Secretaries
-
కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా గాదె మధుసూదన్‌రెడ్డి, ఇంటూరి రాజగోపాల్ నియమితులయ్యారు.కాగా, గురువారం.. రేపల్లె నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశామన్నారు. నేను వైఎస్సార్ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలం. అన్ని పనులు ప్రజలకు చేశామన్నారు.‘‘ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చాం. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్ చేశాం. ప్రతినెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చాం. ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది : వైఎస్ జగన్ -
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
సచివాలయ కార్యదర్శులకు గోరుముద్ద, టీఎంఎఫ్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జగనన్న గోరుముద్ద, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా.. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ మహమ్మద్ దివాన్ మైదాన్ ఆయా కార్యదర్శులు నిర్వర్తించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసీజర్ (ఎస్ఓపీ)లను విడుదల చేశారు. మహిళా పోలీసుల పాత్ర ఎమర్జెన్సీ నెంబర్లయిన 112, 100లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పాఠశాల పిల్లలకు పోలీసుల సహకారం అందుబాటులో ఉండేలా ఉపయోగకరమైన మెటీరియల్‌ని అందించాలి. పాఠశాలలను నెలనెలా సందర్శిస్తూ, అవగాహన శిబిరాలు నిర్వహించాలి. విద్యా, సంక్షేమ కార్యదర్శి పాత్ర వారానికి మూడుసార్లు పాఠశాలలను సందర్శించి గోరుముద్ద నాణ్యతను పరిశీలించాలి. ఐఎంఎంఎస్ యాప్‌లో ఫీడ్‌బ్యాక్ రాసి ఫొటోలను అప్లోడ్ చేయాలి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించాలి. పాత్రల పరిశుభ్రతను గమనించి హెచ్ఎంలకు సహకరించాలి. అలాగే, తల్లిదండ్రుల కమిటీతో చర్చించాలి. టాయిలెట్లు, వాష్బేసిన్లు, యూరినల్స్ ఇతర అనుబంధ వస్తువుల శుభ్రతను గమనించాలి. యాప్‌లో ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాత్ర పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఇంజినీరింగ్ అసిస్టెంట్ నెలకొకసారి పాఠశాలను సందర్శించాలి. ఫీడ్‌బ్యాక్‌ను డేటాబేస్‌లో అప్లోడ్ చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన పరికరాలు, క్లీనింగ్ మెటీరియల్‌ను పరిశీలించాలి. మరమ్మతులు చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ భౌతికంగా అందుబాటులో ఉండాలి. ఏఎన్ఎమ్ పాత్ర ఆశా, జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బందితో పాటు ఏఎన్ఎంలు నెలవారీగా పాఠశాలలను సందర్శించాలి. పిల్లల ఎత్తు, బరువు వయస్సుకు తగిన పెరుగుదలను తనిఖీ చేయాలి. పిల్లల రక్తహీనత లక్షణాలు గుర్తించాలి. బలహీనంగా ఉన్న వారి పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందికి సూచనలు చేయాలి. మురుగునీరు నిలవ ఉండకుండా చూడాలి. మంచినీరు, పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలి. -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
పోలీస్ సేవల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్ తరహా సేవలకు వినియోగిస్తున్నారు. వీరి ద్వారా కూడా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా వీరు పోలీసులకు సమాచారం ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ఏం చేస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 మహిళా సంరక్షణ కార్యదర్శులున్నారు. వీరి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వీరు వారధుల్లా పనిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి పోలీస్ తరహా సేవలందించేలా వీరిని తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్(ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) పద్ధతి అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయాల్లో వీరి ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామాలు, వార్డుల్లో జరిగే అనేక విషయాలను వీరు పోలీస్‌స్టేషన్‌కు నివేదిస్తారు. అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా ఎప్పటికప్పుడు వీరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిస్తారు. అంతేకాదు, మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, మానవ అక్రమ రవాణా నిరోధం, మహిళల భద్రత, రహదారి భద్రత, సైబర్ భద్రత, బాల్య వివాహాలను అరికట్టేందుకు, రైతు ఆత్మహత్యల నిరోధంలో వీరు తమ వంతు పాత్ర పోషిస్తారు. వీటితో పాటు ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వాముల్ని చేస్తున్నారు. వీరి ద్వారా పోలీస్ సేవలు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పోలీస్ సేవలను అందించేలా మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే వారికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) ద్వారా శిక్షణ ఇచ్చాం. శాంతిభద్రతల నిర్వహణలో పలు అంశాలపై ప్రాథమికంగా వీరికి అవగాహన కల్పించాం. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని డిజిటల్ (ఆన్లైన్) సేవలను గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్‌తో మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటున్నాం. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చదవండి: లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు సిగ్గుంటే రాజీనామా చెయ్.. -
విజయశాంతితో ఏఐసీసీ కార్యదర్శుల భేటీ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ ఆమె నివాసంలో భేటీ అయ్యారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె సేవలను తిరిగి వాడుకోవాలనే ఉద్దేశంతోనే సమావేశమైనట్లు తెలి సింది. విజయశాంతి గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి పోటీ చేసే అంశంపై వారు ఆమెతో చర్చించినట్లు తెలిసింది. దీనిపై కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడి, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు. మెదక్‌లో పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఈ సీటుతో పాటు పూర్వ మెదక్ జిల్లాలో 8 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైతం ఆమె మొగ్గు చూపినట్లు సమాచారం. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు జిల్లా అధ్యక్షులు గా ఇప్పటికే వచ్చిన పలువురు నేతల పేర్లపై విజయశాంతి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. భేటీ అనం తరం విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలసి రాష్ట్ర పర్యటనలో ఉన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. -
కార్యదర్శుల చేతికి ఇసుక రీచ్‌లు
* జిల్లాలో 13 మండలాల్లోని 32 రీచ్‌లు అప్పగింత * ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడినుంచే ఇసుక సరఫరా విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ఇసుక కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులకే రీచ్‌లపై అజమాయిషీ ఇచ్చి అవసరమైన ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 13 మండలాల్లోని 32 రీచ్‌లను వారికి అప్పగిస్తూ భూగర్భ జల శాఖ అధికారుల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. ఈ రీచ్‌ల ద్వారా కేవలం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టే పనులకు మా త్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. అంతేగాకుండా ఆ గ్రామ పంచాయతీలో ఇళ్లు నిర్మించుకుంటే దానిని నిజ నిర్ధారణ చేసుకుని సరఫరా చేయాలి. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా జాయింట్ కలెక్టర్‌కు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమో దరఖాస్తు చేసుకోవాలి. జేసీ ఆమోదించాక భూగర్భ గనుల శాఖ అధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా కార్యదర్శులకు ఆదేశాలు జారీ అవుతాయి. క్యూబిట్ మీటర్‌కు రూ. 66లు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇసుక రీచ్‌ల్లో ఇసుక ధర క్యూబిక్ మీటర్‌కు రూ. 66 గా నిర్ధారించినట్లు భూగర్బగనుల శాఖ ఏడీ మాధవరావు సాక్షికి తెలిపారు. జేసి అనుమతి ఇచ్చాక ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలో తెలుసుకుని తద్వారా వచ్చే మొత్తాన్ని కార్యదర్శి చలానా ద్వారా ప్రభుత్వానికి జమ చేస్తారు. దీని రవాణాకు కార్యదర్శే వే బిల్లు అందిస్తారు. కార్యదర్శులకు కేటాయించిన ఇసుక రీచ్‌లివే... బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, పారాది బిట్-3, పారాది బిట్-2, గుర్ల మండలంలోని గరికివలస, భూపాలపురం, కలవచర్ల, చింతలపేట, నడుపూరు గజపతినగరం మండలంలోని ఎం.ముగడాం-1, ఎం.ముగడాం-2, ఎం.ముగడాం-3 బలిజిపేట మండలంలోని పెద్దింపేట, అరసాడ, కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కల్లికోట, దుగ్గి-2, దుగ్గి డెంకాడ మండలంలోని సింగవరం-2, సింగవరం-1 దత్తిరాజేరు మండలంలోని పెదకాద రామభద్రపురం మండలంలోని రొంపిల్లి, కొట్టక్కి, గొల్లపేట సీతానగరంలోని పనుకుపేట, పెదంకలాం, పెదభోగిలి మెంటాడ మండలంలోని మెంటాడ పాచిపెంట మండలంలోని కర్రివలస జియ్యమ్మవలస మండలంలోని బిట్రపాడు ఎస్‌కోట మండలంలోని చామలపల్లి -
మీకొకటి.. మాకొకటి!
కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాకు గత జూన్ నెలలో 11,080 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఆ నెలలో శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండటంతో బడ్జెట్ వచ్చినా పలు మండలాల్లో పంపిణీ నిలి చిపోయింది. జూలై నెలలో కొత్త పింఛన్లకు రెండు నెలల మొత్తం పంపిణీ చేయాల్సి ఉంది. పంచాయతీ సెక్రటరీల ద్వారా మాన్యువల్‌గా పంపిణీ చేయిస్తుండటంతో ఈ విడత కొందరికి కలిసొచ్చింది. జూలై నెల పింఛను మాత్రమే పంపిణీ చేసిన కార్యదర్శులు.. జూన్ నెలలో ఎన్నికల కోడ్ వల్ల ఆ మొత్తం రాలేదని బుకాయించారు. కొన్ని మండలాల్లో రెండు నెలల మొత్తం పంపిణీ చేసినా.. మరికొందరు ఒక నెల పింఛను నొక్కేశారు. చాలా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు కొత్త పింఛను బడ్జెట్ సర్పంచ్‌లకు అప్పగించినా పంపిణీ ఇష్టారాజ్యంగా సాగింది. మొత్తం రూ.2.21 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి దాదాపు రూ.కోటి స్వాహా చేశారు. ఒక నెల పింఛను అందుకోలేకపోయిన లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తొల గిస్తారోనని జంకుతున్నారు. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో కొత్త పింఛన్లకు ఒక నెల మొత్తమే అందజేశారు. ఇక్కడ ఓ గ్రామంలో 12 మందికి పింఛన్లు మంజూరు కాగా ఒక నెల మొత్తంతోనే సరిపెట్టారు. అందులోనూ రూ.200 చొప్పున కోతపెట్టారు. హొళగుంద మండలంలోనూ ఇదే పరిస్థితి. పింఛన్లను కొంతకాలం పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయడం.. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి పంచాయతీ కార్యాలయాలకు మార్చడం గందరగోళానికి తావిస్తోంది. ఇదే సమయంలో మాన్యువల్‌గా పంపిణీ చేస్తుండటం కార్యదర్శులకు కలిసొచ్చినట్లయింది. తాజాగా ట్యాబ్‌ల సహాయంతో పంపిణీ తెరపైకి రావడంతో ఇదెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. -
‘భూ’ భేటీకి కార్యదర్శుల డుమ్మా!
మండిపడ్డ సంయుక్త పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై నిర్వహించిన సమావేశానికి ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ మండిపడింది. ఇది కమిటీని అవమానించడమేనని దుయ్యబట్టింది. గురువారం కమిటీ నిర్వహించిన భేటీకి న్యాయ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వాణిజ్య శాఖకు చెందిన కార్యదర్శులతోపాటు రైల్వే ఉన్నతాధికారులు రావాల్సి ఉంది. ఈ మేరకు వారికి ఈనెల 6నే సమాచారం ఇచ్చారు. అయితే భేటీకి వారెవరూ హాజరుకాలేదు. వీరిలో ఒక కార్యదర్శి విదేశాల్లో ఉండగా మరికొందరు వేరే సమావే శాలు ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. దీనిపై కమిటీ సభ్యుడు, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సమావేశంలో మండిపడినట్టు తెలిసింది. ‘ఈ ప్రభుత్వం పార్లమెంట్‌కే కాదు.. పార్లమెంటరీ కమిటీకి కూడా ముఖం చూపించలేకపోతోందేమో!’ అని కమిటీలో విపక్ష పార్టీకి చెందిన సభ్యుడొకరు దుయ్యబట్టారు. ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై కమిటీలోని అధికార బీజేపీ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘భూ’బిల్లుపై వివరణివ్వండి: సుప్రీం భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ముగియడంతో దాన్ని మరోసారి తీసుకురావడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిల్‌పై సుప్రీం కోర్టు గురువారం కేంద్రాన్ని వివరణ కోరింది. -
సర్పంచ్‌లు + కార్యదర్శులు
రికార్డుల నిర్వహణపై కోల్డ్‌వార్ తామే రికార్డులు రాస్తామంటున్న పంచాయతీ కార్యదర్శులు వేరే వ్యక్తితో రికార్డుల రాయియిస్తున్న సర్పంచ్‌లు పంచాయతీ అభివృద్ధిలో సర్పంచులు.. కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకం. చిన్నచిన్న లోపాలున్నా.. వారు ఐక్యంగా ఉంటేనే పాలన కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇందులో నిధుల వ్యయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ బాధ్యత కార్యదర్శులదే కాగా.. ఆ పనేదో మేమే చేయించుకుంటామంటూ సర్పంచులు భీష్మిస్తున్నారు. దీనివెనుక మతలబేమిటో మీరే ఆలోచించండి!! సంతకవిటి : మండలంలోని పలు పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సర్పంచ్‌లకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మండలంలో 34 పంచాయతీలుండగా 14 మంది కార్యదర్శులే ఉన్నారు. గతంలో అయితే మొత్తం 34 పంచాయతీలకూ కేవలం ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉండేవారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులును వేరే వ్యక్తులు ద్వారా పంచాయతీ సర్పంచ్‌లు రాయించేవారు. తీర్మానాలు చేసేటప్పుడు, నిధులు వినియోగించే సమయంలో కార్యదర్శులకు రికార్డుల వ్యవహారం తెలిసేదికాదు. సర్పంచ్‌లు వారికి నచ్చిన రీతిలో తీర్మానాల రికార్డులు, నిధుల వినియోగం రికార్డులు నిర్వహించేవారు. దీంతో కార్యదర్శులు నామమత్రంగానే ఉండేవారు. తెర పైకి సమచార హక్కు చట్టం గతేడాది నుంచి మండలంలో పంచాయతీ కార్యదర్శుల సంఖ్య పెరిగింది. కొత్తగా రిక్రూట్ మెంట్‌ద్వారా వచ్చిన వారు యువకులు కావడంతో పాటు రికార్డులు రాసేందుకు ఆసక్తి ఉన్నవారు కావడంతో పంచాయతీల తీర్మానాలు రికార్డులు తామే రాస్తామని పట్టుబడుతున్నారు. పైగా ఇది వారి బాధ్యత కూడా. మరోవైపు నిధులు వినియోగానికి సంబంధించిన రికార్డుల వివరాలను ప్రజలు సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతున్నారు. ఈ వివరాలిచ్చే సమయంలో రికార్డుల్లోని అవకతవకలకు కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ భయంతోనే కార్యదర్శులు రికార్డులను తామే రాసుకుంటామని, ప్రైవేటు వ్యక్తులతో రాయించవద్దని పట్టుబడుతున్నారు. అయితే కార్యదర్శులే రికార్డులు రాస్తే తమ ఆటలు సాగవని పలు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ రికార్డులును వారికి అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. ఐతే తమచేతికి రికార్డులు రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కార్యదర్శులు చెబుతున్నారు. -
క్లస్టర్ పరిధిలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెలాఖరులోగా పూర్తికావాల్సిన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను వెల్లడించింది. మూడు సంవత్సరాల పైబడి ఒకే చోట విధులునిర్వహిస్తున్న వారికి తప్పనిసరిగాబదిలీ చేయాల్సి ఉండగా.. వారిని క్లస్టర్ పరిధిలోనే ఉంచాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా 3 సంవత్సరాలలోపు ఒకే చోట పని చేస్తున్న వారికి రిక్వెస్ట్ బదిలీకి అవకాశం కల్పించింది. ఇందులో ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారికి, స్పౌజ్, కుటుంబసభ్యులు మందబుద్ధి గల వారికి, పీహెచ్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఈ ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. నిబంధనల మేరకు జిల్లాలోని 490 క్లస్టర్ల పరిధిలో గల 921 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న 505 పంచాయతీ కార్యదర్శులకు బదిలీలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ సారి స్థాన చలనం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మూడేళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి బదిలీ తప్పని సరి కావడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్, నలుగురు జూనియర్ అసిస్టెంట్లతో పాటు మిగిలిన సిబ్బంది బదిలీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ-సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
‘కార్యదర్శుల’ కేసులో నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు జీవోను నిలుపుదల చేయాలా? వద్దా? అన్న విషయంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నది. పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, జలగం వెంకటరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను గురువారం మరోసారి విచారించింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని, నియామకాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శులు మంత్రులు కాదని, వారికి మంత్రి హోదా మాత్రమే ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేసింది. -
లెక్కలేని తనం!
విజయనగరం మున్సిపాలిటీ :ప్రజా ధనమంటే పంచాయతీ పాలకులకు లెక్కలేకుండా పోయింది. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తూ, వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంత మొత్తంలో నిధులు ఏయే అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారో...? ఎంత మొత్తంలో పక్కదారి పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. పలు పంచాయతీల్లో గ్రామ సభలో తీర్మానం చేయకుండా, ఎటువంటి వివరాలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్టు రెండేళ్లలో భారీగా నిధుల కేటాయింపు సుమారు మూడేళ్ల పాటు నిధులు లేమితో నీరసించిన పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ గ్రాంట్ల కింద కోట్లాది రూపాయలు మంజూరుచేశాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సం ఘం, వృత్తిపన్నుల ఆదాయం, తలసరి గ్రాంట్ ల కింద రూ 16కోట్ల 95లక్షల 88వేల 118 విడుదల కాగా, తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు కింద మరో రూ13కోట్ల 6 లక్షల ఒక వేయి 700, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద జూన్ 26న మరో రూ10.10కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలోని 77 గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధు ల కింద రూ 46.20 లక్షల విడుదలయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ60 వేలు చొప్పున వీటిని కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు కేటాయింపు జరుగుతున్నా పల్లెల్లో అభివృద్ధి కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధుల వినియోగంపై జరగని ఆన్లైన్ పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద విడుదలవుతున్న నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి సదరు పంచాయతీ సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుంది. అయితే పంచాయతీలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో ముందుగా గ్రామ సభలు నిర్వహించి తీర్మానించాలి. అనంతరం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖర్చు వివరాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలి. తరువాత చెక్‌పై సం తకం చేసి, సదరు చెక్‌ను ట్రెజరీ ద్వారా డబ్బు రూపంలో మార్చుకోవాలి. ఏ పనికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు, వాటి వివరాలను, ఆ మొత్తాన్ని ఆన్లైన్లో నమోదు చే యాలి. అయితే జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఈ పద్ధతిని అనుకరిస్తున్నట్టు కనిపించ డం లేదు. పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శు లు కుమ్మక్కై ఇష్టానుసారం నిధులు డ్రా చేయడంతో పాటు నెలల తరబడి అందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయని పరిస్థితి ఉంది. దీంతో ఏ నిధులు ఎందుకు వినియోగించారో... అసలు వినియోగించారో..? లేదో ? తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, చినగుడబ, ఉద్దవోలు పం చాయతీల్లో 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, సాధారణ నిధుల కింద కేటాయించిన రూ 5.03 లక్షలు దుర్వినియోగమైయినట్లు గుర్తించి న కలెక్టర్ సంబంధిత కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా డెంకాడ మండలం మోదవలస పంచాయతీలో రూ20.47లక్షల వ్యయంతో కూడిన పనులను గ్రామ సభ తీర్మానం, ఎటువంటి ప్రతిపాదనలు లేకండా చేపట్టారన్న ఆరోపణలపై సదరు పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ఈనెల 7న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెరకముడిదాం మండ లం బుధరాయవలస సర్పంచ్ బాలి బంగారునాయుడు చెక్ పవర్ రద్దు చేశారు. ఇలా చాలా పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానరాని ఈఓపీఆర్డీల పర్యవేక్షణ : పంచాయతీలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఈఓపీఆర్డీలు పర్యవేక్షణ చేయాలి. ఇందుకుగానే నెలలో 23 రోజుల పాటు పర్యటించే పంచాయతీల జాబితాను ముందు నెలలోనే తయారుచేసుకోవాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితిలేదు. మండలానికి ఒకరు చొప్పున ఉండే అధికారులు కేవలం ఎంపీడీఓ కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శులే అంతా తామై వ్యవహరించడంతో సర్పంచ్‌లతో చేయికలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి బి.మోహనరావు వద్ద ప్రస్తావించగా.. పంచాయతీల్లో వినియోగిస్తున్న నిధులకు సంబంధించి ఆన్లైన్ నమోదు జరగని మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీలతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సక్రమంగా స్పందించడం లేదన్నారు. నిబంధనల మేరకు నిధులు వినియోగించని పక్షంలో వారిపై చర్యలు తప్పవని ఈ విషయంలో కార్యదర్శులే బాధ్యత వహిస్తారని వివరించారు. -
రాజకీయ వేధింపులు ఆపాలి
విజయనగరం కంటోన్మెంట్ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. జయలక్ష్మి, బి. సుధారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తే, ఇప్పుడు ఆ పార్టీ నాయకులే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నెండేళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో 5 వేల మంది నిర్వాహకులు పని చేస్తున్నారన్నారు. వీరికి గౌరవ వేతనం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లిమర్ల రెల్లివీధి స్కూల్, గాజుల రేగ రాళ్లమాలపల్లి స్కూల్, గుర్ల మండలం తెట్టంగి, చీపురుపల్లి మండలం చిననడిపల్లి, పెదనడిపల్లి పాఠశాలల్లో నిర్వాహకులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి మంగళవారం చర్చలు జరుపుతామని చెప్పడంతో నిర్వాహకులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరి, జి తులసి, చల్లా జగన్, డి. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్
ఈ నెలాఖరుతో ముగియనున్న కాలపరిమితి కొత్తగా టెండర్లు పిలుస్తారో.. పాత వారినే తీసుకుంటారో? చిత్తూరు (టౌన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి ఈనెలాఖరుతో ముగియనుంది. దీంతో ఇటు అధికారులకు అటు ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రతి శాఖలోనూ పదుల సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పట్లో తేల్చే పరి స్థితి కనిపించక పోవడంతో కొన్ని శాఖల అధికారులు డీలాపడిపోతున్నారు. 2013-14కు గాను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న సిబ్బంది కాలపరిమితి గత మార్చి 31వ తేదీతో పూర్తయింది. అయితే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున గవర్నర్ అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వారి కాలపరిమితిని మూడు నెలలు పొడిగించారు. ఆ పొడిగింపు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. అయితే పొడిగింపు ఆదేశాలిచ్చిన అధికారులు వారి జీతాల బడ్జెట్ సంగతిని ఇప్పటికీ తేల్చలేదు. కాలపరిమితి పూర్తయ్యే లోగా ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలను క్లియర్ చేయాల్సి ఉంది. పాతవారినే కొనసాగిస్తే ఫర్వాలేదు కానీ టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్తవారిని తీసుకుంటే ఇప్పుడున్న వారి జీతాలను ఎలా క్లియర్ చేయాలనేడైలమాలో అధికారులు ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కీలకం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, డేటాఎంట్రీ ఆపరేటర్లుగా చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని జూలై నుంచి టెండర్ల ద్వారా కొత్తవారిని తీసుకుంటే అప్పుడేం చేయాలనేది ఈ శాఖల అధికారులకు పాలుపోవడం లేదు. కొత్తగా వచ్చేవారు పని నేర్చుకునే వరకు జరగాల్సిన రోజువారి విధులను ఎలా నిర్వర్తించాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లాంటి కీలక శాఖల్లో విద్యార్థులు, వారికి వర్తించే పథకాలు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్ తదితరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, డౌన్లోడ్ చేసుకోవడం తదితరాలను నిత్యం చేపడుతూ రావాలి. ఈ విషయాల్లో నిత్యం జిల్లా ప్రగతిని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలి. అయితే ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తుండడంతో వారు లేకుం టే ఏం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని పలుశాఖల్లో నాలుగు వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా వీరందరి కాలపరిమితి పూర్తికానుంది. దాంతో ఆయా శాఖల అధికారులతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. -
కార్యదర్శులతో మోడీ భేటీ
ప్రధాన మంత్రే నేరుగా ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇదే ప్రథమం న్యూఢిల్లీ: పరిపాలనలో సమూల మార్పులు తెస్తానంటున్న ప్రధాని నరేంద్ర మోడీ అందులో భాగం గా.. బుధవారం అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశమయ్యారు. సంబంధిత శాఖల మంత్రులు లేకుండా, ప్రధాని నేరుగా కార్యదర్శులతో భేటీ కావడం ఇదే ప్రథమం. పాలనలో తన ప్రాధామ్యాలను, అజెండాను, అధికారగణం నుంచి తాను ఆశిస్తున్న అంశాలను దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో మోడీ వారికి వివరించారు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో అవసరమైతే తనను ఫోన్లో కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ సంప్రదించాలని మోడీ వారికి సూచించారు. పాలనపై దుషభ్రావం చూపే కా లం చెల్లిన విధివిధానాలను పాటించాల్సిన అవసరం లేదని, నిబంధనలను సరళీకరించాలని సూచిం చారు. పాలనాసంస్కరణల్లో తన సహకారం ఉంటుందన్నారు. మోడీతో బుధవారం ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వ్యవసాయ శాఖల కార్యదర్శులు వరుసగా అరవింద్ మాయారామ్, అనిల్ గోస్వామి, రాధాకృష్ట మాథుర్, సుజాతాసింగ్, ఆశిష్ బహుగుణ సహా 77 మంది ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. భేటీలో 25 మంది కార్యదర్శు లు తమ విభాగాల సమస్యలను ప్రధానికి వివరించారు. పాలనా సంస్కరణల్లో భాగం గా పలు మంత్రిత్వ శాఖలను విలీనం చేసి మొత్తంమీద 16 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సామాన్యుల ఆకాంక్షలు నెరవేరుస్తాం! ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చిన దేశ ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 16వ లోక్‌సభ కొలువుతీరడానికి ముందు బుధవారం పార్లమెంటు భవనం ముందు ఆయన కాసేపు మీడియా ముందుకు వచ్చారు. ‘ఈ రోజు 16వ లోక్‌సభకు మొదటి రోజు. దేశంలోని సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నా’ అన్నారు. -
ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా?
ఇంజనీర్లతో కార్యదర్శి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉండాలన్న అంశంపై అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. కృష్ణా నదిపై ఆధార పడిన ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలకు చెందుతుండడంతో వీటికి సంబంధించిన విధివిధాలను రూపొందించే ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఇంజనీర్లతో సాగునీటి పారుదల శాఖ కార్యదర్శులు సమావేశమై చర్చించారు. కృష్ణానదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో పలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో వరద నీటిపైనే ఇవి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. దాంతో ఇటు గోదావరి, అటు కృష్ణా ప్రాజెక్టులకు ప్రత్యేక బోర్డులు రానున్నాయి. అయితే ఈ బోర్డుల పరిధి ఏమిటి? నీటి విడుదల, ప్రాజెక్టుల నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతల వంటి విషయాలపై స్పష్టత లేదు. ఇదే విషయంపై సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి సమక్షంలో ఇంజనీర్లతో చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను రూపొందించాల్సిందిగా ఆయన సూచించారు. ఇదే అంశంపై ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమీక్షించనున్నారని, ఆలోగా పూర్తి స్పష్టతకు రావాలని కోరారు. చట్టం ప్రకారమే విభజన ప్రక్రియ సాగాలి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో తప్పులున్నా.. ఆ చట్టంలో కొన్ని అంశాల గురించి పేర్కొనకపోయినా ప్రస్తుతం చేసేది ఏమీ లేదని, ఆ చట్టం ఏమి చెబుతుందో అదే చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ చట్టం ప్రకారమే విభజన ప్రక్రియను కొనసాగించాలని, చట్టంలో లేని అంశాలేమైనా ఉంటే వాటిని రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగాలనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చట్టంలో లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మహిళా కమిషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, అలాంటప్పుడు వాటి విభజన గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోదని ఉన్నతాధికారి తెలిపారు. వాటిపై ప్రతిపాదనలు ఏమైనా వస్తే అలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆ ఉన్నతాధికారి చెప్పారు. -
ఆ ఇద్దరే దిక్కు..!
సాక్షి, నరసరావుపేట :గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి గ్రామానికి ఓ కార్యదర్శిని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలంలో మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉండే బొల్లాపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీలు, మరో 30 వరకు శివారు తండాలు ఉన్నాయి. మారుమూల ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు ఇక్కడ గ్రామ కార్యదర్శులను నియమించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని గరికపాడు, బొల్లాపల్లి గ్రామాలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 21 పంచాయతీలకు కూడా వీరిద్దరే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తండాల్లో ప్రజలకు ఏఅవసరం వచ్చినా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల కేంద్రానికి వచ్చి గ్రామ కార్యదర్శితో చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, మంచినీరు వంటి సమస్యలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బొల్లాపల్లి మండలంలో రూ. 4,77,520 పన్ను వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 22,023 మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి గ్రామపంచాయతీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలో ఒక్క వెల్లటూరు గ్రామ పంచాయతీ మినహా మిగతా ఏ పంచాయతీలోనూ పన్ను వసూలు రిజిస్టర్లు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆడిట్లో సైతం కేవలం రశీదులు మాత్రమే చూపుతూ రిజిస్టర్లు చూపడంలేదు. పన్ను రిజిస్టర్లు చూపలేదంటూ ఆడిటర్లు రాసుకొని వెళ్లిపోతున్నారు. గత ఏడాది భారీ సంఖ్యలో వీఏఓ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలాన్ని మాత్రం మరిచింది. పంచాయతీల్లో యథేచ్ఛగా నిధుల గోల్మాల్ బొల్లాపల్లి మండలంలోని అనేక పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్, పంచాయతీ, మండలస్థాయి అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయల నిధులను మింగేస్తున్నారు. పేరూరిపాడు పంచాయతీలో 2010లో రూ. 1.75లక్షల నిధులను కాజేసి చెక్‌బుక్‌లు, రికార్డులు సైతం మాయం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి రికార్డులు పంపాల్సిందిగా ఆదేశించారు. ఇది జరిగి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ రికార్డులు చూపలేదు. దీంతో ఈ గ్రామ పంచాయతీలో వున్న రూ. 9లక్షల నిధులను ఖర్చు చేసే వీలు లేకపోవడంతో గ్రామాభివృద్థి కుంటుపడింది. ఇటీవల ఆ గ్రామ మాజీ సర్పంచ్‌పై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మండలంలో ఈఓపీఆర్డిగా పనిచేసిన అధికారి ఒకరు అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 3 లక్షల ఇంటి పన్నులు అక్రమంగా కాజేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారులు వీటిపై దృష్టిసారించకుండా సిబ్బంది కొరత అనే సాకు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం పేరూరిపాడు గ్రామంలో పెద్ద మొత్తంలో నిధులు కాజేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరే కార్యదర్శులు ఉండటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. - డీఎల్పీఓ భాస్కరరెడ్డి