
కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి
సాక్షి, సంగారెడ్డి: ‘ కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ‘దొరా.. నీ కాల్మొక్తా’ అని ప్రజలు వేడుకోవాల్సిన రోజులు వస్తాయన్నారు. ఉద్యమాల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంది అంతా ఇంత కాదని ఆరోపించారు. దొరల తెలంగాణ కన్నా సీమాంధ్రతో కూడిన తెలంగాణే నయమన్నారు.