
సాక్షి, హైదరాబాద్: పొత్తులతో టీడీపీ బాధ్యత తీరిపోలేదని, సీట్లు సాధించి ఉనికి చాటుకోవడానికి కాకుండా, టీఆర్‌ఎస్ ఓటమికోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ క్యాంపెయినర్ విజయ శాంతి అన్నారు. శేరిలింగంపల్లి సీటుపై గాంధీభవన్‌లో జరిగిన పరిణామాలు ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. టీఆర్‌ఎస్ ఓటమి కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు. సీట్ల సర్దుబాటు అనేది కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యంగా ఉండాలని, టీఆర్‌ఎస్ పార్టీకి కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.