సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్‌రెడ్డి
రామచంద్రాపురం: ‘జెండాలు జత కట్టడమే వాళ్ల ఎజెండా అయితే.. జనం గుండెల్లో జత కట్టడమే జగనన్న ఎజెండా’ అని తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మిట్టకండ్రిగ, కుప్పంబాదూరు, సీకాలేపల్లి, నెత్తకుప్పం, అనుప్పల్లి పంచాయతీల్లో పర్యటించారు.
స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. హారతులు పట్టి, టపాకాయలు పేల్చి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ బోర్డులు ఆవిష్కరించారు. బైక్ ర్యాలీగా వచ్చి మోహిత్‌రెడ్డికి యువకు లు స్వాగతం పలికారు.
బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం
ఈ నాలుగున్నరేళ్ల సీఎం జగనన్న పాలనలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని మోహిత్‌రెడ్డి కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వారి ఆర్థిక పురోగతికి సంక్షేమ ఫలాలు అందించారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
వై ఏపీ నీడ్స్ జగన్ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకై క సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ప్రశంసించారు. నాణ్యమైనవిద్య, వైద్యం, మెరుగైన పోషణ, జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కుప్పంబాదూరు, నెత్తకుప్పం, కొత్తవేపకుప్పంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రం, వాటర్ ప్లాంట్, ఆర్వో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment