మాట్లాడుతున్న వినోద్‌కుమార్
కరీంనగర్: తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణ చిహ్నంలో 8వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని, కేబినెట్‌లో తీర్మాణం చేసి తొలగిస్తామని, తెలంగాణ చిహ్నం రాచరిక పోకడలకు సూచికగా ఉందని మాట్లాడటం పద్ధతి కాదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలో ఉన్నారని అర్థం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వం 7వేల స్టాప్‌నర్సు, 15వేల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, ద్యావ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి చదవండి: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment