
ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనూరాధ పౌడ్వాల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఆయన నేతృత్వంలోని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆమె , బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, పౌడ్వాల్ తనకు ఇంకా తెలియదని, పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా చేస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment