
సాక్షి,భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు షాకిస్తున్నారు. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్సింగ్ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతాప్ సింగ్.. ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
రాజీనామాకు నిర్దిష్ట కారణాన్ని సింగ్ లేఖలో వెల్లడించనప్పటికీ, పార్టీ నామినేషన్ ప్రక్రియపై తన అసంతృప్తిని ఎత్తిచూపారు. ‘బీజేపీ చెప్పేదానికి, చేసేదానికి తేడా ఉంది’ అని ఉదహరించారు.
मैं भारतीय जनता पार्टी की प्राथमिक सदस्यता से त्याग पत्र देता हूँ। pic.twitter.com/g9De9pSzga
— Ajay Pratap Singh (@mpajaypratap) March 16, 2024
మార్చి 2018లో బీజేపీ తరుపున రాజ్యసభలో అడుగు పెట్టిన ప్రతాప్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. కాగా, బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తనపేరు లేకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment