
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ ఆమె నివాసంలో భేటీ అయ్యారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె సేవలను తిరిగి వాడుకోవాలనే ఉద్దేశంతోనే సమావేశమైనట్లు తెలి సింది. విజయశాంతి గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి పోటీ చేసే అంశంపై వారు ఆమెతో చర్చించినట్లు తెలిసింది. దీనిపై కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడి, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు.
మెదక్‌లో పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఈ సీటుతో పాటు పూర్వ మెదక్ జిల్లాలో 8 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైతం ఆమె మొగ్గు చూపినట్లు సమాచారం. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు జిల్లా అధ్యక్షులు గా ఇప్పటికే వచ్చిన పలువురు నేతల పేర్లపై విజయశాంతి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. భేటీ అనం తరం విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలసి రాష్ట్ర పర్యటనలో ఉన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు.