ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఆమోదం
జీఐ జర్నల్‌లో వివరాలు ప్రచురణ
సాక్షి, వరంగల్/సిద్దిపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్) లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్‌తోపాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులు జీఐ గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోని తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాట మిరప చేరింది.
చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’ లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండులాంటి రంగు కలిగి ఉండటం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీనిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment