చక్రాయపేట: గండి క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి సర్వ హంగులు దిద్దుకున్నాక జాతికి అంకితం చేస్తామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గండి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి,వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డిలతో కలసి హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గండి క్షేత్రం అభివృద్ధి చెందిందని చెప్పారు.అప్పట్లోనే టూరిజం రెస్టారెంట్,భక్తులు,అర్చకుల వసతి గృహాలు,సిమెంట్ రోడ్లు, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వంటి పనులు జరిగాయని చెప్పారు.ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు గండిపై శీతకన్ను వేశాయన్నారు.
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆలయం పునర్నిర్మాణానికి రు.16 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.అలాగే రాజగోపురం,ప్రహారి నిర్మాణానికి కూడా మరో రు.6కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్నారు. మళ్లీ అధికారం లోకి రాగానే రెండు విడతల్లో గండిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.మొదటి విడతలో భక్తుల సౌలభ్యం కోసం వంద గదుల నిర్మాణాం,రెండో దశలో గండిలోని టూరిజం రెస్టారెంట్‌ను పూర్తి చేస్తామని వివరించారు.
గండి క్షేత్రంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రూ.23 లక్షలు విరాళంగా అందజేశారు.గండి అభివృద్ధికి నూతన పాలక మండలి శ్రమించాలని ఎంపీ అన్నారు. అంతకుముందు ఎంపీ గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముకుందారెడ్డి, అర్చకులు పూ ర్ణకుంభ స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు చేయించారు. కుడా చైర్మన్ గురుమోహన్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాదరావు, చక్రాయపేట,వేంపల్లె ఎంపీపీలు మాధవీబాలకృష్ణ,గాయత్రి,వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి,మండల సమన్వయకర్త ఓబుళరెడ్డి,కందుల నాని పాల్గొన్నారు.
అభివృద్ధికి పాటుపడుతాం
చక్రాయపేట : గండి క్షేత్రం అభివృద్ధికి పాటు పడతామని ఆలయ నూతన చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు అన్నారు.సోమవారం గండి పాలక మండలి సభ్యులు ఆలయ సహాయ కమిషనర్ ముకుందారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, రవికుమార్ రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న గండి పాలకమండలి చైర్మన్, సభ్యులు
చైర్మన్‌గా కృష్ణతేజ, పాలకమండలి సభ్యులుగా సుబ్బిరెడ్డిగారి జయమ్మ,కొప్పల మునీశ్వరి,ముద్ది కుమారి,బుక్కే లలితమ్మ, కలమల సోమాకళావతి,బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి,పబ్బతి బిందుసాగర్,రాసినేని మధు,బోరెడ్డిగారి వెంకట రామిరెడ్డి,నారుబోయిన సుగుణమ్మ, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రధాన అర్చకుడు కేసరి ప్రమాణ స్వీకారం చేశారు.మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు,ఎంపీటీసీ సభ్యురాలు శాంతమ్మ,పులివెందుల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,ఆలయ మాజీ చైర్మన్ రాఘవేంద్రప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ రామాంజులరెడ్డి, మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment