ప్రధాన మంత్రే నేరుగా ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇదే ప్రథమం
న్యూఢిల్లీ: పరిపాలనలో సమూల మార్పులు తెస్తానంటున్న ప్రధాని నరేంద్ర మోడీ అందులో భాగం గా.. బుధవారం అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశమయ్యారు. సంబంధిత శాఖల మంత్రులు లేకుండా, ప్రధాని నేరుగా కార్యదర్శులతో భేటీ కావడం ఇదే ప్రథమం. పాలనలో తన ప్రాధామ్యాలను, అజెండాను, అధికారగణం నుంచి తాను ఆశిస్తున్న అంశాలను దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో మోడీ వారికి వివరించారు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో అవసరమైతే తనను ఫోన్లో కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ సంప్రదించాలని మోడీ వారికి సూచించారు. పాలనపై దుషభ్రావం చూపే కా లం చెల్లిన విధివిధానాలను పాటించాల్సిన అవసరం లేదని, నిబంధనలను సరళీకరించాలని సూచిం చారు. పాలనాసంస్కరణల్లో తన సహకారం ఉంటుందన్నారు. మోడీతో బుధవారం ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వ్యవసాయ శాఖల కార్యదర్శులు వరుసగా అరవింద్ మాయారామ్, అనిల్ గోస్వామి, రాధాకృష్ట మాథుర్, సుజాతాసింగ్, ఆశిష్ బహుగుణ సహా 77 మంది ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. భేటీలో 25 మంది కార్యదర్శు లు తమ విభాగాల సమస్యలను ప్రధానికి వివరించారు. పాలనా సంస్కరణల్లో భాగం గా పలు మంత్రిత్వ శాఖలను విలీనం చేసి మొత్తంమీద 16 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సామాన్యుల ఆకాంక్షలు నెరవేరుస్తాం!
ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చిన దేశ ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 16వ లోక్‌సభ కొలువుతీరడానికి ముందు బుధవారం పార్లమెంటు భవనం ముందు ఆయన కాసేపు మీడియా ముందుకు వచ్చారు. ‘ఈ రోజు 16వ లోక్‌సభకు మొదటి రోజు. దేశంలోని సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నా’ అన్నారు.
కార్యదర్శులతో మోడీ భేటీ
Published Thu, Jun 5 2014 1:27 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement