సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ అభిమానులు, మద్దతు దారులు భారీ ఎత్తున తరలించారు. ఈ రోడ్ షోలో బీజేపీ పాలక్కాడ్ లోక్‌సభ అభ్యర్థి సీ కృష్ణకుమార్, పొన్నాని నియోజకవర్గం లోక్‌సభ అభ్యర్థి నివేదత సుబ్రమణియన్‌లు సైతం ప్రధాని వెంటే ఉన్నారు.
బీజేపీ ఆశలు నెరవేరేనా
కేరళ బీజేపీ ఆశలు పెట్టుకున్న లోక్‌సభ స్థానాల్లో పాలక్కాడ్ ఒకటి. 2019లో లోక్ సభ ఎన్నికల్లో పాలక్కాడ్ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణకుమార్‌కు 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది 2014లో సాధించిన ఓట్ల కంటే ఆరు శాతం ఎక్కువ. ఇదే స్థానం నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్రో మ్యాన్' ఇ. శ్రీధరన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా శోభా సురేంద్రన్‌కు ఓటమి తప్పలేదు.
మోదీ హోరో..బీజేపీ జోరు
కానీ ఈ సారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ ప‍్రజలు బీజేపీకి పట్టం కడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. మోదీ పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కేరళలో బీజేపీకి విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మరోమారు ఎన్నికల ప్రచారానికి కేరళకు వస్తారని ఆయన పేర్కొన్నారు.
మరోసారి పర్యటన
జనవరి నుండి మోదీ ఐదోసారి కేరళ పర్యటిస్తున్నారు. ప్రధాని వరుస పర్యటనలతో కేరళలో లోక్‌సభ ఎంపీలు లేని బీజేపీ ఈసారి ‘రెండంకెల’ స్థానాలను గెలుచుకుంటుందని సురేంద్రన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment