సార్వత్రిక ఎన్నికల సమరానికి నగరా మోగడంతో దేశం ఇక పార్టీల ప్రచారాలతో హోరెత్తుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య మినహ పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా ఎన్డీయే, ఇండియా కుటముల మధ్య పోరు జరగనుంది. ఉత‍్తరాది ఇండియా కూటమికి, దక్షిణాదాది ఎన్డీయే కూటమికి పరీక్షగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల కీలక నేతలు? గెలుపు - ఓటముల్ని ప్రభావితం చేసే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే..
మహరాష్ట్ర
మహరాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్), శివసేన (శిందే వర్గం), శివసేన (యూబీటీ)లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆయా పార్టీల్లో ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌లు ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అత్యంత కీలక నియోజక వర్గాలుగా నాగ్‌పూర్, బారమతిలు ఉన్నాయి.
మహరాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి -41 సీట్లు, యూపీఏ కూటమికి - 5 సీట్లు, ఇతరులు -2 సీట్లను కైవసం చేసుకోగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హిందూత్వావాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో పాటు, ఎన్సీపీ, శివసేనల్లో చీలికలు ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఏ పార్టీలో ఎంత మంది అభ్యర్ధులు గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది.
తమిళనాడు
తమిళనాడులో గవర్నర్ అర్‌ఎన్ రవి వర్సెస్ అధికార పార్టీ డీఎంకేల మధ్య వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది.
డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. తూత్తుకూడి, శివగంగ నియోజకవర్గాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు, 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే - 24, కాంగ్రెస్- 8, అన్నాడీఎంకే -1లు గెలుపొందగా.. ఈ సారి స్టాలిన్ సంక్షేమ పథకాలు మోదీ కరిష్మా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది.
కర్ణాటక
కర్ణాటకలో కాంగ్రెస్,బీజేపీ, జేడీ(ఎస్)లు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. సిద్ధరామయ్య, బీఎస్,యడియూరప్ప, డి.కే, శివకుమార్, హెచ్‌డీ దేవెగౌడలు కీలక నేతలుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో గుల్బర్గా, హసన్, మాండ్య నియోజకవర్గాలపై ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-25, కాంగ్రెస్-1,ఇతరులు-2 లోక్‌సభ స్థానాల్లో దక్కించుకుంది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందా? అనేది ఆయా పార్టీల అభ్యర్ధుల పనితీరు, అభివృద్దిపై ఆధారపడింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
కేరళ
కేరళలలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలకంగా వ్యవహరిస్తుండగా.. కీలక నేతలుగా పినరయి విజయన్, కె.సురేంద్రన్‌లు ఉన్నారు. కీలక నియోజక వర్గాలుగా తిరువనంతపురం, వయనాడ్‌లు ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్ - 19, ఎల్‌డీఎఫ్ -1 సీట్లు గెలిచాయి. సహకార రంగంలో అవకతవకలు, రైతుల సమస్యలు, సీఎం విజయన్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ప్రభావితం చూపనున్నాయి.
గోవా
గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు ప్రధాన పార్టీలుగా కొనసాగుతుండగా కీలక నేతలుగా ప్రమోద్ సావంత్, అమిత్ పాట్కర్‌లు కీలక నేతలుగా.. ఉత్తర గోవా.. దక్షిణ గోవాలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి.
గోవాలో మొత్తం లోక్‌సభ స్థానాలు-2, అసెంబ్లీ స్థానాలు -40 ఉండగా.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-1, కాంగ్రెస్-1 సీటును దక్కించుకున్నాయి. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, జీఎఫ్‌బీ, శివసేన ఐక్యంగా పోటీ చేస్తుండడం, మోదీ కరిష్మా ఏ విధంగా ప్రభావితం చూపనున్నాయనేది తెలియాల్సి ఉంది.
గుజరాత్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు ఉన్నాయి. భూపేంద్ర పటేల్, సీ.ఆర్. పాటిల్, శక్తి సిన్హ్ గోహిల్‌లు కీలక నేతలుగా రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు.
గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు, 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం లోక్‌సభ స్థానాల్లో విజయదుందుభి మోగిచింది. ప్రధాని మోదీ కరిష్మా, కాంగ్రెస్-ఆప్ కూటమిగా ఏర్పడడంతో ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
అండమాన్ నికోబార్
అండమాన్ నికోబార్, చండీగడ్, దమణ్ దీవ్, లక్ష్య దీప్, పాండిచ్చేరిలలో ఒకటి మాత్రమే లోక్‌సభ స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో అండమాన్ నికోబార్ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. చండీగఢ్‌లో బీజేపీ, దమణ్ దీప్ బీజేపీ,లక్ష్య ద్వీప్‌లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలు ఒక్కోస్థానంలో గెలిచాయి.
కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేదెవరనేది అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment