కళామ తల్లికి దివ్య మణిహారం | Kaloji Kalakshetra in Warangal with modern touches | Sakshi
Sakshi News home page

కళామ తల్లికి దివ్య మణిహారం

Published Tue, Nov 19 2024 3:07 AM | Last Updated on Tue, Nov 19 2024 3:07 AM

Kaloji Kalakshetra in Warangal with modern touches

ఆధునిక హంగులతో వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం 

నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం 

రాష్ట్ర సాంస్కృతిక రంగంలో ఇదో మైలురాయి 

హనుమకొండ అర్బన్‌: కళామతల్లి శిఖలో మరో మణిహారం కొలువుదీరనుంది. కళల కాణాచి వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. 

ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ప్రజా కవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించను న్నారు. అధునాతన హంగులు, రాజసం ఉట్టిపడేలా రూ.95 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణం ఆకట్టుకుంటోంది. తెలంగాణ కళా, సాంస్కృతిక రంగానికి ఈ క్షేత్రం ఓ మణిహారంగా మారనుంది. 
 
ప్రధాన ఆకర్షణలివీ..
»  హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నంబర్‌ 1066 ‘కుడా’ (హయగ్రీవాచారి కాంపౌండ్‌) భూమిలో 4.20 ఎకరాల్లో నిర్మించారు. 
»   1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 
»   1,127 మందితో ప్రధాన ఆడిటోరియం సీటింగ్‌ సామర్థ్యం  
»  సెంట్రలైజ్డ్‌ ఏసీతో అత్యాధునిక ఆడియో, విజువల్‌ సిస్టమ్‌తో ప్రదర్శనలు 
»  చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాల కోసం ప్రత్యేకంగా నాలుగు మినీ హాళ్లు 
»  గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో కాళోజీ నారాయణరావు ఫొటోలు, జ్ఞాపకాలు, పురస్కారాలను ప్రదర్శిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement