
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ కొత్త నియామకం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూకుడు పెంచింది. పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలు నియమించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యింది. దాదాపు సీనియర్లందరికీ కీలక బాధ్యతలు అప్పజెప్పిన రాహుల్ గాంధీ.. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని కూడా రంగంలోకి దింపారు. స్టార్ క్యాంపెయినర్, తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు వంటి కీలక పదవులు కట్టబెట్టి ‘రాములమ్మ’కు ప్రాధాన్యం ఇచ్చారు. (చదవండి: రేవంత్ రెడ్డికి పదవి.. సీనియర్ల అసంతృప్తి!)
పబ్లిసిటి కమిటీ
ఈ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా కో- చైర్‌పర్సన్‌గా సౌదాగర్ గంగారాం, సభ్యులుగా దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలం గౌడ్‌లను నియమించినట్లుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా పార్టీ వీడిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరును తొలగించి రివైజ్డ్ కో- ఆర్డినేషన్ కమిటీని కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment