boyinpalli Vinodkumar
-
అవకాశమివ్వండి.. ప్రశ్నించే గొంతుకనవుతా : బోయినపల్లి
కరీంనగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్‌ను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతానని, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని 60వ డివిజన్ ప్రజలతో సమావేశం అయ్యారు. అనంతరం జిల్లాకోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు రూ.వెయ్యికోట్లతో స్మార్ట్‌సిటీ, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. న్యాయవా దుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగేందుకు తానే కారణమని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లల్లో ఒక్కరూపాయి తీసుకురాలేదని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదేళ్లల్లో కరీంనగర్ జిల్లాను 60ఏళ్లల్లో చూడని అభివృద్ధిని చేసి చూపించామని, వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే అత్యధిక నిధులు తెచ్చి మరింత అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు. మేయర్ సునీల్ రావు, తులఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు, రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లాహరిశంకర్ పాల్గొన్నారు. ఇవి చదవండి: కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్ -
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం వీణ వంక మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మోటార్ వైండింగ్ షాపులో రిపేరు చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ మోటార్లు కాలి పోయి రిపేరుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు ఏనాడు ఈ పరిస్థితి రాలేదని వివరించారు. కేసీ ఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని, రైతులు, ప్రజలు, యువత, మేధావులు ఆలో చన చేయాలని కోరారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఓ హోటల్లో చాయ్ తాగుతూ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. పవర్‌కట్ ప్రాంతాలు.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు. 11 కేవీ తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని మాణికేశ్వరీనగర్, కార్తీకేయనగర్, విఘ్నేశ్వరనగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
చిహ్నం మార్పు చేస్తే ఊరుకోం.. : బోయినపల్లి వినోద్‌కుమార్
కరీంనగర్: తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణ చిహ్నంలో 8వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని, కేబినెట్లో తీర్మాణం చేసి తొలగిస్తామని, తెలంగాణ చిహ్నం రాచరిక పోకడలకు సూచికగా ఉందని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలో ఉన్నారని అర్థం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వం 7వేల స్టాప్‌నర్సు, 15వేల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, ద్యావ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్ -
'నేను పక్కా లోకల్..' : ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పి జనంలోకి వెళ్లి ఓట్లు అడగుతా. దమ్ముంటే మీరు ఎంపీగా చేసినప్పుడు తెచ్చిన నిధులేమిటో.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో.. చెప్పి ఓట్లడిగే దమ్ముందా?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో రూ.10లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లాజైలు వద్ద రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్, వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే పట్టించుకోని మేధావి వినోద్ కుమార్ అని, ప్రజలను ఎలా గుర్తుపడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో కరీంనగర్ ప్రజలకు తెలుసని, తనపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను జనం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లోకి వెళితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.12వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని స్పష్టంచేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు, జైలు అధికారులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు! -
ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు!
కరీంనగర్: ఐదేళ్లకాలంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదుపైసలు కూడా కేంద్రం నుంచి తేలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. శనివారం హుజూరాబాద్‌లో ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతసభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి హాజరయ్యారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి ఇచ్చే నిధులు కూడా తానే తెచ్చానని సంజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే సంజయ్‌కి గ్రామాలు గుర్తొస్తాయని అన్నారు. ఎంపీగా ఒక్క నవోదయపాఠశాల, ట్రిపుల్ ఐటీ కూడా తేలేకపోయాడన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు స్టార్ట్సిటీ హోదా తెచ్చి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు వివరించారు. బీఆర్ఎస్ను బొందపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వీరి గురువులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోనే అదిసాధ్యం కాలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసి ప్రజ లను మాయ చేశాయని పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు 50వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఇవి చదవండి: బీజేపీలోకి జనార్దన్ రాథోడ్ -
TS Election 2023: మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారు : మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలో గడపగడపకూ వైద్యసేవలు అందుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఆరు నెలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద మెడికల్ కాలేజీని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభలో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీరు వచ్చిందని.. విద్య, వైద్యరంగాల్లో పెను మార్పులు వచ్చాయని భావిస్తే సిరిసిల్లలో నన్ను, వేములవాడ మా లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతోపాటు మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు. త్వరలోనే జిల్లాకు ఆక్వా యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు. అభివృద్ధి సాధించిందని నమ్మితేనే గెలిపించండి.. సిరిసిల్ల అభివృద్ధి సాధించిందని భావిస్తేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉందని, గుండె లోతుల్లోంచి చెబుతున్నానన్నారు. సిరిసిల్ల ప్రజలకు మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారని.. కానీ ఇక్కడి ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఆ మాటలు చెబుతున్నానని స్పష్టం చేశారు. మధ్యమానేరులోకి గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చామని, మల్కపేట రిజర్వాయర్‌తో బీడు భూములకు సాగునీరు వస్తుందన్నారు. 1001 గురుకులాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఉండగా సిరిసిల్ల ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్నానని, వైద్యులు లేక అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మలాదేవి మీకు చేతనైతే డాక్టర్లను నియమించాలని కోరారని గుర్తుచేశారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వంద మంది వైద్యులు అందుబాటులో ఉండి.. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. జబ్బు ఏదైనా.. డబ్బులు లేకుండానే ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు. మోడల్ మెడికల్ కాలేజీగా మార్చుతా.. జిల్లా మెడికల్ కాలేజీని మోడల్‌గా మార్చుతానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్‌లో ప్రారంభించిన అనంతరం ఆయన జ్యోతి వెలిగించి ప్రసంగించారు. కొత్త కాలేజీ, కొత్త భవనం కావడంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి నేను ముందుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే మోడల్ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రజుమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, బి.గౌతమ్‌రెడ్డి, ఆర్డీవో ఆనంద్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు మురళీధర్‌రావు, ఏఎస్పీ చంద్రయ్య, మెడికల్ కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీవన నైపుణ్యాల ఒప్పందం ఆవిష్కరణ! జిల్లాలోని కిశోర బాలికలకు జీవన నైపుణ్య శిక్షణపై టీఐఎస్‌సీ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు ఒప్పంద పత్రాన్ని తీసుకురాగా.. మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు టీఐఎస్‌సీ శిక్షణ ఇవ్వనుంది. 350 నుంచి 10 వేల సీట్లకు.. : బోయినపల్లి వినోద్‌కుమార్ మేము చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 350 మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు 10వేల సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే కసితో ఉన్నామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మరణాలు లేకుండా చూడాలి
కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ వైద్య సేవలపట్ల నమ్మకంతో వస్తున్న పేదల మరణాలు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బోయిన్పల్లి వినోద్‌కుమార్ ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆదివారం తనిఖీచేశారు. జిల్లాలో విషజ్వరాల బారిన పడి ప్లేట్లేట్ తగ్గిపోయి మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి వెళ్లడంతో ఆస్పత్రిని పరిశీలించారు. ముందుగా ఎమర్జెన్సీ వార్డులో అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు. రోజు ఆస్పత్రికి వస్తున్న వారి రికార్డులు పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్యం కోసం వస్తున్న వారికి సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. రోగుల బంధువులు ఫోన్‌చేస్తే సిబ్బంది తమకు తెలియదంటూ ఫోన్ మాట్లాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు పీఆర్వోలను నియమించి సెల్‌ఫోన్ సమకూర్చాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి పిల్లలవార్డును పరిశీలించారు. వార్డులో వైద్యం అందుకుంటున్న పిల్లలు ఎక్కువగా ఉండటంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలంతా విషజ్వరాలతో బాధపడుతున్నారని, ప్లేట్లేట్ కౌంట్ తగ్గి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వైద్యులు వివరించారు. ఆస్పత్రిలో రూ.35లక్షలతో ఏర్పాటుచేసిన ప్లేట్లేట్ మిషన్ అందుబాటులో ఉన్నా ప్లేట్లేట్ అందించలేని పరిస్థితి ఉందని, ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ వివరించారు. స్పందించిన ఎంపీ ఆపరేటర్ నియమాకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూలకు పడిన ప్లేట్లేట్ మిషన్ ఓవరాలింగ్ చేయడానికి ఇంజినీర్‌ను పంపించాలని సంబంధిత శాఖ ఈడీకి ఫోన్‌చేసి చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి ప్లేట్లేట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆస్పత్రిలోని వార్డులు మరమ్మతులు నిర్వహించి రంగులు వేయించాలన్నారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఈడీ రాజేందర్‌కు ఫోన్‌చేసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ బకాయి బిల్లులు రూ.60 లక్షలు పెండింగ్‌లో ఉందని, పారిశుధ్య పనులు నిర్వహణకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆస్పత్రిలో 8మంది వైద్యలు అవసరం ఉందని, ముందుగా డీఎంహెచ్‌వో నుంచి నల్గురు వైద్యులను డెప్యుటేషన్ పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన రెండు నెలల వేతనాలు ఇవ్వాలని సిబ్బంది కోరగా.. వేతనాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ప్రజాప్రతినిధుల ఆమోదంతో తయారుచేసిన ఫైల్‌ను పరిశీలించారు. కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్యను ఫోన్లో కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఆర్ఎంవో లక్ష్మిదేవి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాయకులు కట్ల సతీశ్, వై.సునీల్‌రావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.