
కేక్ కట్ చేస్తున్న విజయశాంతి
మెదక్‌జోన్ : మాజీ ఎంపీ విజయశాంతి జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ నియోజకవర్గంలోని పలుగ్రామాలకు చెందిన కాంగ్రెస్, స్వచ్చంధ సంస్థ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన ద్వారకా చారిటబుల్ సొసైటీ చైర్మన్ మేడం బాలకృష్ట మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంకోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత విజయశాంతికే దక్కుతుందని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం విజయశాంతి పెట్టిన పార్టీని సైతం మరో పార్టీలో విలీనం చేసిన తెలంగాణ దేవత రాములక్కని కొనియాడారు.ఎంపీ ఫండ్స్ నుంచి ఊరూర బోరుబావులు, హైమాస్ట్ వీధి లైట్లు ఏర్పాటుచేసి మారుమూల పల్లెలకు తాగునీటితో పాటు వెలుతురులో ఉంచారని పేర్కొన్నారు.
విజయశాంతిని కలిసిన వారిలో బొగుడభూపతిపూర్ ఎంపీటీసీ సభ్యురాలు రమ్య శ్రీనివాస్, సర్పంచ్ మంజుల యాదగిరి, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, నాయకులు నారాయణరెడ్డి, రాఘవవరెడ్డి, సంతోష్‌రెడ్డి, బాల్‌రాజు, సర్దన మాజీ సర్పంచ్ సుభాష్, పెంటయ్య, అరవింద్, వెంకట్, కిషన్‌రావు, భాను, శ్రీనివాస్, నాగరాజు, చిన్నశంకరంపేట నుండి ప్రవీణ్, మధు, కుమార్, మెదక్ పట్టణానికి చెందిన శ్రీనివాస్, సల్మాన్, మహేశ్, చౌదరి, ఖాళీల్, అనీల్, చిదంబరం ఉన్నారు.