సీఎం అయ్యాక తొలిసారి
ఓరుగల్లులో పర్యటన
సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం సీఎం పర్యటన ఖరారు అయినప్పటికీ ఢిల్లీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున శనివారానికి వాయిదా పడింది. గ్రేటర్ వరంగల్ సమగ్ర అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించేందుకు ఆయన శనివా రం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మే రకు సీఎంవో వర్గాలు శుక్రవారం సాయంత్రం ము ఖ్యమంత్రి పర్యటన వివరాల్ని విడుదల చేశాయి.
ఇదీ షెడ్యూల్...
ఢిల్లీ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుంటారు. 1.30 నుంచి 1.50 గంటల వరకు టెక్స్‌టైల్ పార్క్ సందర్శిస్తారు. అక్కడి నుంచి రంగంపేట వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ని సందర్శిస్తారు. 2.10 నుంచి 2.30 గంటల వరకు ఆస్పత్రి సందర్శన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు.
2.45 నుంచి 3.00 గంటల మధ్య మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యకలాపాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5.40 నుంచి 6.10 వరకు హంటర్ రోడ్డులోని మెడికోవర్ ఆస్పత్రిని ప్రారంభించి 6.10 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో 7.20 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment