే పిన్నెల్లి. ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ‘ పల్నాడు గడ్డ వైసీపీ అడ్డ. చంద్రబాబు హయాంలో రాక్షస పాలన జరిగింది. మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. సమాజంలో అణచివేతకు గురైనవారిని పైకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. మాచర్లలో 50 వేలమంది గిరిజనులు ఉన్నారు. షెడ్యూల్ కులాలు, తెగలను చంద్రబాబు నీచంగా చూశారు. ఎస్సీల్లో ఎవరు పుట్టలనుకుంటారు.. గిరిజనులకు తెలివితేటలు ఉండవు అనే మాటలతో చంద్రబాబు హింసించారు. దేశంలో 3లక్షల 26 వేల ఎకరాల భూమిని ట్రైబల్స్ కు అటవీ చట్టాల ప్రకారం పంచిన వ్యక్తి సీఎం జగన్ ఒక్కరే. ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, ట్రైబల్ హాస్పిటల్ స్థాపించారు’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ అన్ని వర్గాల కోసం రాజ్యాంగం రాశారు. రాజ్యాధికారంలో అంతర్భాగం అయినప్పుడే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయి. కులగణన చేయాలని తీర్మానం చేశాం. బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్. ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ..‘ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు నేను ఓడిపోయినా ప్రపంచప్రఖ్యాతి గాంచిన మిర్చియార్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి చెందిన నన్ను నియమించారు. ఆ పదవిలో వుండగానే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబును దగ్గరగా చూశాను.. పేదకులాలకోసం ఒక్క పని కూడా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి.. చంద్రబాబు మాటలను నమ్మవద్దు’ అని తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ పల్నాడు పౌరుషానికి ప్రతీక పిన్నెల్లిరామకృష్ణారెడ్డి.ప్రజల్లో ఉన్నారు కాబట్టే నాలుగుసార్లు గెలిపించారు. 2024లో మాచర్లలో, రాష్ట్రంలో వైసీపీ జెండా మరోసారి ఎగరబోతోంది. 2014నుండి 2019 వరకు జరిగిన చంద్రబాబు పాలనను, సీఎం జగన్ పాలనను బేరీజు వేసుకోవాలి. డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా మాట్లాడుతూ.. ‘ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాల్లో సామాజిక సాధికారతను చేతల్లో చూపించిన వ్యక్తి సీఎం జగన్. సామాజిక న్యాయమే జగన్ విధానం. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మైనార్టీని నియమించడం ఒక చరిత్ర. మైనార్టీల సంక్షేమంలో కోసం చంద్రబాబు రూ.2600 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రూ.23వేల 176 కోట్లు ఖర్చు చేశారు. సామాన్యులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రతిపక్షాలు ఒక్క జగన్ ని ఎదుర్కోవడానికి కలిసిపోయాయి’ అని పేర్కొన్నారు. ఎంపీ కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ.. ‘ 2019లో అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ముందు రెండు దారులు ఉన్నాయి. మేనిఫెస్టోను వెబ్సైట్నుండి తొలగించి మాట తప్పడం ఒక దారి.. ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి విపత్తు వచ్చినా ప్రతీ హామీని నిలబెట్టుకోవడం మరో దారి. సీఎం జగన్ ఏ దారి ఎన్నుకున్నారో మీరే ఆలోచించుకోవాలి. గెలిచిన తర్వాత నాలుగున్నరేళ్ళపాటు ప్రజల్లోనే ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు అధికారం ఇస్తే పెత్తనం చేశారు. కొడుకుకు, మనుమడికి దోచి పెట్టారు. చంద్రబాబు ఆధారాలతో దొరికాక కూడా నిజం గెలవాలి అంటున్నారు. చంద్రబాబు రోగాలతో బయటకు వచ్చారు. బాలకృష్ణ చంద్రబాబును టచ్ చేయమంటున్నారు. చంద్రబాబును టచ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎవరికీ లేదు. సీఎం జగన్ తాను నివాసం ఉంటున్న కొద్ది దూరంలోనే ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అమరావతిని అడ్డుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారు’అని పేర్కొన్నారు. -
కృష్ణారెడ్డిని గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపిన టీడీపీ నేతలు
-
పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు. జంగమహేశ్వపురం వైఎస్సార్సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు. -
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పసుపులేరు బ్రిడ్జిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారంతా వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల వారుగా గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఏకకాలంలో 15 చోట్ల దాడులు -
జగనన్న ఆరోగ్య సురక్ష ఓ అద్భుతం
ముఖ్యమంత్రివ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి విడదల రజిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువే చేసే వీలు ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఫేజ్ 1 సర్వే పూర్తయిందని చెప్పారు. ఫేజ్ -2 , ఫేజ్ -3 సర్వే లు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని సర్వేలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయా జిల్లాలల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని చెప్పారు. క్యాంపుల్లో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఏకంగా 118 రకాల మందులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, క్షేత్రస్థాయిలో ఇవన్నీ పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆరోగ్య శ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించేలా ఇంటింటికీ వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ కరపత్రాల్లో ఉన్న అన్ని అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. యాప్‌లు కొలమానంగా..! మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటి సర్వే కు వచ్చే సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఎన్ని సెల్‌ఫోన్ లలో ఆరోగ్యశ్రీ అనువర్తనం డౌనల్ లోడ్ అయింది అనే దానిపై కూడా మదింపు ఉంటుందని తెలిపారు. ఎక్కుడ సెల్ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయితే ఆ వాలంటీర్లు బాగా పనిచేసినట్లుగా గుర్తించాలని కోరారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి దండోరా వేయించడం ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలిపారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు కూడా వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలని చెప్పారు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి బాగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్ధో నిపుణులు కూడా ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా క్యాంపులు ఉండాలి అన్ని గ్రామాలు, వార్డుల్లో జరిగే వైద్య శిబిరాలు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలని చెప్పారు. టోకెన్ల పంపిణీ, కన్సల్టేషన్, పరీక్షలు, మందుల పంపిణీ, అవసరమైన రోగులను పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం.. ఇదంతా ఒక క్రమపద్ధతిన జరగాలని చెప్పారు. రోగులు ఎక్కువ సమయం శిబిరాల వద్దనే నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శిబిరాల్లో రోగుల సమయం వృధా కాకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా వీడియోలు, కరపత్రాలు, బ్యానర్లు లాంటివి వైద్య శిబిరాల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, శాఖ ఉన్నతాధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. సదుపాయాలకు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చేయాలంటే క్షేత్రస్థాయి పరిశీలనలను తప్పనిసరి అని చెప్పారు. తాను సైతం మెడికల్ క్యాంపులు జరుగుతున్నతీరును క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకొచ్చేలా మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి, ఎన్ హెచ్ఎం స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట రవికృష్ణ, సిఎవో గణపతి రావు, జగనన్న ఆరోగ్య సురక్ష స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడుజిల్లా దాచేపల్లిలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు
-
చంద్రయాన్ స్పీడ్‌తో చంద్రబాబు వెళ్తున్నారట!
సాక్షి, పల్నాడు జిల్లా: క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తోందని, చంద్రయాన్ స్పీడ్‌తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోందన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం చేస్తుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘2024లో 24, 25 లోక్‌సభ స్థానాలు వైఎస్సార్సీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్‌కి టీడీపీ రెడ్‌లో ఉండటంతో నిద్ర పట్టడం లేదు. లోకేష్, చంద్రబాబు గెలిస్తే తంతాం, బట్టలూడదీస్తాం అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే.. ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు. విజన్ 2047 చంద్రబాబుది కాదు.. నీతి ఆయోగ్ ది. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు’’ అని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ గెలిచింది. లోకేష్, చంద్రబాబు సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజల డబ్బుతో కట్టిన రిషికొండ లో భవనాలను ఎందుకు కూలుస్తారు. చంద్రబాబు, లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులు. టీడీపీ అధికారంలో రావటం కల్ల. సీఎంనే అయ్యన్న అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అయ్యన్న పాత్రుడు కాదు.. అర గుండు పాత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు. చిలుకలూరి పేట సమావేశం జరిగినప్పుడు ముగ్గురిమే ఉన్నాం. మేము ఏం మాట్లాడుకున్నామన్నది ఏదో ఊహించుకొని రాయటం తప్పు. పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో! -
ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ శ్రేణుల బరితెగింపు
పెదకూరపాడు: టీడీపీ నేత నారా లోకేశ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాదయాత్ర లగడపాడు గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే.. రోడ్డు పక్కన ఉన్న ఎస్సీ కాలనీ వాసులు ఎప్పడో ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్సీపీ జెండాలను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. కొందరు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చి ఆ జెండాలను తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. తాము ఏర్పాటు చేసుకున్న జెండాలను ఎందుకు తొలగించారంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. ఒక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. అయినా టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఎస్సీ కాలనీ మహిళలు తమ ఇళ్లలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫొటోలు తెచ్చి.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. మా ఎస్సీలకు టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. దీంతో కొందరు టీడీపీ కార్యకర్తలు వాటర్ బాటిళ్లను మహిళలపైకి విసిరారు. ఆగ్రహించిన ఎస్సీ మహిళలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. రెండు వర్గాలకు మధ్య పోలీసులు నిలబడి సర్దిచెప్పారు. అటుగా వెళుతున్న లోకేశ్‌ను చూసి.. జై జగన్ అంటూ ఎస్సీ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్‌లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే కాసు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు చనిపోయారు. గురజాలలో జరగబోయే లోకేష్ సభకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పాలని చనిపోయిన ఇద్దరు బాలురు కుటుంబ సభ్యులపై యరపతినేని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాసు ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా లోకేష్ దగ్గర చెప్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటూ యరపతినేని శ్రీనివాసరావు ప్రలోభాలు పెడుతున్నారని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
గత టీడీపీ ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసింది
-
పల్నాడు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన పచ్చపార్టీ రౌడీగ్యాంగ్
-
టీడీపీ నేతల రౌడీయిజం.. పోలీసు వాహనాలు ధ్వంసం
సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో టీడీపీ నేతలు రౌడీయిజం చెలాయించారు. సివిల్ వివాదంలో ఐపీ పెట్టిన వ్యక్తి ఇంటిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను అప్పు ఇచ్చిన మిగిలిన వ్యక్తులు నిలదీశారు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు దాడి చేశారు. కాగా, ఈ క్రమంలో టీడీపీ నాయకులు పోలీసు వాహనాల అద్దాలను సైతం పగులగొట్టారు. ఇది కూడా చదవండి: విషాదం: ప్రియాంక ఆత్మహత్య -
మేనిఫెస్టో అంటే జగన్.. ఉన్నది ఉన్నట్టుగా..: దేవులపల్లి అమర్
సాక్షి, సత్తెనపల్లి: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన "మేనిఫెస్టో అంటే జగన్" చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. "జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందట. కాంగ్రెస్ నినాదం గరీబీ హఠావో అమలు కాలేదు. సమాజమే దేవాలయం అన్న టీడీపీ 20 ఏళ్లు పాలించింది. అయినా రాష్ట్రంలో పేదరికం ఇంకా ఎందుకు ఉంది? జగన్ పేదవాడి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టో పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి గెలుపు జగన్‌కే సాధ్యమైంది. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ప్రతీ గడపకు నాయకులు అధికారులు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థను జగన్ క్రియేట్ చేసారు. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారు" రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అమర్ అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రశాంత సీమలో ఆటవిక చిచ్చు!
సాక్షి, అమరావతి: అలనాటి రామాయణంలో.. యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు రాకాసిమూకలు మేఘాల్లో దాగినట్లుగా ఈనాటి రాక్షసులు ఫిలింసిటీ కొండల్లో నక్కి సంక్షేమ యజ్ఞంపై రోజుకో కుట్ర పన్నుతున్నారు! అందులో తాజా అంకమే ‘ఈనాడు – ఆటవిక రాజ్యం’!! పల్నాడులో ఏ గడపను పలుకరించినా వివక్షకు దూరంగా సాగుతున్న సంక్షేమ పాలన, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన అభివృద్ధి ఫలాల గురించి చెబుతుంది. నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పల్నాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతోపాటు కొత్త మెడికల్ కాలేజీ, వరికపుడిసెల, జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణంతో ప్రగతి రథం పరుగులు తీస్తోంది. మాచర్లలో 90 శాతం కుటుంబాలకు లబ్ధి పల్నాడు పట్టుగొమ్మ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పుడు 3,66,269 మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతున్నారు. నాలుగేళ్లలో డీబీటీతో నేరుగా రూ.1,209.56 కోట్లు లబ్ధి పొందారు. నియోజకవర్గంలో 1,07,793 కుటుంబాలు ఉండగా 97,136 కుటుంబాలకు డీబీటీ పథకాలు అందుతున్నాయి. 90.11 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరుతున్నట్లు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 3,05,078 జనాభా ఉండగా 1,59,017 మంది డీబీటీ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇక నాన్ డీబీటీతో 1,13,443 మంది ప్రయోజనం పొందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.2,21,168.55 కోట్లను ప్రభుత్వం నేరుగా అందించడం గమనార్హం. రాష్ట్రంలో 1,66,05,771 కుటుంబాలు ఉండగా 1,47,37,989 కుటుంబాలకు డీబీటీ పథకాల ద్వారా ప్రయోజనం దక్కుతోంది. 88 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందడం దేశంలోనే రికార్డు. ఫ్యాక్షన్ ‘బాబు’.. కోడెల కోటలో బాంబులు! చంద్రబాబు పేరెత్తితేనే పల్నాట పాత గాయాలు రేగుతాయి. 1999 ఎన్నికల సమయంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో నలుగురు మృతి చెందిన విషయం ఎవరూ మరచిపోలేరు! 2001 మార్చి 9న దుర్గి మండలం ఆత్మకూరు బోడు వద్ద కాంగ్రెస్ వర్గీయులపై బాంబులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఏడుగురిని ఒకేసారి నరికి చంపారు. 2014 నుంచి 2019 వరకు పల్నాడులో ముఠా కక్షలు జడలు విప్పాయి. 2014 – 2019 పల్నాడులో టీడీపీ మారణహోమం ఇలా.. - 2014 సెపె్టంబర్ 22వతేదీన వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో వైఎస్సార్ సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డి టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. జంట హత్యలతో చితికిపోయిన ఆయా కుటుంబాలు గ్రామం వదిలి వేరే చోట తలదాచుకున్నాయి. - టీడీపీ అధికారంలో ఉండగా నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో మృతి చెందాడు. - 2014 సెపె్టంబర్ 11న కారంపూడి మండలం చినగార్లపాడులో వైఎస్సార్సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45) ఇంటిపై దాడి చేసి వెంటాడి చంపారు. అడ్డు వచ్చిన భార్య కోటేశ్వరమ్మను, చింతలచెర్వు కోటిరెడ్డిని సైతం హతమార్చేందుకు ప్రయతి్నంచారు. - 2014 డిసెంబర్ 19న కోర్టు వాయిదాకు హాజరై తిరిగి వెళ్తున్న దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు. - 2013లో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత పెద వెంకటేశ్వర్లు (బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. - 2017 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ ముఠాలు వేట కొడవళ్లతో నరికి చంపేశాయి. - వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎస్.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్ సాంబశివరావు వర్గీయులు 30 మంది దాడి చేసి కొట్టడంతో మృతి చెందాడు. బ్రహ్మారెడ్డి విధ్వంసం.. రాజకీయంగా మనుగడ సాగించేందుకు ఫ్యాక్షన్ చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన జూలకంటి బ్రహా్మరెడ్డిని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. ఏడుగురిని హత్య చేసిన కేసులో బ్రహా్మరెడ్డి ప్రధాన నిందితుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో మరో నాలుగు కేసులున్నాయి. మద్యం తాగి రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులపై కేసు నమోదు చేసినందుకు బ్రహా్మరెడ్డి తన వర్గంతో వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డాడు. ముప్పాళ్లలో మూకదాడులు.. టీడీపీ అధికారంలో ఉండగా ముప్పాళ్ల ఎంపీపీ స్థానం వైఎస్సార్సీపీకి దక్కకుండా కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలు మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై టీడీపీ మూకలు మేడికొండూరు వద్ద దాడులకు దిగాయి. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. మత రాజకీయాలు.. పల్నాడులో టీడీపీ హత్యా రాజకీయాలను పోలీసులు సమర్థంగా తిప్పికొడుతుండటంతో సహించలేని ఎల్లో సిండికేట్ మతాన్ని అడ్డు పెట్టుకుని దు్రష్పచారానికి తెగబడుతోంది. కారంపూడిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బోలినేది అమర్నాథ్పై టీడీపీ నేతలు హత్యా యత్నానికి పాల్పడిన ఘటనలో ఏ–13గా ఉన్న సయ్యద్ అన్వర్ బాషాను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీన్ని వక్రీకరిస్తూ మతం రంగు పులుముతూ విద్వేషాలు రేకెత్తించేందుకు ఈనాడు బరితెగించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో సయ్యద్ అన్వర్ బాషా ముద్దాయి కావడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు గురజాల డీఎస్పీ ఏ.పల్లపురాజు శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. కిడ్నాప్ జరిగినట్లు కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు. -
టీడీపీ బస్సు యాత్రలో అపశృతి..
సాక్షి, పల్నాడు: టీడీపీ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో టీడీపీ నిర్వహించిన సభలో భోజనాల సమయంలో తోపులాట జరిగింది. కాగా, ఈ తోపులాటలో వేడి సాంబార్ డేక్షలో పడిపోయి టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా -
పోలీస్ కార్యాలయంపై దాడి
-
పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక
-
డిజిటల్ బోర్డుపై సీఎం జగన్ విద్యార్థులకు విషెస్
-
పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు: సీఎం జగన్
Updates ►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం ►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం. ►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం. ►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం. ►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు.. ►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు. ►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు. ►ఇది కురుక్షేత్ర యుద్దం ►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి. ►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు. ►మరోసారి మోసానికి తెరతీశారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా? ►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు ► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్ ► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. ► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. ► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. ► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ. ► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం. ► యూనిఫామ్ డిజైన్‌లో మార్పులు చేశాం. ► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది. ► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ. ► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక ► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ. ► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం. ►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ ►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం. ►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం. ►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో విద్యా బోధన. ►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేయనున్నారు. ►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. ►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ విద్య అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు! -
ఈ నెల 12న సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో గురజాల ఆసుపత్రికి తరలించారు. మృతులను దామర్లచర్ల మండలం నరసాపురం చెందిన మంజుల(25), పద్మ(27), సక్రి(35), సోని, కవిత(30)గా గుర్తించారు. చదవండి: భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య -
బాబోయ్.. పులి!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పులులు సంచరిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో వారం కిందట ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆవుపై దాడి చేసిన విధానం, ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా రెండు పులులు దాడి చేసినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకుని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి ఆ రెండు పులులు దారి తప్పి వచ్చాయని వారు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆహారం దొరక్క వచ్చాయా!? శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గత రెండు మూడేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 73 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా.. అనధికారికంగా మరో పది పులులు ఉండొచ్చని భావిస్తున్నారు. టైగర్ జోన్లో ఆహారం లభించక వేట కోసమో, నీటి లభ్యత తగ్గడం వల్లనో పులులు పల్నాడు జిల్లా వైపు వచ్చి ఉంటాయంటున్నారు. ఈ పులులు దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, దారి తప్పి వచ్చిన రెండు పులులను తిరిగి అభయారణ్యంలోకి సురక్షితంగా పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సాయంతో పులుల జాడ తెలుసుకుని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అభయారణ్యంలో నుంచి నీటి కోసం పులులు వచ్చే అవకాశం ఉండటంతో మంచి నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్‌ను నిలుపుదల చేయాలని విద్యుత్ శాఖను కోరారు. అప్రమత్తంగా ఉండండి..దుర్గి మండల పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ప్రస్తుతం పులులకు ఎటువంటి ఆపద రాకుండా సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపడం, ప్రజలను అప్రమత్తం చేసి వాటికి దూరంగా ఉంచడం మా కర్తవ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగానే వెళ్లాలి. – రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి. రెండు పులులను చూశా.. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి పూట పొలానికి వచ్చిన సమయంలో రెండు పులులను చూశాను. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. పొలంలోని గుంతల్లో నీటిని తాగి వెళ్లాయి. ఇటీవల మా పొలం సమీపంలోనే ఆవును చంపి లాక్కెళ్లాయి. రాత్రి పూట పొలానికి రావాలంటే భయంగా ఉంది. – గోవింద, పులిని చూసిన ప్రత్యక్ష సాక్షి, గజాపురం, దుర్గి మండలం. -
సీఎం జగన్ ఆదేశాలు..యువకుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎం.ప్రేమ్హర్షవర్ధన్కు కలెక్టర్ ఎల్.శివశంకర్ రూ.లక్ష చెక్కు అందజేశారు. హర్షవర్ధన్ గత నెల 26న అనంతపురంలో సీఎం జగన్ నిర్వహించిన జగనన్న వసతి దీవెన సభకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి తాను పడుతున్న ఇబ్బందులను వివరించి ఆదుకోవాలని వేడుకున్నాడు. స్పందించిన ముఖ్యమంత్రి బాధితుడ్ని ఆదుకోవాలని, వైద్యసేవలు అందేలా చూడాలని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ స్పందించి తక్షణ సాయంగా రూ.లక్ష చెక్కును బాధితుడికి సోమవారం కలెక్టరేట్లో అందజేశారు. హర్షవర్ధన్ గుండెలో పేస్‌మేకర్ అమర్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూఅధికారి కె.వినాయకం, జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్. సునీల పాల్గొన్నారు. -
వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి..
వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్ షేక్ అష్రాఫ్ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్ అష్రాఫ్ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు. ఆదివారం రాత్రి వలంటీర్ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్æపై దాడికి దిగారు. షఫీ కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్‌ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. -
టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది. ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్‌కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. వేరే నంబర్‌ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు. నవీన్‌పై పేకాట, బెట్టింగ్ కేసులు నవీన్‌పై గతంలో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ -
AP: విషాదం.. గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి
పిడుగురాళ్ల: పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటూ ఇక్కడే జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్ సమయంలో కోటిస్వాములు తనకు ఊపిరి ఆడటం లేదని స్నేహితులకు చెప్పటంతో గాలి వీచే ప్రదేశంలో కూర్చోవాలని సూచించారు. వెంటనే గదిలోని ఫ్యాన్ కింద కూర్చునేందుకు వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న నలుగురు స్నేహితులు కోటిస్వాములను లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వాచ్‌మన్‌కు సమాచారం అందించారు. వాచ్‌మన్ వచ్చి హాస్టల్ వార్డెన్‌కు తెలియజేయడంతో హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక పరీక్షలు చేసి కోటిస్వాములు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుత్తికొండలో ఉంటున్న బాలుడు తల్లిదండ్రులకు వార్డెన్ గోపీనాయక్ సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్ వద్ద బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. కలెక్టర్‌కు ఆదేశాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్లలో సీఎం జగన్ గురువారం పర్యటించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దృష్టికి ఐదుగురు బాధితులు తమ అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, ఆర్ధిక సహకారం, ఉపాధి అవకాశాలను కల్పించాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం.. వారిని తక్షణం ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బాధితులను జిల్లా కలెక్టరేట్‌కు పిలిపించి మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య జిల్లా కలెక్టర్‌ను కలిసిన బాధితుల్లో చిలకలూరిపేట నియోజకవర్గం, కనపర్రు గ్రామానికి చెందిన తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య తన మనవరాలు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో అన్నం తినే సమయంలో అన్నవాహికకు అడ్డం పడుతుందని వాపోయారు. తమకు ఎటువంటి స్థిర,చర ఆస్తులు లేవని, ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఏడాదికి సుమారు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని అందించమని వేడుకొనగా తక్షణ సాయం కింద బాధితులకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని జిల్లా కలెక్టర్ అందించారు. చిలకలూరిపేట నియోజకవర్గం, ఏలూరుకు చెందిన పటాన్ మహబూబ్ సుభాని తనకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తనకున్నసమస్యను పరిష్కరించడంతో పాటు కుటుంబ జీవన విధానం బాగుపడేందుకు తగిన ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్ధిక సాయం కింద బాధితునికి జిల్లా కలెక్టర్ 1 లక్ష సాయం అందజేశారు. పటాన్ మహబూబ్ సుభాని అనురాధ, వెంకటేష్ దంపతుల ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) చిలకలూరిపేట పట్టణం 18వ వార్డుకు చెందిన అనురాధ, వెంకటేష్ దంపతులు తన ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) పుట్టినప్పటి నుండి కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతుందని సీఎం ముందు వాపోయారు. పాపకు పలు ఆస్పత్రులలో చికిత్సలు అందించినప్పటికీ, హైదరాబాద్‌లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పటల్ నందు సమస్య నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి పాపకు వైద్యం చేయించామని, కాలేయ మార్పిడి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకోసం లక్షల్లో చికిత్సకు ఖర్చవుతుందని తెలియజేయడంతో బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆశ్రయించి వేడుకోవడంతో వారికి సీఎం వైద్య చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం కింద ఖర్చుల నిమిత్తం 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు. నరసరావుపేటకు చెందిన సమీన్ పర్వానా అనే మహిళ తన ఏడేళ్ల సుభాని అనే బాలునికి జ్వరం రావడం తో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తీసుకు వెళ్ళానని, ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వలన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడని అక్కడినుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి అనేక ప్రముఖ వైద్య శాలలకు తీసుకు వెళ్ళినా నయం కాకపోగా ఐ.సీ,యూ లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ముఖ్య మంత్రి స్పందించిన మేరకు 1 లక్ష రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. సమీన్ పర్వానా కుంభగిరి పేరెడ్డి కుంభగిరి పేరెడ్డి డిసెంబరు 30వ తేదిన ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడిపోయానని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. ఎంత వైద్య చికిత్స చేయించుకున్నా తలకు, పొట్టకు తీవ్ర గాయం అయ్యి కోలుకోలేక పోతున్నానని ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన సీఎం జగన్ మెరుగైన వైద్యసేవలను అందిస్తామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ బాధితునికి 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
పల్నాడు జిల్లాకు సీఎం జగన్
-
రేపు పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్
-
‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం కోసం.. పల్నాడుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఫ్యామిలీ డాక్టర్ అనే మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు (ఏప్రిల్ 6వ తేదీ) సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారాయన. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైద్య, ఆరోగ్య సేవలు నలుమూలలా విస్తరించే ఉద్దేశం, అలాగే స్పెషలిస్టు డాక్టర్ల సేవలను నేరుగా అందించే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది సీఎం జగన్ ప్రభుత్వం. ఇప్పటికే దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహించగా.. అంతటా సూపర్ సక్సెస్ అయ్యింది కూడా. ఈ తరుణంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని అమలు చేయబోతోంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో.. గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్‌ని పరిశీలించిన అనంతరం.. అక్కడే ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు. కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
వ్యాపారంతో నష్టం.. బాగు చేసిన సాగు
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ఆకుల గణపవరానికి చెందిన ఓబుల్‌రెడ్డి ఓ సాధారణ వ్యాపారి. ద్విచక్ర వాహనంపై ఊరూరా తిరుగుతూ ఎలక్ట్రిక్ వస్తువులను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వ్యాపారం కలిసిరాక అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం వ్యవసాయం వైపు మళ్లాడు. ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. బహుళ పంటలు పండిస్తే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందని నిరూపిస్తున్నాడు. తొలి మూడేళ్లు పత్తితో పాటు బీర, సొర, దోస, కాకర వంటి కూరగాయలతోపాటు ఆకు కూరలు, బంతి పంటను సాగు చేశాడు. రూ.35 వేల పెట్టుబడితో సాగు చేసి రూ.1.80 లక్షల చొప్పున ఆర్జించాడు. విరగ పండిన మిరప ఓబుల్‌రెడ్డి ఈ ఏడాది మిరప పంట వేశాడు. నల్ల తామర పురుగు బారిన పడకుండా పంటను కాపాడుకునేందుకు వేప గింజల కషాయం, దోమ నివారణకు తూటికాడ కషాయం పిచికారీ చేశాడు. మొక్క ఎదుగుదలకు కోడిగుడ్డు, నిమ్మరస ద్రావణం, చేప, బెల్లం ద్రావణం, తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడంతో పంట ఏపుగా ఎదిగింది. కషాయాలు, కలుపుతీత, పీఎండీ విత్తనాలకు రూ.35 వేలు, కోతలకు రూ.1.20 లక్షలు, కౌలుకు రూ.12 వేల చొప్పున మొత్తం రూ.1.67 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తొలి కోతలోనే 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అత్తలూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం మార్కెట్ ధర కంటే క్వింటాల్‌కు రూ.3 వేల అదనంగా చెల్లించి.. రూ.23 వేల చొప్పున కొనుగోలు చేస్తోంది. మిగిలిన రెండు కోతల్లో మరో 15నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఒక్క మిరపకే రూ.7 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం కన్పిస్తోంది. పెట్టుబడి పోను రూ.5.30 లక్షల వరకు మిగులుతుండటంతో ఓబుల్‌రెడ్డి ఆనందానికి అవధులు లేవు. అప్పులన్నీ తీర్చేశా వ్యాపారం కలిసిరాక అప్పుల పాలయ్యా. భూమిని నమ్ముకుని అప్పులన్నీ తీర్చేశా. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తోంది. రసాయన రహితంగా పండించిన మిరపను కొనేందుకు పోటీ పడుతున్నారు. మంచిరేటు వస్తోంది. పెట్టుబడికి 4 రెట్లు ఆదాయం ఆర్జించగలుగుతున్నా. – ఓబుల్‌రెడ్డి, గణపవరం, పల్నాడు జిల్లా -
పల్నాడులో మూడు వేల ఏళ్లనాటి నాగరికత గుర్తింపు.. ప్రత్యేకత ఇదే?
పల్నాడు.. పౌరుషగడ్డ. పల్నాడు అంటే.. రాజ్యాల మధ్య కాలుదువ్విన కోడిపుంజులు కనిపిస్తాయి. వెయ్యేళ్ల కిందట అధికారం, ఆధిపత్యం కోసం సాగిన యుద్ధభేరీ వినిపిస్తుంది. వీరులకు గుడికట్టిన సంప్రదాయం కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు చరిత్ర. కానీ.. కృష్ణానది ఒడ్డున పల్నాట క్రీస్తుపూర్వం 3 వేల ఏళ్లనాడే గొప్ప మానవ నాగరికత విలసిల్లింది. కిలోమీటర్ల మేర బృహత్ శిలాయుగపు (మెగాలిథిక్) సమాధుల రూపంలో నిక్షిప్తమైంది. మాచర్ల, వెల్దుర్ది మండలాల్లో పురావస్తు అధికారులు, పరిశోధకుల వెలికితీతతో ఆదిమ మానవ జీవనం ప్రపంచానికి పరిచయం అవుతోంది. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండా అటవీ ప్రాంతంలో కృష్ణాతీరం వెంబడి ఆదిమ మానవ సంస్కృతి విస్తరించింది. ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర 300 నుంచి 400 వరకు సమాధులు బయటపడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున వరుసక్రమంలో ప్రాచీన కాలపు సమాధులు దేశంలో ఎక్కడా లేవు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో గృహ సమాధి (డాల్మెన్), గూడు సమా«ధులు (సిస్ట్ బరియల్) ఉన్నాయి. ఈ సమాధుల నిర్మాణంలో వాస్తుశా్రస్తాన్ని పాటించడం విశేషం. అన్నింటిని దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిరి్మంచారు. ప్రతి సమాధి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కృష్ణానది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో అప్పటి ప్రజలు కృష్ణానది ఎగువభాగంలో నివసించినట్టు తెలుస్తోంది. వ్యవసాయంతోపాటు పశువులపై ఆధారపడి జీవనం సాగించారని, ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కందులు పండించారని లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పూసలు, ప్రత్యేకమైన ఎరుపు, నలుపు రంగు మట్టిపాత్రల అవశేషాలను బట్టి అప్పటి ప్రజలు అలంకార ప్రియులుగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటగా బృహత్ శిలాయుగంలో ఇనుమును వినియోగించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో ముడి ఇనుము అధికంగా లభ్యమవడంతో ప్రజలు ఇక్కడ నివసించేవారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, గోదావరి, పెన్నానది తీరాల్లో వీటి ఆనవాళ్లు తరచు బయటపడుతున్నాయి. ప్రత్యేక నిర్మాణ శైలిలో సమాధులు ప్రాచీన శిలాయుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికే వదిలేశాడు. నవీన శిలాయుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమపద్ధతిలో పాతిపెట్టడం నేర్చుకున్నాడు. బృహత్ శిలాయుగంలో మానవ మృతదేహాన్ని జంతువులు పీక్కుతినకుండా, ఖనన సామగ్రిని పాడుచేయకుండా పెద్దపెద్ద శిలలతో సమాధులు నిరి్మంచారు. వీటిలో మృతుడు ఉపయోగించిన యుద్ధ, వ్యవసాయ సామగ్రి, మట్టిపాత్రలు, పెంపుడు జంతువులను కూడా సమాధి చేసేవారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చేవారు. ఇవే రాక్షసగూళ్లు. వీటి ఆనవాళ్లు ప్రపంచం అంతటా ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోను బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. చదునైన బండరాళ్లతో నలువైపులా స్వస్తిక్ ఆకారంలో పేర్చి గది మాదిరి తయారు చేశారు. ఇందులో భూమి లోపల కొంత, భూ ఉపరితలంపై కొంతభాగం కనబడే విధంగా నిర్మించారు. ఈ సమాధులు పెద్ద బండరాళ్లతో ఉండటం, అక్కడ లభించిన మట్టిపాత్రలు, అస్థి పంజరాలను బట్టి ఇవి సామాన్య మానవులకు ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో.. వీటిని రాక్షసుల స్థావరంగా నమ్మి రాక్షసగూళ్లుగా పిలిచేవారు. ఇలాంటి రాక్షసగూళ్లు అచ్చమ్మకుంటలో భారీగా ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవైతే.. మరికొన్ని ముందే నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో కొన్ని సామూహిక సమాధులున్నాయి. వీటిలో రెండురకాలున్నాయి. మృతదేహాన్ని ఖననం చేసినవి ప్ర«థమశ్రేణి సమాధులుగా, మృతదేహాన్ని దహనం చేయగా మిగిలిన అవశేషాలను పూడ్చిపెట్టినవి ద్వితీయశ్రేణి సమాధులుగా వర్గీకరించారు. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా.. వెల్దుర్తి మండలం గంగలకుంటలోని కృష్ణానది కుడిగట్టుపైన.. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా దాదాపు మూడుచదరపు కిలోమీటర్లమేర వెయ్యికిపైగా ఇనుపయుగపు స్మారక కట్టడాలున్నాయి. ఇక్కడ 5–10 మీటర్ల వ్యాసార్థంతో, 1–2 మీటర్ల ఎత్తులో స్థానిక నాపరాళ్లను గుండ్రంగా పేర్చి, గులకరాళ్లతో ఉబ్బెత్తుగా అమర్చిన సమాధులు కనిపిస్తాయి. ఈ సమాధులకు ఉత్తరాన 10–25 అడుగుల ఎత్తు, 3–5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో చనిపోయినవారికి గుర్తుగా రాళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. వాటిపై ఇనుపయుగపు అంత్యక్రియ పద్ధతులను తెలిపే ఎద్దు, చదరం, గండ్రం, ముగ్గును పోలిన రేఖాచిత్రాలున్నాయి. ‘గంగలకుంటలో గతంలో వందలాది నిలువురాళ్లు, రాకాసిగుళ్లు ఉండేవి. ఇప్పుడు పదో, పదిహేనో మిగిలాయని స్థానికులు ద్వారా తెలుసుకున్నాం. రైతులు నీళ్లగొట్టాలు వేసినప్పుడు, మైనింగ్ కారణంగా దాదాపు 500 సమాధులు, 700 నిలువురాళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ లభ్యమైన 25 అడుగుల నిలువురాయి (మెన్హిర్) రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇంతటి మానవచరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇంతటి గొప్ప నాగరికత విలసిల్లిందంటే సంతోషంగా ఉంది. నా పరిశోధనలో బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్నప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాను. సమాధులు 10–15 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు అంచనా వేస్తున్నాం. స్థానికులు వీటిని బండరాళ్లుగా భావించి కొన్ని చెదరగొట్టారు. మిగిలిన సమాధులు చెక్కు చెదరలేదు. ఈ సమాధులకు పక్కనే ఎండిపోయిన నదీపాయ ఉండటంతో అప్పటి ప్రజలు దిగువన సువిశాల ప్రాతంలో వ్యవసాయం చేసుకుని జీవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాంతం సాగులో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిగితే ఆ నాటి ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవనం, వర్తకవాణిజ్య వివరాలు వెలుగులోకొస్తాయి. – ఎం.స్వామినాయక్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలల అసిస్టెంట్ డైరెక్టర్ -
దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య