
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీ, సామాజిక సమీకరణలు, జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రచార సారథిగా ఒక్కరిని నియమించే కంటే ప్రచార కమిటీని నియమించడం బాగుంటుందని చెప్పారు. సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీలతో ఉమ్మడి కమిటీని నియమించే విషయాన్ని పరిశీలించాలని ఏఐసీసీకి సూచించారు.
టీఆర్‌ఎస్ నేత కాంగ్రెస్‌లోకి...
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యాసాగర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment