న్యాయవాదుల మద్దతు కోరుతున్న బోయినపల్లి
బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్‌ను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతానని, పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకనవుతానని కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని 60వ డివిజన్ ప్రజలతో సమావేశం అయ్యారు. అనంతరం జిల్లాకోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు రూ.వెయ్యికోట్లతో స్మార్ట్‌సిటీ, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. న్యాయవా దుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగేందుకు తానే కారణమని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లల్లో ఒక్కరూపాయి తీసుకురాలేదని అన్నారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదేళ్లల్లో కరీంనగర్ జిల్లాను 60ఏళ్లల్లో చూడని అభివృద్ధిని చేసి చూపించామని, వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే అత్యధిక నిధులు తెచ్చి మరింత అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు. మేయర్ సునీల్ రావు, తులఉమ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు, రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లాహరిశంకర్ పాల్గొన్నారు.
ఇవి చదవండి: కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్
Comments
Please login to add a commentAdd a comment